Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
అదృష్టం పొందాలంటే.. పర్స్ లో కంపల్సరీ ఉండాల్సిన వస్తువులు..!!
పర్స్ లేదా వాలెట్ అనేది.. ప్రతి ఒక్కరికీ చాలా అవసరమైనది. ఇందులో చాలా ముఖ్యమైన వస్తువులు, ప్రతిరోజూ అవసరమయ్యే వస్తువులను పెట్టుకుంటాం. డబ్బులు కాకుండా, ఇంకా విలువైన వస్తువులు కూడా పర్స్ లో పెట్టుకుంటూ ఉంటాం.
కొంతమంది తమకు ఇష్టమైన వాళ్ల ఫోటోలు, భార్యల ఫోటోలు, తల్లిదండ్రుల ఫోటోలు పర్సులో పెట్టుకుంటారు. మరికొందరు దేవుళ్ల ఫోటోలు పర్సులో పెట్టుకుంటారు. అయితే.. కొన్ని వస్తువులను పర్సులో పెట్టుకుంటే.. ఎప్పుడూ అదృష్టం మీ వెంటే ఉంటుందట. మీరు ఎప్పుడూ అదృష్టవంతులుగా ఉండాలంటే.. ఈ వస్తువులను కంపల్సరీ పర్సులో పెట్టుకోవాలట.
ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఈ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు..!!
జీవితం సంతోషంగా ముందుకు సాగాలంటే.. డబ్బు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే.. డబ్బు సంపాదించడం కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే చాలామంది తక్కువ సంపాదిస్తున్నా.. బాగా దాచుకునే తత్వం కలిగి ఉంటారు. కానీ కొంతమంది ఎంత సంపాదించినా.. దాన్ని దాచిపెట్టుకోలేకపోతారు.
ఎంత సంపాదించినా.. డబ్బు లేదన్న మాట వింటూ ఉంటాం. ఎప్పుడూ డబ్బులు చేతిలో ఉండాలంటే సంపాదిస్తే సరిపోదు.. దాన్ని కాపాడుకునే అదృష్టం కూడా ఉండాలి. కాబట్టి.. మీ చేతుల్లో ఎప్పుడూ డబ్బులు ఉండాలంటే, అదృష్టం మీ వెంటే ఉండాలంటే.. మీ పర్స్ లో కొన్ని వస్తువులు కంపల్సరీ ఉండాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బ్యాగ్ శుభ్రంగా
చాక్లెట్ పేపర్స్, పాత బిల్లులు, అవసరం లేని పేపర్లు పర్సులో ఉండకూడదు. వీటన్నింటినీ తొలగించి.. పర్సు శుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి.

డబ్బుకి గౌరవం
బ్యాగ్ లో డబ్బులను విసిరేస్తూ ఉంటారు. ముఖ్యంగా కాయిన్స్ ని ఎలా పడితే అలా వేసేస్తూ ఉంటారు. ఇది డబ్బుపై ఉన్న అగౌరవాన్ని సూచిస్తుంది. కాబట్టి.. కాయిన్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న పర్స్ ని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవడం మంచిది.

పర్స్ కింద పెట్టకుండా
హ్యాండ్ బ్యాగ్ ని, పర్స్ ని కింద పెట్టకుండా జాగ్రత్త పడాలి. శుభ్రమైన, మనం తొక్కని ప్రదేశాల్లో బ్యాగ్ పెట్టుకోవాలి. ముఖ్యంగా బ్యాగ్ లేదా పర్స్ ని ఎట్టిపరిస్థితుల్లో కాలితో ముట్టుకోకూడదు.

చిరిగిపోయి ఉండకూడదు
పర్స్ ఎప్పుడూ.. బాగా ఉండాలి. అది చిగిరిపోయి, పాతబడినదై ఉండకూడదు. దీనివల్ల మీకు దురదృష్టం కలుగుతుంది. కాబట్టి.. ఎప్పుడూ బ్యాగ్ శుభ్రంగా, కొత్తగా ఉండేలా జాగ్రత్త పడండి.

మీకు నప్పేదై ఉండాలి
బట్టలు, నగలు లాగే.. బ్యాగ్ కూడా.. మీకు సెట్ అయ్యేలా ఉండాలి. మరీ పెద్దదిగా, మరీ చిన్నదిగా ఉండకూడదు. మీకు అవసరమయ్యేదిలా ఉండేలా జాగ్రత్త పడండి.

తాళాల కోసం
బ్యాగ్ లో వస్తువులను అస్తవ్యస్తంగా, పద్ధతిలో లేకుండా పెట్టుకోకూడదు. కీస్ తో పాటు.. అన్నింటినీ.. ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా కారు తాళాలు, బైక్ తాళాలు, ఇంటి తాళాల కోసం బ్యాగ్ లో సపరెట్ అర ఉండేలా చూసుకోండి.

కలర్
మీ వ్యాలెట్ లేదా పర్స్ లేదా హ్యాండ్ బ్యాగ్ కలర్ కూడా మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. మంచి కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా.. మీ ఫేవరేట్ కలర్ బ్యాగ్ అయితే.. మీకు బాగా కలిసొస్తుంది.

ఇష్టపడాలి
మీ బ్యాగ్ ని మీరు బాగా ఇస్టపడితే.. పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది. కాబట్టి.. బ్యాగ్ కొనేటప్పుడు మీకు నచ్చితేనే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బాగా ఇష్టపడాలి. అప్పుడే.. మీకు అదృష్టం, సంతోషం మీ బ్యాగ్ తో పాటు, మీ వెంట ఉంటాయి.

గవ్వలు
7 పసుపు రంగులో ఉన్న గవ్వలను మీ పర్సులో పెట్టుకుంటే.. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.

రావి చెట్టు ఆకు
రావి చెట్టు ఆకును మనం పవిత్రంగా భావిస్తాం, పూజిస్తాం. కాబట్టి ఈ ఆకును తీసుకుని నీటితో శుభ్రం చేసి.. దానిపై శ్రీ అని రాసి.. పర్స్ లో పెట్టుకోవాలి. ఇది నలిగిపోకుండా ఉండేలా జాగ్రత్త పడితే.. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది.

రూపాయి నోటు
రూపాయిల నోట్లు రెండింటినీ, ఒక 20 రూపాయల నోటుని తెల్లటి పర్సులో పెట్టుకోవాలి. దీన్ని ఉపయోగించరాదు. వీలైతే.. సిల్వర్ పేపర్ లో చుట్టు పెట్టుకుంటే అదృష్టవంతులవుతారు.

బియ్యం
కొన్ని బియ్యపు గింజలను పర్స్ లో పెట్టుకోవాలి. లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లినప్పుడు వాటిని అమ్మవారికి సమర్పించాలి.

తామర విత్తనాలు
తామర విత్తనాలను అదృష్టంగా భావిస్తారు. కాబట్టి వీటిని మీ పర్స్ లో పెట్టుకుంటే.. దీర్ఘకాలం ఆర్థికంగా స్థిరంగా, మానసికంగా ఆరోగ్యంsగా ఉంటారు.

శ్రీయంత్రం
శ్రీయంత్రాన్ని పాకెట్ లో పెట్టుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అదృష్టవంతులవుతారు.

గోమతి చక్రం
గోమతి చక్రాలను వ్యాలెట్ లో పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా, మానసికంగా స్థిరంగా ఉంటారు. ఎప్పటికీ డబ్బులేదన్న భావన మీలో కలగదు.

విష్ణుమూర్తి ఫోటో
విష్ణుమూర్తి పాదాలు నొక్కుతున్న లక్ష్మీదేవి ఫోటోని పర్స్ లో పెట్టుకుంటే.. చాలామంచిది. ఈ ఫోటో మీకు చాలా అదృష్టాన్ని తీసుకొస్తుంది.

చిన్న కొబ్బరి
ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పూజ లేదా గుళ్లో ప్రత్యేక పూజ చేయించినప్పుడు ఉపయోగించిన చిన్న కొబ్బరికాయను.. మీ బ్యాగ్ లో పెట్టుకోండి. చిన్న సైజులో ఉన్నది తీసుకుని బ్యాగ్ లో పెట్టుకోవడం వల్ల మీకు, మీ కుంటుంబానికి పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది.

వైట్ స్టోన్
ఓవెల్ ఆకారంలో ఉండే.. తెల్లటి స్టోన్ ని పర్స్ లో పెట్టుకోవడం వల్ల.. సంతోషంగా ఉండటమే కాకుండా.. మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది.
చూశారుగా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. అదృష్టం మీ వెంటే ఉంటుంది.



Click it and Unblock the Notifications











