For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేతబడి అంటే ఏమిటి ? ఇది నిజంగా ఉందా ?

By Swathi
|

చేతబడి..!! ఇది ఒకప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు ఎక్కువగా చెప్పేమాట. ఆ కాలంలో చేతబడి అనేది ఎక్కువగా వినిపించేది. వాళ్లు ప్రత్యక్షంగా చూశామని.. చేతబడికి గురయైనవాళ్లను, చేతబడి చేయించేవాళ్లను గుర్తించామని చెబుతుండేవారు. అయితే ఇవన్నీ నమ్మసక్యమేనా ? నిజంగానే చేతబడి ఫలిస్తుందా ? అది సాధ్యమేనా ? చేతబడితో ఓ వ్యక్తిని పూర్తీగా మార్చేయవచ్చా ? చేతబడి ఓ వ్యక్తి జీవితాన్నే అఘాతంలోకి తొక్కేస్తుందా ? అనేది నేటితరాన్ని వేధించే సందేహాలు.

black magic

అర్థరాత్రిళ్లు మంత్రతంత్రాలతో క్షుద్ర పూజలు చేస్తూ.. ఆవాహయామీ అంటూ.. జపిస్తూ.. రహస్యంగా పెద్ద పెద్ద హోమాలు చేస్తూ.. ఈ తంతుకి స్మశానాన్నే వేధికగా చేసుకోవడాన్ని చేతబడిగా భావిస్తారు. తమకు గిట్టని వ్యక్తిపై పగ తీర్చుకోవడానికి చేసే తంత్రాలను చేతబడిగా చెబుతారు. ఇవన్నీ సినిమాల్లో కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ఉంటారు. తమ శత్రువులకు హాని జరగాలని, వాళ్లను ఈ లోకం నుంచి పంపించేయాలనే దురాలోచనతో చేసేది ఈ క్షుద్రపూజలు.

black magic

వివిధ ప్రాంతాలను బట్టి ఈ విద్యని విచ్ క్రాఫ్ట్, వూడూ, బ్లాక్ మ్యాజిక్, బాణామతి, చిల్లంగి అని పిలుస్తారు. చేతబడి అనేది ఒట్టి మూఢ నమ్మకం అని కొట్టిపడేసే హేతువాదులున్నారు. అలాగే ఇది ఖచ్చితంగా జరుగుతుందని, స్వయంగా అనుభవించామని నమ్మి, భయాందోళనకు గురయ్యే వాళ్లూ ఉన్నారు. అయితే చేతబడి అనేది నిజంగా జరిగిందనడానికి ఆధారాలున్నాయని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ ఈ మూఢ నమ్మకం పేరుతో గ్రామాల్లో అనేక మంది అమాయకులు బలవుతున్నారని హేతువాదులు వాదిస్తున్నారు.

READ MORE: కలియుగాంతంలో మనుషుల ప్రవర్తన, అలవాట్లు ఎలా ఉంటాయి ?

అయితే హిందువులు మాత్రమే కాదు.. ముస్లింలు కూడా చేతబడిని నమ్ముతారు. వాళ్లు దీన్ని సిహ్ర్, తావీజ్ అని పిలుస్తారు. దీని అర్థం బ్లాక్ మ్యాజిక్. జీనీలు అంటే భూతమని అర్థం. జీనీల సహాయంతో మాయలు చేయవచ్చని కొందరు ముస్లింలు నమ్ముతారు. జీనీలు ఒక మనిషిని ఆవహించవచ్చని.. వీటిని వదిలించడానికి ఖురాన్ లోని కొన్ని పదాలు చదువుతారు. కానీ జీనీల సహాయం కోరడం నిషిద్ధమని ఇస్లాం ఖండిస్తుంది.

black magic

కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ చేతబడి జరుగుతోందని ప్రజలు బలంగా నమ్ముతారు. తమకు ఏదైనా కీడు జరిగినా.. ఉన్నట్టుండి అనారోగ్యం పాలైనా దానికి కారణం గిట్టనివాళ్లు చేసిన చేతబడి ప్రభావమే అని భావిస్తారు. అయితే ఈ చేతబడి చేయడానికి గిట్టనివాళ్లకు చెందిన ఏ వస్తువైనా తీసుకెళ్తారని ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. వెంట్రుకలు లేదా బట్టలు లేదా వాళ్లకు సంబంధించిన ఏదైనా ఒక వస్తువుతో మొత్తం మనిషిపై ప్రభావం చూపిస్తారని సాధారణంగా చెబుతుంటారు. ఇలాంటి భ్రమలోనే ఇప్పటికీ అనుమానం వచ్చినవాళ్లను చితకబాదటం, రాళ్లతో కొట్టడం, చెట్టుకి కట్టేసి చిత్రహింసలు పట్టడం వంటివి చేస్తూనే ఉన్నారు.

 జ్యోతిష్యంతో పని లేదు..!! గడ్డం ఆకారం చూస్తే చాలు..!! జ్యోతిష్యంతో పని లేదు..!! గడ్డం ఆకారం చూస్తే చాలు..!!

కానీ.. చేతబడి నమ్మాలా ? అంటే మాత్రం తత్వవేత్తలు ఇదంతా.. భ్రమ మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు. ఇదంతా మనసులో జరిగే హీనమైన చేతబడి అని వివరిస్తున్నారు. ఇతరులు చేసే మాయ, చెడు, మంచి ఏదైనా మనపై అంతగా పనిచేయదంటున్నారు. ఒకవేళ ప్రభావం చూపినా.. జీవితాన్ని మార్చేసే విధంగా జరగదని తేల్చిచెబుతున్నారు.

black magic

చేతబడి శాస్త్రం ప్రస్తుత కాలంలో దాదాపు అంతరించిపోయింది. ఇది వాస్తవానికి మంచి విషయం కాదు. ఎందుకంటే చేతబడి శాస్త్రాన్ని మంచి ఉద్దేశ్యం కోసం వాడుకోవచ్చు. చేతబడి అనేది మనిషి తన ఆంతరంగిక శక్తులనో, బాహ్య శక్తులనో ఉపయోగించుకునే ఒక సాంకేతిక పరిజ్ఞానం. కానీ దురదృష్టవశాత్తూ మనుషులు దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. మంచి పనుల కన్నా.. చెడ్డ పనులకే చేతబడిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

English summary

Is Black Magic Real ??

Is Black Magic Real. Black Magic has long been practiced in different part of the country by specific persons known as Tantriks. Many people are faced with the effects of black magic without knowing that it is actually black magic that is affecting them.
Desktop Bottom Promotion