Latest Updates
-
ముంబై స్టైల్ మసాలా ప్యాటీస్ పావ్.. వర్షం పడుతుంటే వేడివేడిగా తింటుంటే మస్త్ మజా..! -
శని దేవుడి కటాక్షం: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే! -
మనసు ప్రశాంతంగా ఉండట్లేదా? పురాతన హిందూ ధ్యాన పద్ధతులు జీవితాన్నే మార్చేస్తాయి -
వివాహిత స్త్రీ వేరొకరి పట్ల ఆకర్షితురాలవుతోందని సూచించే సంకేతాలివే! -
రాహుకాలం అంటే ఏంటి? ఈ టైంలో పుడితే అన్నీ కష్టాలేనా?..అదృష్టాన్ని తెచ్చే జ్యోతిష్య రహస్యం! -
ఫోన్ పాస్వర్డ్లే ఇప్పుడు భార్యాభర్తల మధ్య పెద్ద అనుమానాలకు కారణమవుతున్నాయా -
సండే స్పెషల్: పప్పుచారులోకి అదిరిపోయే సైడ్ డిష్ గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై..ఇంట్లోనే ఇలా ఈజీగా -
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా? -
రెచ్చిపోయి తినేంత రుచి..అరిటాకులో పొట్లం చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా! -
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్
గోల్డ్ (బంగారం) గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ..!!
బంగారం ఈ పేరు వినగానే ఆడవారి కళ్ళల్లో చెప్పలేని ఆనందం.. చివరకు జీవిత భాగస్వామిని కూడా వారు బంగారంతో పోల్చుకుంటారు.. రోజు రోజుకి తన విలువని పెంచుకుంటూ పోతున్నా బంగారం అంటే మనిషులకి ఎక్కడలేని ప్రేమ. ?అందుకే సంపాదించిన డబ్బుతో ఎక్కువగా బంగారాన్నే కొంటుంటారు. ఎవరినైనా గొప్పవారిగి చెప్పాలి అనుకున్నప్పుడు ''బంగారం లాంటి మనిషి'' అంటుంటారు.
ఆడవారికి , బంగారానికి ఉన్న సంబంధం గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతగా మన జీవితంలో పెన వేసుకున్న బంగారం గురించి అంత క్రేజ్ ఉంది బంగారానికి.. అయితే ఈ బంగారానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మీకు తెలియజేస్తున్నాం..

బంగారాన్ని తిన వచ్చని మీకు తెలుసా..
బంగారానికి సంబంధించిన నిజాలలో ఇది చాలా వింత అయిన నిజం. బంగారం తినదగిన పదార్ధం. ప్రపంచం నలుమూలలో ఉన్న విలాసవంతమైన రెస్టారెంట్లు కంటికి ఇంపుగా ఉండటం కోసం బంగారపు రేకులు వేసి రుచి కరమైన పదార్ధాలని తయారు చేస్తాయి.

ఆర్ఠరైటిస్ ట్రీట్‌మెంట్
రుమటాయిడ్ ఆర్ధరైటిస్ తో బాధపడే వారికి రసాయినిక క్రియ ద్వారా బంగారాన్ని ద్రవ రూపం లోకి మార్చి నరాల్లోకి ఎక్కిస్తారు.ఇలా చేయడం వల్ల రోగం తగ్గే అవకాశం దాదాపు 70 శాతం ఉంది.

చాలా అరుదుగా దొరికే లోహం..
భూమి మీద అత్యంత అరుదుగా లభించే లోహాలలో బంగారం ఒకటి అని తెలుసుకోండి. ఎందుకంటే వజ్రాన్ని కనుగొనడం కంటే ఒక ఔన్సు బంగారాన్ని కనిపెట్టడం కష్టం.

బరువైన లోహం..
ఒక క్యూబిక్ అడుగు బంగారం సగం టన్ను బరువుతో సమానం. ప్రపంచంలో దొరికిన అతి పెద్ద బంగారు కడ్డీ దాదాపు 250 కేజీలు ఉంది.

బంగారం కరుగుతుంది..
మీరు నిత్యం ఆభరణాలు ధరిస్తుంటే సంవత్సరానికి 6 మిల్లీ గ్రాములు కరిగిపోతుందని మీకు తెలుసా..

సముద్ర గర్భం లో లభ్యమవుతుంది:
ఒక క్యూబిక్ మైలు మహాసముద్రంలో 25 టన్నుల బంగారం ఉంటుంది.. భూమి మీద ఉన్న అన్ని మహా సాగరాలలో దాదాపు బిలియన్ టన్నుల బంగారం ఉంటుంది. కానీ సముద్ర గర్భంలోకి ప్రవేశించడం అత్యంత క్లిష్టమైనది.

కేవలం 20 శాతం మాత్రమే ఉపయోగిస్తున్నారని
ప్రపంచం లోని ప్రజలందరూ మనకి లభ్యమయ్యే బంగారంలో కేవలం 20 శాతం మాత్రమే ఉపయోగిస్తున్నారని తెలుసా.. మిగతా 80 శాతం భూమి పొరల్లో కప్పబడి వెలికితీయడానికి అసాధ్యంగా ఉంది.

”గోల్డ్” అనే పదం
"గోల్డ్" అనే పదం పురాతన ఆంగ్ల పదమైన "గిఓలూ" అనే పదం నుండి పుట్టింది. ఈ మాట కి అర్ధం పసుపు రంగు అని. బంగారానికి సంబంధించిన నిజాలలో ఇది కూడా ఒకటి..

గోల్డ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
ఇండియాలో ప్రజల వద్ద, వివిధ దేవాలయాల వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా? అక్షరాలా 2.2 కోట్ల కిలోలు. ప్రభుత్వ ఖజానాలో ఉన్న బంగారం దీనికి అదనం.

గోల్డ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
బంగారం విలువ తెలిసిన తరువాత ఇప్పటివరకూ 17.50 కోట్ల కిలోల బంగారాన్ని గనుల నుంచి వెలికి తీసినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా.

గోల్డ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
ఔన్సు బంగారాన్ని (సుమారు 28.3 గ్రాములు) 10.7 చదరపు గజాల పల్చటి రేకులా సాగదీయవచ్చు.

గోల్డ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
బంగారాన్ని ఎంత పల్చగా చేయవచ్చంటే, టార్చిలైటు కాంతి అవతలివైపుకు వచ్చేంత!

గోల్డ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
ప్రపంచంలోని బంగారాన్ని 5 మైక్రాన్ల మందంగల తీగగా మార్చి భూమి చుట్టూ తిప్పితే, కోటీ పన్నెండు లక్షల చుట్లు తిరగాల్సి వుంటుంది.

గోల్డ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
1973లో 12 వేల టన్నుల బంగారం నిల్వలు దాచుకున్న అమెరికా వద్ద ఇప్పుడు 6,700 టన్నులు మాత్రమే ఉంది. ఇందులో 5.3 లక్షల కిలోల బంగారం ఇటుకల రూపంలో ఉంది.

గోల్డ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
10 వేల స్మార్ట్ ఫోన్ల నుంచి బంగారాన్ని తీస్తే 311 గ్రాములు లభిస్తుంది. 200 ల్యాప్ టాప్ లను ప్రాసెస్ చేస్తే 155 గ్రాముల బంగారం తీయవచ్చు.

గోల్డ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
ప్రపంచంలో 100 కిలోల బంగారు నాణెం కెనడాలో ఉండగా, ఆస్ట్రేలియాలో టన్ను బరువున్న నాణెం ఉంది.

గోల్డ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
బంగారాన్ని కరిగించాలంటే 1,064 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి.

గోల్డ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
చంద్రుడిపైకి అమెరికా పంపిన కొలంబియా స్పేస్ షటిల్ లో 40 కిలోల బంగారాన్ని వాడారు.

గోల్డ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
బంగారాన్ని చూసి మీరు భయపడతారా? అయితే మీకు ‘ఆరోఫోబియా' ఉన్నట్టే!



Click it and Unblock the Notifications