Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
మగవాళ్ల ఫోర్‌హెడ్‌పై 5గీతలుంటే వందేళ్లు..! మరి గీతలే లేకపోతే ??
అమ్మాయిల గురించి పొడగ్తలంటే.. పెదాలు, బుగ్గలు, కలర్ గురించి మాట్లాడుతారు. మరి అబ్బాయిలంటే.. హైట్, పర్సనాలిటీకే ఎక్కువ మార్కులు. అబ్బాయిలు చూడగానే మహేష్ బాబులా, ప్రభాస్ లా ఉండాలని ఎంతో మంది అమ్మాయిలు కలలు కంటూ ఉంటారు. ఇక అబ్బాయిల్లో సిక్స్ ప్యాక్ కూడా మరింత క్రేజ్ తీసుకొచ్చే విషయం. చక్కటి ఫిజిక్, జిమ్ ఫిట్ కలిగిన అబ్బాయిలు ప్రతి ఒక్కరినీ ఎట్రాక్ట్ చేస్తారు. వాళ్లకుండే పర్సనాలిటీ కేవలం ఎట్రాక్షన్ మాత్రమే కాదు.. అందులోనూ చాలా రహస్యాలున్నాయట..!

అసలు అబ్బాయిల హైట్, హెయిర్..! ఐస్, ఐబ్రోస్..! ఇలా ప్రతి ఒక్కటీ క్రేజే. అయితే ఈ క్రేజీ పర్సనాలిటీ వెనక చాలా సీక్రెట్స్ ఉన్నాయి. హైట్ ఉన్న మగవాళ్లు అదృష్టవంతులైతే, పొట్టిగా ఉన్నవాళ్లు తెలివైనవాళ్లట. అలాగే గడ్డం రూపురేఖలు, పెదాల సైజు, కళ్ల రంగు, కనుబొమ్మల రూపుని బట్టి..
అబ్బాయిల సీక్రెట్స్ తెలుసుకోవచ్చట. అంతేకాదు.. వాళ్ల బలాలు, బలహీనతలు కూడా తెలుసుకోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు అబ్బాయి అయితే మీ పర్సనాలిటీ, అమ్మాయి అయితే మీ పార్ట్ నర్ పర్సనాలిటీ సీక్రెట్ తెలుసుకోండి ? మగవాళ్ల పర్సనాలిటీ వాళ్ల లైఫ్ స్టైల్ గురించి ఏం చెబుతోందో ఇప్పుడే తెలుసుకోండి.

ఎత్తు
ఎత్తుగా ఉండేవాళ్లు లక్కీ పర్సన్స్ అయితే.. పొట్టిగా ఉన్నవాళ్లు తెలివైనవాళ్లు. ఎత్తుగా ఉన్న అబ్బాయిలు గుడ్ పర్సనాలిటీకి సింబల్. ఎత్తుగా ఉన్న వ్యక్తికి శరీరంలోని అన్ని భాగాలు ఎత్తుకి తగ్గట్టు ఉంటే.. కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తాడట. పొట్టిగా ఉన్న వ్యక్తి సెక్సీ నేచర్ కలిగి ఉంటాడు. కొన్ని సందర్భాల్లో చాలా తెలివైన వాళ్లు అలాగే.. కన్నింగ్ కూడా.

తల
రౌండ్ హెడ్ ఉంటే పాలకుడు, చిన్న తల ఉంటే.. దురదృష్టవంతుడు. తల గుండ్రంగా పెద్దగా ఉంటే.. అలాంటి వ్యక్తి మంచి పరిపాలకుడవుతాడు. అలాగే జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. తలలో బాగా వెంట్రుకలు ఉంటే.. తెలివైన, మంచి గుణాలు కలిగిన వ్యక్తి. పొడవు కంటే ఎక్కువ వెడల్పుగా తల కలిగిన వ్యక్తులు సంపద పొందడంలో దురదృష్టవంతులుగా చెప్పవచ్చు. తల సన్నగా ఉంటే.. తెలివి తక్కువగా ఉంటారు. అలాగే అన్ని విషయాల్లో సక్సెస్ కాలేరు.

జుట్టు
ఒత్తుగా జుట్టు ఉంటే పూర్, ఎర్ర జుట్టు ఉంటే.. లీడర్ అని సంకేతం. తలపై జుట్టు నల్లగా, ఒత్తుగా ఉంటే.. ముఖ్యమైన లక్షణాలు కలిగి ఉంటాడు. జుట్టు నల్లగా, పలుచగా ఉంటే.. ప్యాషినేట్ గా ఉంటాడు. ఒకవేళ జుట్టు రెడ్డిష్ గా ఉంటే.. అతని జీవితం చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఒకవేళ జుట్టు ఒత్తుగా, రఫ్ గా ఉంటే.. అతను పేదరికంలో ఉంటాడు. ఒకవేళ రెడ్ కలర్ హెయిర్ ఉంటే.. ఒక సెక్షన్ లేదా కమ్యునిటీ లేదా ఆర్మీలో హెడ్ గా ఉంటాడు.

నుదురు
నుదురు వెడల్పుగా ఉంటే.. నేర్పరి, తక్కువగా ఉంటే షార్ట్ లైఫ్. నుదురు పెద్దగా వెడల్పుగా ఉంటే.. ఉదారస్వభావం కలిగినవాళ్లు, తెలివైనవాళ్లు. ఒకవేళ నుదుటి భాగం సన్నగా ఉన్నవ్యక్తి తెలివితక్కువవాళ్లు. అలాగే షార్ట్ లైఫ్ ఉండే అవకాశముంది. ఒకవేళ నుదురు భాగం వంపుగా ఉండి, వెడల్పుగా ఉంటే.. అతను ఐశ్వర్యవంతుడు. ఒకవేళ నుదరు భాగం పెద్దగా, వెడల్పుగా ఉంటే.. తెలివైన, ఐశ్వర్యవంతుడు.

నుదురుపై గీతలు
ఏ వ్యక్తి నుదురుపై 5 గీతలు ఉంటాయో అతను వందేళ్లు జీవితం ఉంటుంది. అలాగే వందేళ్లకు సరిపడా సంపాదిస్తాడు. ఒకవేళ నుదురుపై నాలుగు గీతలు ఉంటే.. 80 ఏళ్లు బతుకుతాడు. ఒక వేళ ఒక గీత ఉంటే 40ఏళ్లు, రెండు గీతలు ఉంటే 60ఏళ్లు, మూడు గీతలుంటే.. 70 ఏళ్లు జీవిస్తాడు. అసలు గీతలే లేకపోతే.. తక్కువ జీవితకాలం ఉంటుంది.

ఐబ్రోస్
విల్లులాంటి కనుబొమ్మలు కలిగిన ఉన్న వ్యక్తి ఐశ్వర్యవంతుడైతే.. తక్కువ కనుబొమ్మల హెయిర్ ఉన్నవ్యక్తి దురదృష్టవంతుడు. విల్లులాగా కనుబొమ్మలు వంపు తిరిగి ఉన్న మగవాళ్లు సౌకర్యవంతమైన జీవితం అనుభవిస్తారు. ఒక వేళ చేపలాంటి ఆకారం ఉంటే.. అతను దొంగయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ రెండు కనుబొమ్మలు కలిసిపోయి ఉంటే.. ఉదారస్వభావం కలిగి ఉంటాడు. కనుబొమ్మలపై తక్కువ హెయిర్ ఉన్న వ్యక్తి తెలివి తక్కువ వాడై ఉంటాడు. అలాగే దురదృష్టవంతుడై ఉంటాడు.

కళ్లు
ఎరుపు కళ్లు ఉంటే.. మంచి అభిరుచి కలిగిన వ్యక్తి, లోపలికి కళ్లు ఉంటే అతన్ని నమ్మడానికి వీలులేదని సంకేతం. కళ్ల చివరి భాగం ఎర్రగా ఉంటే.. అతను చాలా పాపులర్ అవుతాడు. కళ్లు మొత్తం ఎర్రగా ఉంటే.. అభిరుచి బాగుంటుంది. ఎప్పుడైతే కళ్లు లోపలికి ఉంటాయో అతను ద్రోషం, నమ్మడానికి వీలు లేని వ్యక్తి అని గుర్తించాలి. ఎల్లో కలర్ కళ్లు ఉన్నవ్యక్తి తన జీవితాన్ని తృప్తిగా ఎంజాయ్ చేస్తాడు. ఒకవేళ కళ్లు తెల్లగా ఉంటే.. అతను తెలివైనవాడు. గోధుమరంగులో ఉంటే.. సొంతంగా పనిచేసుకునే వ్యక్తి. కళ్లు గుండ్రంగా ఉంటే.. అతను దొంగతనాలకు పాల్పడే ఛాన్స్ ఉంది.

చెవులు
చెవులు చిన్న సైజులో ఉంటే.. మూర్ఖత్వ వైఖరి కలిగి ఉంటాడు. పొడవు చెవులు కలిగి ఉన్న వ్యక్తి చాలా కొన్ని సందర్భాల్లో తెలివైనవాడిగా ప్రదర్శిస్తాడు. ఒకవేళ మగవాళ్ల చెవులు గట్టిగా, రాయిలా ఉంటే.. అతని శరీరం చాలా బలంగా, లావుగా ఉంటుంది. ఒకవేళ చెవులు పల్చగా ఉంటే.. అతను రాజు లేదా.. స్కాలర్ అవుతాడు. మందంగా చెవులు కలిగిన వ్యక్తి.. మోసపూరితమైనవాడు. నమ్మసక్యంకాని వ్యక్తి అవుతాడు.

ముఖం
గుండ్రటి ముఖం కలిగిన మగవాళ్లు అదృష్టవంతులు. అలాగే చాలా జోవియల్ గా ఉంటాడు. మనుషులతో కలవడం, మాట్లాడటాన్ని ఇష్టపడతారు. ఒకవేళ ముఖం పెద్దగా ఉంటే.. అతను తెలివి తక్కువైన వ్యక్తి. అలాగే దురదృష్టవంతుడు కూడా.

ముక్కు
ముక్కు పొడవుగా, పసుపు వర్ణంలో ఉన్న మగవాళ్లు ఐశ్వర్యవంతులు, అదృష్టవంతులు. ముక్కు చాలా పొడవుగా ఉన్న వ్యక్తి సిగ్గులేనివాళ్లు. ఒకవేళ ముక్కు సన్నగా ుంటే.. అతను మతవిశ్వాసాలు కలిగిన వ్యక్తి, జాలి కలిగిన వ్యక్తి. చిలుకలాంటి ముక్కు ఉండే వ్యక్తి ఐశ్వర్యవంతులు, అదృష్టవంతుడు. ముక్కు మధ్యలో లోపలికి పోయినట్టు ఉంటే.. చాలా తెలివైన వ్యక్తి. అదే ముక్కు మధ్యభాగంలో పైకి లేచినట్టు ఉంటే.. అతని ఆలోచనలు చాలా మెచ్యూర్ గా ఉంటాయి. మంచి ప్లానింగ్ ఉంటుంది. అలాగే ఐశ్వర్యవంతుడు.

బుగ్గలు
బుగ్గులు పైకి ఉంటే.. సెల్ఫిష్. నవ్వినప్పుడు గానీ, మాట్లాడినప్పుడు గానీ సొట్టపడిత.. అతను చాలా అదృష్టవంతుడు. ఐశ్వర్యవంతుడు. బుగ్గులు లోపలికి పోయినట్టు, వెడల్పుగా ఉంటే.. అతను రూలర్. పవర్ ని ఎంజాయ్ చేయగలుగుతాడు.

గడ్డం
పొడవుగా, కిందకి వాలినట్టు గడ్డం ఉన్న మగవాళ్లు టాకటివ్. గడ్డంపై తక్కువ వెంట్రుకలు ఉంటే.. అతను స్వార్థపరుడు. చాలా కోపిష్టి. ఒకవేళ గడ్డంపై వెంట్రుకలు లేకపోతే అతను పిరికి వ్యక్తి.

నోరు
పెద్ద నోరు ఉన్న మగవాళ్లు బోల్డ్ నేచర్ కలిగి ఉంటారు. వెడల్పుగా నోరు ఉంటే.. అది అన్ లక్కీ. ఒకవేళ నోరు సన్నగా ఉంటే.. అత్యశ, జగడాలమారి, చెడు స్వభావం కలిగిన వ్యక్తి.

పెదాలు
మగవాళ్ల పెదాలు ఎర్రగా ఎవరికైతే ఉంటాయో అతను రకరకాల ఆశలు కలిగి ఉంటాడు. ఒకవేళ పెదాలు నల్లగా, పొడవుగా లేదా వెడల్పుగా ఉంటే.. అనారోగ్యానికి సంకేతం. అలాంటి వ్యక్తి కలంగాలు ఉంటాయి. సన్నటి పెదాలు తెలివికి సంకేతం. ఒకవేళ కింది పెదవి పెద్దగా, పొడుచుకువచ్చినట్టు ఉంటే హార్ట్ వర్క్ చేసే తత్వం కలిగిన వ్యక్తి.



Click it and Unblock the Notifications