Latest Updates
-
బ్రహ్మ యోగం ముగింపు.. ఇంద్ర యోగం ప్రారంభం: ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
మీ ముఖంపై వీటిని పొరపాటున కూడా పూయకండి.. లేదంటే మొటిమలతో చిరాకు తప్పదు.! -
వర్షాకాలంలో విహారయాత్ర.. మీ లగేజ్ బ్యాగ్‌లో ఈ ఐదు స్మార్ట్ గ్యాడ్జెట్స్ తప్పనిసరి.! -
కర్ణాటక ఫేమస్ తట్టే ఇడ్లీ..ఒక్కసారైనా తిని తీరాల్సిందే -
మకర రాశిలో చంద్రుడి సంచారం: ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం, ధన లాభం ఖాయం! -
దేవాలయాల్లో గోపురాలపై విగ్రహాలు ఎందుకు చెక్కబడ్డాయి? -
జూన్ 30 చంద్ర సంచారం: మకర రాశిలో చంద్రుడి రాకతో ఈ రాశుల వారికి కెరీర్ లో తిరుగులేదు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి కుజ గ్రహ అనుగ్రహం.. భారీ లాభాలు! - మంగళవారం, 30 జూన్ 2026 -
చిన్న గొడవలకే భార్యాభర్తల మధ్య అహం.. ఈ ఏడు మంత్రాలతో అన్యోన్య బంధం.! -
ఖరీదైన సీరమ్‌లు వద్దు.. ఈ ఒక్క కూరగాయతో మెరిసే ముఖం మీ సొంతం.!
పెళ్లైన స్టార్స్ పై మనసు పారేసుకున్న.. అందాల తారలు
ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో అనే సామెత ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. అలాగే ప్రేమ గుడ్డిది అనే నానుడి కూడా వినే ఉంటారు. ఇవన్నీ వట్టిమాటలే అని చాలా మంది కొట్టిపారేస్టుంటారు. ఎందుకు నమ్మాలి అని ప్రశ్నిస్తుంటారు. కానీ.. ఈ ఆర్టికల్ చదివితే ఈ మాటలు నిజమేనేమో అనిపిస్తుంది.
చాలా మంది హీరోలు, హీరోయిన్స్ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. మరికొందరు బ్రేక్ అప్ లతో ప్రేమకు గుడ్ బై చెప్పారు. కొందరు స్టార్ హీరోస్, స్మార్ట్ హీరోస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొందరు హీరోయిన్స్ బిజినెస్ మ్యాన్స్ ని పెళ్లి చేసుకున్నారు. కానీ.. కొందమంది ముద్దుగుమ్మలు మాత్రం.. పెళ్లైన వాళ్లతో ప్రేమలో పడ్డారు ! ఈ ప్రేమలో సక్సెస్ అయిన వాళ్లు కొందరైతే.. బెడిసికొట్టడంతో ఢీలాపడిన వాళ్లు మరికొందరు.
సాధారణంగా ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు.. అనే సామెతను అబ్బాయిలకే అంకితం ఇచ్చేవాళ్లు. కానీ.. ప్రేమ వయసుతో సంబంధం లేకుండా.. పుడుతుందని.. మన హీరోయిన్స్ నిరూపించారు. అందుకే పెళ్లైన మగమహారాజులతో ప్రేమలో పడిపోయారు మన ముద్దుగుమ్మలు. మరి పెళ్లైన స్టార్స్ తో ప్రేమలో పడిన హీరోయిన్స్ ఎవరో తెలుసుకోవాలనుందా..

నయనతార
సౌత్ సినీ ఇండస్ట్రీలో నయనతార, ప్రభుదేవాల ప్రేమ చాలా విభిన్నమైనది. ఎందుకంటే.. ప్రభుదేవ రామలతాకి భర్త. అయినా.. నయనతార ప్రభుదేవాపై మనుసుపారేసుకుంది. ఈ ప్రేమాయణం.. వాళ్ల ఫ్యామిలీ లైఫ్ లోకి కూడా ఎంటర్ అయింది.

శ్రీదేవి
అతిలోక సుందరి శ్రీదేవి అంటే ఫ్యాన్స్ కి ఎక్కడలేని అభిమానం. ఈ అందాల తార అప్పటికే పెళ్లి అయి.. ఇద్దరు పిల్లలు ఉన్న బోనీ కపూర్ ని పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాకిచ్చింది.

అమల
అలనాటి అందాల ముద్దుగుమ్మ అమల.. అప్పటికే పెళ్లైన కొడుకు ఉన్న మనధ్ముడు నాగార్జునాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాగార్జునకు అమలతో పెళ్లి కంటే ముందు కొడుకు నాగచైతన్యా ఉన్నాడు.

రాధిక
అలనాటి తార రాధికకు పెళ్లి అయింది. కానీ.. ఆ తర్వాత పెళ్లైన నటుడు శరత్ కుమార్ ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వీళిద్దరూ హ్యాపీలైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.

కరీనా కపూర్
కరీనా కపూర్ కూడా పెళ్లైన స్టార్ తో ప్రేమలో పడి సక్సెస్ అయింది. అమ్రుతా సింగ్ తో పెళ్లై విడాకులు తీసుకున్న సైఫ్ అలీఖాన్ ని.. కరీనా పెళ్లి చేసుకుంది.

రాణీ ముఖర్జీ
బాయల్ కన్నాను పెళ్లి చేసుకుని 8 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చిన ఆదిత్యాచోప్రాతో ప్రేమలో పడింది.. హాట్ బ్యూటీ రాణీ ముఖర్జీ.

రేఖ
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ తో రేఖ లవ్ లో ఉందని అందరికీ తెలుసు. అయితే అమితాబ్ బచ్చన్ జయా బచ్చన్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

శిల్పా శెట్టి
హాట్ బ్యూటీ, పొడగుకాళ్ల సుందరి శిల్పా శెట్టి.. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న రాజ్ కుంద్రాని పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది.

డింపుల్ కపాడియా
డింపుల్ కపాడియా, సన్ని థియోల్ మధ్య ఎఫైర్స్ బాలీవుడ్ పాపులర్ అయ్యాయి. అయితే.. వీళిద్దరికీ.. రాజేష్ కన్నా, పూజాలతో పెళ్లి అయింది. కానీ వీళిద్దరూ డేటింగ్ లో ఉన్నారు.

కరిష్మా కపూర్
కరీనా కపూర్ సోదరి కరిష్మా కపూర్. ఈమె సంజయ్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

హేమమాలిని
ఎక్కువ కాంట్రవర్సీకి కారణమైన పెళ్లి హేమమాలిని, ధర్మేంద్రలది. అయితే ధర్మేంద్ర నలుగురు పిల్లల తండ్రి.



Click it and Unblock the Notifications