Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
షాకింగ్ న్యూస్..!! మన జీవితకాలంలో 25 ఏళ్లు నిద్రకే సరిపోతాయట..!!
మనం ఏ మాత్రం తీరిక దొరికినా నిద్రపోవడం, షాపింగ్ చేయడం, లేదా రెస్ట్ తీసుకోవడం చేస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైనా ఊహించారా మన జీవిత కాలంలో దేనికి ఎంత టైం కేటాయిస్తున్నాము అనేదాన్ని. నిజమే.. మనం ఒక్కో పనికి జీవితకాలంలో ఎంత టైం కేటాయిస్తామో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది.
రోజూ రాత్రి నిద్రలో ఒకే సమయానికి మెలకువ వస్తే దేనికి సంకేతం ?
టైం ఎలా పనిచేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవడం కష్టమే. చాలామంది తమకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, కానీ చేయడానికి టైం కొంచమే ఉందని చెబుతుంటారు. ఫ్రెండ్ తో చాటింగ్ చేసేటప్పుడు, ఇష్టమైన వాళ్లతో వెకేషన్ కి వెళ్లినప్పుడు మాత్రం టైం ఎలా గడిచిపోతోందో కూడా తెలియదు.
ఉదయం 3గంటల సమయాన్ని డెవిల్ అవర్ అని ఎందుకంటారు ?
కానీ కాలేజీలో బోర్ గా ఉండే క్లాస్ వినేటప్పుడు మాత్రం టైం ఎంత సేపటికి కదలడం లేదని ఫీలవుతుంటాం. టైం పూర్తీగా ఆగిపోయిందేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే మన జీవిత కాలంలో ఒక్కో పనికి ఎంత సమయం కేటాయిస్తామో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. మన జీవితంలో భాగమైన నిద్ర, తినడం, టీవీ చూడటం వంటి పనులకు ఎంత టైం కేటాయిస్తామో మీరే చూడండి. ఇవి మాత్రమే కాదు.. మరిన్ని ఆసక్తికర విషయాలు కూడా ఉన్నాయి.

నవ్వడానికి
మన జీవితకాలంలో నవ్వడానికి మనం ఎంత సమయం కేటాయిస్తామో తెలుసా ? ఉదాహరణకు మన జీవితకాలం 60 ఏళ్లు అయితే.. అందులో నాలుగు నెలల నవ్వడానికే సరిపోతాయట.

ముద్దుకి
మన జీవితకాలంలో ముద్దు పెట్టుకోవడానికి 14 రోజుల సమయాన్ని కేటాయిస్తాం. మిగిలిన సమయం గొడవ పడటానికేనేమో.. బీ కేర్ ఫుల్..

ఆన్ లైన్
ప్రస్తుతం ఎవరు చూసినా.. ఇంటర్నెట్ కి అడిక్ట్ అయిపోయారు. బస్ లో, ఇంట్లో, ఆఫీస్ లో ఎక్కడ చూసినా.. ఫోన్ లేదా ట్యాబ్ లు ఓపెన్ చేసి.. ఇంటర్నెట్ లో గడిపేస్తారు. మరి మన జీవిత కాలంలో మనం ఆన్ లైన్ లో గడిపే సమయం 11 ఏళ్లట. మన జీవితకాలంలో ఎక్కువ భాగం ఆన్ లైన్ లో గడపడానికే కేటాయిస్తామట.

నిద్రకు
మన జీవిత కాలంలో నిద్రపోవడానికి మూడోవంతు కేటాయిస్తాం. అంటే.. 25 ఏళ్లు నిద్రకే సరిపోతాయట.

టీవీ చూడటానికి
టీవీ చూడటం ఇష్టపడని వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అందుకే.. మన జీవితకాలంలో మనం టీవీ చూడటానికి 9 ఏళ్లు కేటాయిస్తాం. టీవీకి మనం ఎంత అడిక్ట్ అయ్యామో దీన్ని బట్టి తెలుస్తోంది కదూ..

పనిచేయడానికి
మన జీవితకాలంలో వర్క్ లైఫ్ కి 10 ఏళ్లు కేటాయిస్తామట.

ఇంట్లోనే
మన జీవితకాలంలో షాపింగ్ లు, షికార్లు కాకుండా.. ఇంట్లోనే గడపడానికి కేటాయించేది 87 శాతం సమయట. అందుకే.. అమ్మలంతా.. ఇంట్లోనే ఉంటున్నామని.. కంప్లైంట్ చేస్తుంటారు.

తినడానికి
రోజుకి మూడుసార్లు ఆహారం తింటాం. ఇక మధ్య మధ్యలో స్నాక్స్, బయటకు వెళ్లినప్పుడు టైంపాస్ తిండి.. ఇలా మొత్తం కలిపి మన జీవిత కాలంలో తినడానికి మనం కేటాయించే సమయం నాలుగేళ్లు.

స్మార్ట్ ఫోన్
మన లైఫ్ లో భాగమైపోయిన స్మార్ట్ ఫోన్లు చూడటానికి కూడా ఎంత సమయం కేటాయిస్తామో తెలుసా ? స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ని మన జీవితంలో 4 ఏళ్లు చూస్తామట. దీనికి ఏమైనా అర్థముందా. లేదు.. కానీ.. మనం చూడకుండా ఉండలేం.



Click it and Unblock the Notifications
