Latest Updates
-
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు!
ఖజురహో శిల్పాలలో దాగున్న ఆసక్తికర రహస్యాలు
కొండలే అయినా.. మనసు దోచే కళాఖండాలు. రాళ్లే అయినా.. రమ్యమనిపించే అద్భుతాలు. బొమ్మలే అయినా.. నాట్యాన్ని కళ్లకుకడతాయి. ప్రపంచంలోనే అద్భుతం అనిపించే.. అరుదైన కళారీతి ఈ ఖజురహో శిల్పాలు. వాస్తవానికి దగ్గరగా.. మనసుని హత్తుకునేలా.. ఆలోచనలు పరవళ్లు తొక్కేలా.. రూపుదిద్దుకున్నవే ఈ శిల్పాలు. చూడగానే.. ఎన్నో భావాలు, ఉద్వేగాలు మనుసులో స్మరించేలా శిలలు ఆవిష్కరించబడ్డాయి.
READ MORE: ఇండియాలోని పురాతన ఆలయాల్లో దాగున్న అంతుచిక్కని రహస్యాలు
ఖజురహో క్షేత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. భోపాల్‌కు 388 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవీ జగదాంబ ఆలయం, విష్ణుమూర్తి, చిత్రగుప్తుని ఆలయం, పార్వతి, గంగామాత... ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని సాండ్ స్టోన్ తో నిర్మించారు. ఇవి బఫ్, పింక్, లేత పసుపు వర్ణాల్లో ఉంటాయి. ఈ శిల్పాలన్నీ ఎక్కువగా స్ర్తీ, పురుషుల సంబంధాన్ని ఉద్ధేశించబడే ఉంటాయి.

ఛందేలా రాజపుత్రుల కృషికి జేజేలు కొట్టాలనిపించే ఖజరహో ఆలయాల నిర్మాణానికి ఒకటి కాదు రెండు కాదు.. వందేళ్లు పట్టింది. క్రీ.శ. 950 నుంచి 1050 మధ్యకాలంలో మధ్యప్రదేశ్ లోని భోపాల్ ఈ ఖజరహో శిల్పాలను ఛందేలా రాజపుత్ర రాజులు నిర్మించారు. కళా నైపుణ్యానికి, సృజనాత్మకతకు ఈ ఆలయాలు అద్దంపడతాయి. 80 ఆలయాలు నిర్మించగా.. ప్రస్తుతం 22 మాత్రమే ఉన్నాయి.
అద్భుత శిల్ప సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తాయి ఈ ఆలయాలు. ఈ అబ్బురపరిచే అద్భుత కళానైపుణ్యం దాగున్న ఈ ఆలయాలను నిత్యం వేలాది మంది దేశ, విదేశీయులు సందర్శిస్తారు. శృంగార దేవతల చిత్రాలున్న ఖజురహో శిల్పసౌందర్యం చూపరుల మనసు దోచుకుంటుంది. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయ శిల్ప సంపద శృంగారానికి ప్రతీకగా ఉండటంతో.. చాలా ప్రసిద్ధి చెంది.. పర్యాటకులను రారమ్మంటుంది. అందుకే ఈ ఖజురహోని హార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ గా పిలుస్తారు.

11వ శతాబ్ధంలోని జీవనశైలిని వివరిస్తూ.. ఈ ఆలయ శిల్పకళలు ఉంటాయి. ఖజుర్ అంటే ఖర్జూరం చెట్టు పేరు ద్వారా ఖజురహో అనే పేరు వచ్చింది. ఇక్కడ అనేక హిందూ, జైన దేవాలయాలు ఉండటమే విశేషం. ఈ ఆలయాలను 20లలో కనుగొన్నారు. మధ్యయుగ కాలంలో.. భారతీయ శిల్పకళాకారుల గొప్పదనాన్ని ఈ ఆలయాలు కళ్లకుకడతాయి. అలాగే కొన్ని సినిమాల్లో కూడా ఖజురహో విశిష్టతను వివరించాయి. ఫేమస్ హీరో చిరంజీవి సినిమాలో ఖజురహో ప్రేమ అనే పాట కూడా సూపర్ హిట్ కొట్టింది.



Click it and Unblock the Notifications