For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్మైల్ గురించి మీకు తెలియ‌ని.. స‌ర్‌ప్రైజింగ్ ఫ్యాక్ట్స్..

By Swathi
|

చిరున‌వ్వుకి ఎవ‌రైనా ఫిదా అయిపోవాల్సిందే. అమ్మాయి న‌వ్వుకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఎవ‌రినైనా ప‌ల‌క‌రిచ్చేట‌ప్పుడు చిన్న చిరున‌వ్వు చిందిస్తే అందం, ఆప్యాయ‌త‌. అయితే చిరున‌వ్వు ఆరోగ్యానికి కూడా ఎంతో ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంది. అయితే ఎలాంటి కార‌ణం లేకుండా న‌వ్వ‌డానికి ఇప్ప‌టికీ.. చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు.

మ‌నం సాధార‌ణంగా న‌వ్వుకి కార‌ణం ఉంటేనే న‌వ్వుతాం. అలాగే ఏదైనా గుడ్ న్యూస్ లేదా ఏదైనా సంతోష‌క‌ర‌మైన విశేషం ఉంటేనే న‌వ్వుతాం. కానీ ఊరికే న‌వ్వ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలుంటాయ‌ని.. అందుకే న‌వ్వ‌డానికి కార‌ణం అవ‌స‌రం లేద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి.

చిరున‌వ్వు మ‌నుషుల‌కు ప్ర‌కృతి ప్ర‌సాదించిన గిఫ్ట్ గా భావిస్తారు. కానీ కుక్క‌లు కూడా న‌వ్వుతాయ‌ని, అయితే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమీ లేవు. అయితే స్మైల్ గురించి మిమ్మ‌ల్ని స‌ర్ ప్రైజ్ చేసే విష‌యాలు ఇప్పుడు చూద్దాం..

కంటాజియ‌స్

కంటాజియ‌స్

న‌వ్వు అనేది ఒక వ్యాధి లాంటిది. ఎందుకంటే.. ఒక‌రి నుంచి ఒక‌రికి ఇది సోకుతుంది. ఒక న‌వ్వ‌డం చూస్తే మ‌న‌కూ న‌వ్వు వ‌చ్చేస్తుంది. ఇదే న‌వ్వు స్పెషాలిటీ.

మెడిసిన్

మెడిసిన్

పెద్ద‌గా న‌వ్విన‌ప్పుడు క‌ళ్లు మూసుకున్న‌ట్టు అవుతాయి. ఇలా జ‌రిగే ప్ర‌క్రియ వ‌ల్ల ఇమ్యునిటీ సిస్ట‌మ్ మెరుగుప‌డుతుంది.

ఫ‌స్ట్ ఎక్స్ ప్రెష‌న్

ఫ‌స్ట్ ఎక్స్ ప్రెష‌న్

గ‌ర్భాశ‌యంలోనే పిల్ల‌లు న‌వ్వ‌డం మొద‌లుపెడ‌తారు. అంటే.. మ‌నుషుల మొద‌ట ఎక్స్ ప్రెష్ చేసే.. చిరున‌వ్వు.

ఆరోగ్యానికి

ఆరోగ్యానికి

న‌వ్వు మిమ్మ‌ల్ని మంచి వ్య‌క్తి, ఆరోగ్య‌క‌ర‌మైన వ్య‌క్తిగా మారుస్తుంది. న‌వ్వు వ‌ల్ల ఎండోర్ఫిన్స్ మెద‌డులో రిలీజ్ అవుతాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది.

ఎట్రాక్టివ్ లుక్

ఎట్రాక్టివ్ లుక్

న‌వ్వుతో త‌మ పార్ట్ న‌ర్ ని మ‌హిళ‌లు చాలా ఎట్రాక్ట్ చేస్తార‌ని చాలా అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. దీనివల్ల అందం రెట్టింప‌వుతుంది.

మూడ్ బాగోలేన‌ప్పుడు

మూడ్ బాగోలేన‌ప్పుడు

న‌వ్విన‌ప్పుడు ఎండోర్ఫిన్స్ విడుద‌ల‌వుతాయి. కాబ‌ట్టి మీరు మూడ్ బాగోలేన‌ప్పుడు న‌వ్వ‌డం వ‌ల్ల‌.. అంటే న‌వ్వు రాక‌పోయినా న‌వ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తే.. మీ మూడ్ మారిపోతుంది. హ్యాపీ ఫీలింగ్ క‌నిపిస్తుంది.

ఫ్రెండ్స్

ఫ్రెండ్స్

మీరు న‌వ్విన‌ప్పుడు ఎదుటివాళ్లు మీపై మంచి ఫీలింగ్ పొందుతారు. ఫ్రెండ్లీ ప‌ర్స‌న్ అని భావిస్తారు. దీనివ‌ల్ల రిలేష‌న్స్ హ్యాపీగా ఉంటాయి.

బ్ల‌డ్ ప్రెజ‌ర్ త‌గ్గ‌డానికి

బ్ల‌డ్ ప్రెజ‌ర్ త‌గ్గ‌డానికి

ఎండోర్ఫిన్స్ కేవ‌లం మూడ్ ని మాత్ర‌మే కాదు.. బ్ల‌డ్ ప్రెజ‌ర్ ని కూడా.. త‌గ్గిస్తాయి. కాబ‌ట్టి.. న‌వ్వుతూ ఉండ‌టం వ‌ల్ల‌.. ఆరోగ్యంగా కూడా ఉంటారు.

లైఫ్ స్పామ్

లైఫ్ స్పామ్

న‌వ్వుతూ ఉండేవాళ్లు, ఎప్పుడూ న‌వ్వడాన్ని ఇష్ట‌ప‌డేవాళ్లు ఎక్కువ కాలం బ‌తుకుతార‌ని.. స్ట‌డీస్ చెబుతున్నాయి. కాబ‌ట్టి న‌వ్వుతూ ఉంటే.. ఎక్కువ‌కాలం బ‌తికేయ‌చ్చు.

ఎక్స‌ర్ సైజ్ లాంటిది

ఎక్స‌ర్ సైజ్ లాంటిది

మీకు తెలుసా.. న‌వ్వు అనేది వ్యాయామం లాంటిది. ఎందుకంటే.. ఒక‌సారి న‌వ్వితే.. 26 కండ‌రాలు.. యాక్టివేట్ అవుతాయి. ఇది చ‌ర్మ ఆరోగ్యానికి కూడా మంచిది.

సోషియ‌బుల్

సోషియ‌బుల్

ఎలాంటి సంద‌ర్భంలోనైనా, ఎలాంటి పార్టీల్లోనైనా.. న‌వ్వుతూ ఉండే వ్య‌క్తి.. చాలా మందిని ఎట్రాక్ట్ చేస్తారు. కాబ‌ట్టి ఏదైనా పార్టీలో ఉన్న‌ప్పుడైనా.. మీరు న‌వ్వితే అంద‌రినీ ఎట్రాక్ట్ చేయ‌చ్చు.

వ‌ర్క్ లో ప్ర‌మోష‌న్

వ‌ర్క్ లో ప్ర‌మోష‌న్

మీరు త‌చ‌రుగా న‌వ్వుతూ ఉండ‌టం, అంద‌రితో తేలిక‌గా క‌లిసిపోవ‌డం, హ్యాపీగా, స‌ర‌దాగా న‌వ్వుతూ వ‌ర్క్ చేయ‌డం వ‌ల్ల మీ బాస్ ద‌గ్గ‌ర మంచి కాంప్లిమెంట్స్ అందుకోవ‌చ్చు. దీనివ‌ల్ల ఈజీగా క‌లిసిపోయే త‌త్వం, వ‌ర్క్ చేయించే కెపాసిటీ ఉంద‌ని భావించి.. త్వ‌ర‌గా ప్ర‌మోష‌న్ కొట్టేయ‌వ‌చ్చు.

సంతోషం

సంతోషం

స్మైల్ వ‌ల్ల సంతోషం చాలా హ్యాపీ ఫీలింగ్ ఇస్తుంది. జీవితంపై సంతృప్తిని క‌లిగిస్తుంది. కాబ‌ట్టి ఎల్ల‌ప్పుడూ న‌వ్వుతూ ఉండండి.

దూరం నుంచి గుర్తించ‌వ‌చ్చు

దూరం నుంచి గుర్తించ‌వ‌చ్చు

మ‌నుషులు న‌వ్వుని దూరం నుంచి కూడా గుర్తించ‌గ‌ల‌రు. 300 కంటే ఎక్కువ అడుగుల దూరం నుంచే.. న‌వ్వుతున్న వ్య‌క్తిని గుర్తించ‌వ‌చ్చు.

స్మైల్ ర‌కాలు

స్మైల్ ర‌కాలు

న‌వ్వులో 19 ర‌కాలు ఉన్నాయ‌ని.. సైంటిస్ట్ లు నిరూపించారు. పొలైట్ గా న‌వ్వ‌డం నుంచి పెద్ద‌గా న‌వ్వ‌డం వ‌ర‌కు.. 19 ర‌కాల న‌వ్వు ఎక్స్ ప్రెష‌న్స్ ఉన్నాయ‌ట‌.

English summary

Interesting Facts about smile you should know

Facts About Smiling. We all know that a smile is pleasant but there is more to a simple smile. It has some health benefits and other benefits too.
Story first published:Monday, July 25, 2016, 9:55 [IST]
Desktop Bottom Promotion