Latest Updates
-
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన!
చేతివేళ్ల సైజు, ఆకారంలో దాగున్న ఆశ్చర్యకర రహస్యాలు..!!
చేతివేళ్లు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. కొంతమందికి పొడవుగా ఉంటే.. కొంతమందికి పొట్టిగా ఉంటాయి. మరికొందరు ఎక్స్ ట్రా మరొక వేలు ఉంటుంది. అసలు చేతివేళ్లు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండటానికి కారణం.. అందులో దాగున్న వ్యక్తిత్వ రహస్యాలు.
చేతివేళ్లన్నీ ఒకే సైజులో ఉండవు. కొన్ని చిన్నగా ఉంటే.. మరికొన్ని పొడవుగా ఉంటాయి. కొన్నివేళ్ల షేప్ విభిన్నంగా ఉంటుంది. వేలు పొడవు ఉండటమే కాకుండా.. మరికొన్ని భాగాలు విభిన్నంగా ఉంటాయి. అందుకే ఇవి మీ వ్యక్తిత్వాన్ని వివరిస్తాయి. ఏ వేలు పొడవుగా ఉంటే దేనికి సంకేతం, ఒకవేళ చిటికెన వేలు స్ట్రెయిట్ గా కాకుండా.. వంకరగా ఉంటే.. ఏమవుతుంది. చేతి వేళ్లలో దాగున్న ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

చిటికెన వేలు
పామిస్టరీ ప్రకారం చాలా చిన్నగా మీ చివరి వేలు ఉంటే.. మీకు ఓర్పు ఉండదు. ఒకవేళ మీ చివరి వేలు కాస్త పొడవుగా ఉంటే.. జాలి, దయ ఉండదు.

చిటికెన వేలు
ఒకవేళ చిటికెన వేలి షేప్ స్ట్రెయిట్ గా లేకుండా.. వంకరగా ఉంటే.. వాళ్లను అంతతేలికగా నమ్మకూడదు. వాళ్లు చాలా కన్నింగ్ గా ఉంటారు.

చిటికెన వేలు.. ఉంగరపు వేలుని తాకితే
ఒకవేళ చిటికెన వేలు.. ఉంగరపు వేలి గోటి వరకు రాగలిగితే.. ఆ వ్యక్తి జీవితంలో చాలా ఖచ్చితమైన లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. వీళ్లు గొప్ప ఇంజనీర్లు, డాక్టర్లు అవుతారు.

డబ్బు
ఇలాంటి వ్యక్తులు చాలా డబ్బు, పరపతిని సంపాదిస్తారు. జీవితంలో ప్రతి అడుగులోనూ.. డబ్బుల వర్షం కురుస్తుంది.

ఎడమ చేయి లేదా కుడిచేయి
ఆస్ట్రాలజీ ప్రకారం మగవాళ్ల కుడిచేయి, ఆడవాళ్ల ఎమడచేతిని గమనించాలి. కానీ ఇది అన్ని సందర్భాల్లో వాస్తవం కాదు.

మధ్యవేలు
మధ్యవేలు శనికి సంకేతం. ఎవరికైతే పెద్ద మధ్య వేలు ఉంటుందో వాళ్లు అసాధారణమై, విభిన్నమైన జీవితాన్ని అనుభవిస్తారు.

ఉంగరపు వేలు
ఒకవేళ ఉంగరపు వేలు కంటే.. మధ్యవేలు పావు వంతు పొడవుగా ఉంటే.. అది మంచి సంకేతం. ఆ వ్యక్తి జీవితంలో మంచి విజయం సాధిస్తారు. ఒకవేళ ఉంగరపు వేలు.. మధ్యవేలు కంటే పొడవుగా ఉంటే.. జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

అవమానం
ఒకవేళ మీ మధ్య వేలు చాలా పొడవుగా ఉంటే... జీవితంలో ఖచ్చితంగా కొన్ని అవమానాలు ఎదుర్కోవాలి. ఒకవేళ మధ్య వేలు, ఉంగరపు వేలు సమాన పొడవు ఉంటే.. జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి బలాన్ని కోల్పోతారు. అలాగే మీరు లేజీగానూ ఉండవచ్చు.

వేళ్ల మధ్య గ్యాప్
మధ్యవేలుకి, ఉంగరపు వేలుకి మధ్య గ్యాప్ ఉంటే.. ఆ వ్యక్తి స్వతంత్రంగా ఉంటాడు. చూపుడు వేలుకి, మధ్య వేలుకి మధ్య చాలా ఎక్కువ గ్యాప్ ఉంటే... చాలా కేర్ లెస్ గా ఉంటారు.

చూపుడు వేలు
మధ్యవేలు కంటే.. చూపుడు వేలు పొడవుగా ఉంటే.. ఆ వ్యక్తి చాలా ఎక్కువగా ఆలోచిస్తాడు. జీవితాన్ని ప్రొఫెనల్ గా మార్చుకుంటారు.

వేలి పొడవు
ఒకవేళ మధ్యవేలు, చూపుడు వేలు ఒకే పొడవు ఉంటే.. అతను చాలా ఇండిపెండెంట్ గా ఉంటాడు. తన లైఫ్ లో ఇతరులు తలదూర్చడాన్ని ఇష్టపడరు.

చూపుడు వేలు చిన్నగా ఉంటే
చూపుడు వేలు పొడవు చాలా చిన్నగా ఉంటే.. వాళ్లు తరచుగా కన్నింగ్ గా, క్రూరంగా ఉంటారు. సంపద పొందడానికి కొన్నిసార్లు యోగ్యత లేని పద్ధతులు ఉపయోగిస్తారు.

చూపుడు వేలు సరిగ్గా ఉంటే
ఒకవేళ మీ చూపుడు వేలు స్మూత్ గా, సక్రమంగా ఉంటే.. జీవితంలో విజయం సాధిస్తారు. అలాగే చూపుడు వేలు సరిగ్గా ఉంటే.. పవర్, పరువు పొందుతారు.

చూపుడు వేలు నియమం
చూపుడు వేలు ఎప్పుడూ.. మధ్యవేలు కంటే పొడవుగా ఉండకూడదు. ఇది రూల్. ఒకవేళ అలా ఉంటే.. ఆ వ్యక్తి ఎప్పుడూ.. స్వార్థంగా, ఇన్ సెక్యూర్ గా ఫీలవుతారు.

బొటనవేలు నియమం
ఒకవేళ చూపుడు వేలు బొటనవేలు వైపు వంగినట్టు ఉంటే.. ఆ వ్యక్తి జీవితంలో చాలా ఇండిపెండెంట్ గా ఉంటాడు. జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు.

చూపుడు వేలు వంగితే
ఒకవేళ చూపుడు వేలు మధ్యవేలు వైపుగా వంగితే.. ఆ వ్యక్తి.. జీవితంలో ఎప్పుడూ డిసప్పాయింట్ గా ఉంటాడు. జీవితంలో లక్ పొందలేడు.

పొడవాటి వేళ్లు
ఇవన్నీ కాకుండా.. చేతివేళ్లు పొడవుగా ఉంటే.. ఆ వ్యక్తి చాలా ఓర్పుగా ఉంటారు. ప్రేమగా ఉంటారు. కొన్నిసార్లు మొండిగా వ్యవహరిస్తారు.

పొట్టిగా ఉండే వేళ్లు
ఒకవేళ చేతివేళ్లు పొట్టిగా ఉంటే.. వాళ్లకు ఏమాత్రం ఓర్పు ఉండదు. జీవితంలో చాలా త్వరగా పరిష్కారానికి చేరుకుంటారు. క్రియేటివ్ జాబ్స్ లో రాణిస్తారు.



Click it and Unblock the Notifications











