Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ మౌత్ లో దాగున్న మైండ్ బ్లోయింగ్ సీక్రెట్స్ ?
ప్రతి ఒక్కరి మనోభావాలు, అభిరుచులు, అభిప్రాయాలు విభిన్నంగా ఉంటాయి. అలాగే.. మనుషుల మధ్య పోలికలు కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. పోలికలను బట్టి పర్సనాలిటీ తెలుసుకునే.. కొత్త కోణం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక వ్యక్తిలో అందరినీ ఎట్రాక్ట్ చేసేది ముఖం. ఆ ముఖంలో పెదాలు.. పెదాల ద్వారా వచ్చే భావాలు అందరి మనసుని హత్తుకుంటాయి. ఎలాంటి విషయమైనా.. వ్యక్తపరచడానికి నోరు ప్రధానపాత్ర వహిస్తుంది. ఆ నోరు ఒక్కొక్కరికి ఒక్కో సైజ్ లో, రూపంలో ఉంటుంది. మరి ఎలాంటి మౌత్ ఎలాంటి పర్సనాలిటీకి ప్రతిరూపమో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎదటివాళ్ల మనస్తత్వం తెలుసుకోవడానికి ఫేస్ చూస్తే చాలు !!
బిగ్ మౌత్:
పెద్దగా నోరు ఉన్నవాళ్లు గొప్ప ఉద్ధేశ్యం కలిగి ఉంటారు. ఎప్పుడు అందరి దృష్టిని ఆకర్షించాలని కోరుకుంటారు. వీళ్లు లీడర్ పొజిషన్ కి సరిపోతారు. పెద్ద సైజులో నోరు ఉన్నవాళ్లు.. గొప్ప ఆశయాలు కలిగి ఉంటారు. ఏదైనా వస్తువైనా, మనిషి అయినా కావాలి అనుకుంటే.. సాధిస్తారు.

స్మాల్ మౌత్:
చిన్న సైజులో నోరు ఉన్నవాళ్లు కొంత సంతోషం దొరికినా.. సంతృప్తి చెందుతారు. ప్రతి ఒక్కరిపై జాలి కలిగి ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరినీ ఇష్టపడతారు. అయితే నలుగురితో కలిసిపోయే తత్వం చాలా తక్కువగా ఉంటుంది. ఇతరులతో తమ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతారు. ఒంటరిగా ఇబ్బందులు ఫేస్ చేస్తారు.
లావు పెదాలు ( థిక్ లిప్స్ ):
పెదాలు లావుగా ఉండేవాళ్లు దూకుడు స్వభావం కలిగి ఉంటారు. చాలా బోల్డ్ గా ఉంటారు. అలాగే కొత్త వ్యక్తులను కలుసుకోవడానికి ఇష్టపడతారు. పైపెదవి మందంగా ఉంటే.. మీరు ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా ప్రేమిస్తారు. కింది పెదవి మందంగా ఉంటే.. మీ చుట్టూ ఉన్న వాళ్లందరినీ ప్రేమిస్తారు.
చేతి గోళ్లను బట్టి పర్సనాలిటీ అంచనా వేయవచ్చా ?
సన్నటి పెదాలు ( థిన్ లిప్స్ ):
సన్నటి పెదాలు కలిగినవాళ్ల డిజైర్ తక్కువగా ఉంటుంది. అయితే కెరీర్ విషయంలో లక్ష్యాలు చాలా బలంగా ఉంటాయి. మీ కలలు నిజం చేసుకునే సత్తా మీకు ఉంటుంది. పైపెదవి సన్నగా ఉంటే.. ప్రేమపై ఆసక్తి ఉండదు. చదువు, కెరీర్ పై ఎక్కువ శ్రద్ధ పెడతారు. కింది పెదవి సన్నగా ఉన్నవాళ్లు ఇతరులతో మాట్లాడటానికి ఇబ్బందిగా ఫీలవుతారు.



Click it and Unblock the Notifications