Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ వ్యక్తిత్వం మీ చేతి ఆకారంపై ఆధారపడి ఉంటుందా ?
కళ్లు ఆత్మకి ప్రతిరూపం కావచ్చు.. కానీ మెదడుకి మాత్రం చేతులే పరికరాలు. మన చేతులు బ్రెయిన్ కి చాలా బాగా కనెక్ట్ అయి ఉంటాయి. మనకు తెలియకుండానే.. మన మెదడుకి సీక్రెట్స్ ని పంపిచేస్తాయి చేతులు. ఒకవేళ మనం తప్పుగానో, అపద్దాలో మాట్లాడవచ్చు. కానీ చేతులు మాత్రం అపద్ధం చెప్పవు. అందుకే మన చేతి ఆకారం మన పర్సనాలిటీ గురించి చక్కగా వివరిస్తుందని తాజాగా ఓ అధ్యయనం చెబుతోంది. ఇలా చేతి ఆకారంతో వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడాన్ని ఖీరోగ్నోమీ అంటారు. ఈ పదం గ్రీకు నుంచి పుట్టింది. ఇంతకీ ఈ ఖీరోగ్నోమీ మీ చేతి షేప్ ఆధారంగా.. మీ స్వభావాన్ని ఎలా వివరిస్తుందో చూద్దాం..
మీ కాలి వేళ్లను గమనించారా ? అక్కడే ఉంది అసలు జాతకం !!

పొట్టిచేయి ఆకారం
ఇది చాలా సాధారణంగా కనిపించే చేతి ఆకారం. ఇలాంటి ఆకారంలో చేయి మందంగా ఉంటుంది. పొట్టిగా ఉంటుంది. వేళ్లు కూడా చాలా పొట్టిగా కనిపిస్తాయి. అలాగే బొటనవేలు కూడా పొడవు తక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆకారం కలిగిన వాళ్లకు కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే హింసాత్మక ఆలోచనలు ఉంటాయి. దూకుడు స్వభావం కలిగి ఉంటారు. తమ ప్రాథమిక అవసరాలైన నిద్ర, ఆహారం, నీళ్లు ఉంటే చాలు అనుకుంటారు. ఇవన్నీ ఉంటే సంతృప్తి చెందుతారు.
చేతి గోళ్లను బట్టి పర్సనాలిటీ అంచనా వేయవచ్చా ?

పొడవాటి చేయి ఆకారం
పొడవుగా ఉండే చేతులు చాలా అందంగా ఉంటాయి. సన్నగా, పొడవుగా వేళ్లు ఉంటాయి. బాదం ఆకారంలో గోళ్లు ఉంటాయి. వీళ్లకు కోపం చాలా తక్కువగా ఉంటుంది. కానీ..వీళ్లు త్వరగా ఇతరుల ప్రభావానికి లోనవడం వల్ల హానికి గురవుతారు. వీళ్లు కలలు సాకారం చేసుకుంటారు.
కళ్ల ఆకారం చెప్పె ఆశ్చర్యకర అంశాలు

పొడవుగా, ఎముకలే ఎక్కువగా ఉండే ఆకారం
ఈ ఆకారం కలిగిన చేతులు చాలా పొడవుగా ఉంటాయి. ఎముకలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే.. వేళ్లు వంపులు తిరిగి ఉంటాయి. చాలా పలుచటి వేళ్లు ఉంటాయి. అరచేయి చతురస్రాకారంలో ఉంటుంది. జ్ఞానం సంపాదించడంలో చాలా చురుగ్గా ఉంటారు. వీళ్లు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో వీళ్లను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. వీళ్ల సంపాదన చాలా ఎక్కువగా ఉంటుంది.
సిగరెట్ తాగే విధానమే.. వ్యక్తిత్వాన్ని తెలుపుతుందని తెలుసా ?

చతురస్రాకారం చేయి ఆకారం
చేయి చతురస్రాకారంలో ఉంటుంది. అంటే వేళ్లు, గోళ్లు, అరచేయి అంతా చతురస్రాకారంలోనే కనిపిస్తుంది. బొటనవేలు పొడవుగా ఉంటుంది. చేయి మొత్తం చతురస్రాకారంలో కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఆకారంలో చేయి కలిగిన వాళ్లు చాలా నిజాయితీగా ఉంటారు. స్నేహితులను నమ్ముతారు. వాళ్లకు తనపై నమ్మకం కుదిరేలా ఉంటారు. అయితే తమ అఫెక్షన్ చూపించడంలో ఫెయిల్ అవుతారు. ఇలాంటి చేయి ఆకారం కలిగిన వాళ్లు వ్యాపారస్తులుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, సైంటిస్ట్ లుగా రాణిస్తారు. సక్సెస్ అవుతారు. డబ్బు సంపాదించడంలోనూ వీళ్లు సక్సెస్ అవుతారు.



Click it and Unblock the Notifications