Latest Updates
-
మాతృ దినోత్సవం రోజున భార్య, అమ్మ మధ్య నలిగిపోతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గొడవలు ఉండవు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా?
మీ ఫింగర్ ప్రింట్స్ మీ క్యారెక్టర్ గురించి కరెక్ట్ గానే చెబుతున్నాయా ?
చదువు రాని వాళ్లు, తమ పేరును రాయలేని వాళ్లు, సంతకం ( సైన్ ) చేయలేనివాళ్లు వేలిముద్రను ఉపయోగించడం మనం గమనించే ఉంటాం. అలా వేలిముద్ర ద్వారా వాళ్ల గుర్తింపుని సూచిస్తారు. అయితే.. ఈ ఫింగర్ ప్రింట్స్ ని సంతకానికే కాదు.. కొన్ని కేసుల దర్యాప్తుకి కూడా ఉపయోగిస్తారు. అంటే ఒక వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ ని బట్టి.. ఆ కేసులో ఎవరి హస్తం ఉందనే విషయాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తారు.
అయితే ఈ ఫింగర్ ప్రింట్స్ ఒక్కొక్కరిలో ఒక్కోలా ఆకారంలో ఉంటాయి. ఈ ఫింగర్ ప్రింట్స్ ని బట్టి వాళ్ల వ్యక్తిత్వం తెలుసుకోవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఎదుటివాళ్ల ఫింగర్ ప్రింట్స్ ని బాగా గమనించి.. వాళ్ల మనస్తత్వాన్ని, వాళ్ల లోపల దాగున్న ఆలోచనలను పసిగట్టవచ్చట.
ఇలా ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడాన్ని డెర్మటోగ్లిఫిక్స్ అంటారు. వేళ్లపై ఉండే ప్రింట్స్, వంపులపై సైన్స్ రకరకాలుగా అధ్యయనాలు జరిపింది. దీని ద్వారా వాళ్ల తెలివితేటలు, వాళ్ల టాలెంట్, వ్యక్తిత్వం, మనస్తత్వం తెలుసుకోవచ్చని.. ఈ స్టడీస్ రివీల్ చేశాయి. మరి మీ ఫింగర్ ప్రింట్స్ మీ గురించి కరెక్ట్ గానే చెబుతున్నాయా ? మీ ఫ్రెండ్స్ ఫింగర్ ఫ్రింట్స్ ఏం చెబుతున్నాయి ? వంటి విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దామా..

స్టడీ
డెర్మటోగ్లిఫిక్స్ కి పామిస్టరీతో కనెక్షన్ ఉందని.. ఈ స్టడీస్ లో పాల్గొన్న సైంటిస్ట్స్ ప్రూవ్ చేశారు. భూమ్మీద ఉన్న ఏ ఇద్దరి వ్యక్తులకు ఫింగర్ ప్రింట్స్ ఒకేలా ఉండవని ఈ స్టడీస్ వెల్లడించాయి. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా పర్సనాలిటీ గురించి తెలుసుకోవడం చాలా ఫన్నీగా, ఇంట్రెస్ట్ గా ఉంటుంది.

ఫింగర్ ప్రింట్స్ రకాలు
సైన్ ప్రకారం మనుషులకు 11 రకాల వేర్వేరు ఫింగర్ ఫ్రింట్స్ ఉంటాయి.

టెంటెడ్ ఆర్చ్
ఇలాంటి ఫింగర్ ప్రింట్స్ కలిగి ఉన్న వ్యక్తి చాలా అయోమయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వాళ్లు చాలా అనూహ్యంగా ఉంటారు. ఒక రోజు వాళ్లు చాలా ప్రేమగా ఉంటారు. మళ్లీ మరుసటి రోజే.. మీపై కారాలు మిరియాలు నూరుతుంటారు. ఛాలెంజెస్ ని ఇష్టపడతారు.

కాంపోజిట్ వోల్
ఇలాంటి ఆకారంలో ఫింగర్ ప్రింట్స్ కలిగగిన వాళ్లు చాలా త్వరగా కలిసిపోయే తత్వం కలిగి ఉంటారు. ఎలాంటి లోపం లేని మనస్తత్వం కలిగి ఉంటారు. త్వరగా నిర్ణయాలు తీసుకోవడం వాళ్ల ఎడమచేతి పని లాంటిది.

కాంసెంట్రిక్ వోల్
ఇలాంటి ఆకారంలో ఫింగర్ ప్రింట్స్ కలిగిన వాళ్లు.. స్వీయ పొగడ్తలు, స్వీయ ప్రేమను కలిగి ఉంటారు. వీళ్లు కంట్రోల్ చేయడాన్ని ఇష్టపడతారు. కానీ.. ఇతరుల కంట్రోల్ లో ఉండటాన్ని ఏమాత్రం ఇష్టపడరు.

సింపుల్ ఆర్చ్
సింపుల్ ఆర్చ్ ఫింగర్ ప్రింట్స్ కలిగిన వాళ్లు.. డెడికేటెడ్, గౌరవప్రదమైన, నిజాయితీ కలిగి ఉంటారు. వీళ్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. వీళ్లు ఒకరిపై పూర్తీగా ఆధారపడి ఉంటారు.

వేరియంట్ ఫింగర్ ప్రింట్స్
ఇలాంటి ఫింగర్ ప్రింట్స్ కలిగిన వాళ్లు.. ఇతరులను తమ చూపులతోనే భయపెట్టేస్తారు. ఇలాంటి వ్యక్తిత్వం వల్ల ఎదుటివ్యక్తి పరువుప్రతిష్టలు కోల్పోయే ప్రమాదం ఉంది.

ఉల్నార్ లూప్స్
వీళ్లు అహింసాతత్వం కలిగి ఉంటారు. వాళ్ల చుట్టూ ఉన్న ప్రతి విషయాన్ని చాలా క్లియర్ గా పరిశీలిస్తారు. ఇతరులను బాధపెట్టకుండా పదాలను ఎంపిక చేసుకుని మాట్లాడటం వీళ్ల నేచర్.

స్పైరల్ వోల్
స్పైరల్ వోల్ ఆకారంలో ఫింగర్ ప్రింట్స్ కలిగిన వాళ్లు... వ్యక్తిగత ప్రేమను ఇష్టపడతారు. సెల్ఫ్ మోటివేషన్ చేసుకునే సత్తా ఉంటుంది. వాళ్ల అంతర్గత ఇబ్బందులు, పోరాటాలు ఎవరికీ అర్థం కావు.

నెమలి కన్ను (పీకాక్ ఐ)
ఇలాంటి ఆకారంలో ఫింగర్ ప్రింట్స్ కలిగిన వాళ్లు పుట్టుకతోనే లీడర్ షిప్ క్యాలిటీస్ కలిగి ఉంటారు. వీళ్లకు కళాత్మకత ఎక్కువగా ఉంటుంది.

ఇమ్ప్లోడింగ్ వోల్
ఇలాంటి ఆకారంలో ఫింగర్ ప్రింట్స్ ఉన్న వాళ్లు చాలా సెల్ఫ్ కాన్సియస్ కలిగి ఉంటారు. పబ్లిక్, సోషల్ ఈవెంట్స్ లో బిడియం ఫీలవుతారు. అయినా.. మల్టీ టాక్సింగ్, ఓపెన్ మైండెడ్ వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అయితే వాళ్ల నెక్ట్స్ స్టెప్ ఎలా ఉంటుందనేది ఎవరూ గ్రహించలేరు. వాళ్ల ఎమోషన్స్ దాచిపెడతారు.

రేడియల్ లూప్స్
వాళ్ల స్వతంత్రతను ఇష్టపడతారు. ఇలాంటి వాళ్లు అహంకారం కలిగి ఉంటారు.

ప్రెస్ వోల్
ఇలాంటి ఆకారంలో ఫింగర్ ప్రింట్స్ కలిగిన వాళ్లు ఉత్సాహంగా, నిర్ణయాత్మకంగా ఉంటారు. ఏదైనా సరైన పద్ధతిలో ప్లాన్ ప్రకారం నడుచుకునే తత్వం ఉంటుంది. వాళ్లు ఇబ్బందుల్లో ఉన్నట్టు ఎప్పుడూ చూడలేవు. జీవితంలో ప్రతి విషయంపై ఓ కన్నేసి ఉంటారు. అందుకే.. ఏది చేసినా.. ప్రణాళికా బద్ధంగా చేస్తారు. వీళ్లు గ్రేట్ ఇన్వెస్టర్స్.



Click it and Unblock the Notifications