Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీ పేరు లేదా మీ రాశిని బట్టి పఠించాల్సిన లక్ష్మీ మంత్రాలు!
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీ పేరు లేదా మీ రాశిని బట్టి పఠించాల్సిన లక్ష్మీ మంత్రాలు!
లక్ష్మీ ఉపాసన అనే గ్రంథంలో ఏయే రాశులలో పుట్టిన జాతకులు లక్ష్మీ కటాక్షం కోసం, ఏ మంత్ర జపం చేయాలన్నా విషయం వివరించబడింది. గురుముఖత: ఉపదేశం పొందిన మంత్రాలు వెంటనే ఫలితాలను చూపిస్తే, భక్తి శ్రద్ధలతో చేసే మంత్రజపం తప్పక మంచి ఫలితాలనిస్తుంది. మన రాశికి, లేక మన పేరుకు అనువైన మంత్రాన్ని జపిస్తే, తప్పక ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతాం.
ఈ మంత్రాలు బీజాక్షర సమన్వితాలు. అందుచేత మహాలక్ష్మీదేవి పరిపూర్ణ కటాక్షం కోసం ఈ మంత్రాలను పఠించాలి. ఇంకా మంత్రాలను త్రిసంధ్యలలో పఠిస్తే, ధ్యానమావాహనాది షోడశోపచారపూజలు చేసిన ఫలితం కలుగుతుంది.
శ్రీమహాలక్ష్మీ దేవి అనుగ్రహసిద్ది కోసం ఆయా రాశులలో పుట్టినవారు చేయాల్సిన మంత్ర జపం నిర్దేశింపబడింది. కొందరికి తమ జన్మ రాశి తెలియకపోవచ్చు. వారి సౌకర్యార్థం, వారి పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి కూడా ఏ విధమైన మంత్రజపం చేసుకోవచ్చునన్న విషయం సూచించబడింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీ పేరు...రాశి ప్రకారం మీ మంత్ర జపం ఏంటో తెలుసుకోండి...

మేష రాశి
మేష రాశిలో జన్మించిన వారు, పేరులో మొదట అక్షరం చూ, చే, చో, లా, లీ, లే, లో, అ అనే క్షరాలు ఉన్న వారు ‘‘ఓం ఏం క్లీం సో:'' అనే మంత్రాన్ని పఠించాలి.

వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వారు, పేరు మొదట అక్షరం ఇ, ఉ, ఎ, ఓ, వా, వి, వూ, వె, వో అనే అక్షరాలు ఉన్నవారు ‘‘ఓం ఏం క్లీం శ్రీ:'' అనే మంత్రాన్ని పఠించాలి.

మిథునం:
మిథున రాశిలో జన్మించిన వారు, పేరు మొదట అక్షరం కా, కీ, కూ, ఘ, చ, కె, కో, హా అనే అక్షరాలు ఉన్నవారు ‘‘ఓం క్లీం ఏం సో:'' అనే మంత్రాన్ని పఠించాలి.

కర్కాటకం
కర్కాటక రాశిలో జన్మించిన వారు, పేరు మొదట అక్షరం హీ, హో, హె, డా, డీ, డూ, డె, డో అనే అక్షరాలు ఉన్నవారు ‘‘ఓం ఏం క్లీం శ్రీ:'' అనే మంత్రాన్ని పఠించాలి.

సింహ రాశి
సింహ రాశిలో జన్మించిన వారు, పేరులో మొదట అక్షరం మా, మీ, మూ, మె, మో, టా, టి, టూ, టె అనే అక్షరాలు ఉన్నవారు ‘‘ఓం హ్రీం ఏం సో:'' అనే మంత్రాన్ని పఠించాలి.

కన్య రాశి
కన్య రాశిలో జన్మించిన వారు, పేరులో మొదట అక్షరం టో, పా, పీ, పూ, ప, ణ, ఠ, పె, పో అనే అక్షరాలు ఉన్నవారు ‘‘ఓం శ్రీం ఏం సో:'' అనే మంత్రాన్ని పఠించాలి.

తుల రాశి
తుల రాశిలో జన్మించిన వారు, పేరులో మొదట అక్షరం రా, రీ, రూ, రె, రో, తా, తీ, తూ, తె అనే అక్షరాలు ఉన్నవారు ‘‘ఓం హ్రీం క్లీం శ్రీం:'' అనే మంత్రాన్ని పఠించాలి.

వృశ్చికం రాశి
వృశ్చికం రాశిలో జన్మించిన వారు, పేరులో మొదట అక్షరం నా, నీ, నూ, నె, నో, యా, యూ అనే అక్షరాలు ఉన్నవారు ‘‘ఓం ఏం క్లీం సో:'' అనే మంత్రాన్ని పఠించాలి.

ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వారు, పేరులో మొదట అక్షరం యె, యో, భా, భీ, భూ, ధా, ఫా, ఢా, భె అనే అక్షరాలు ఉన్నవారు ‘‘ఓం హ్రీం క్లీం సో:'' అనే మంత్రాన్ని పఠించాలి.

మకర రాశి
మకర రాశిలో జన్మించిన వారు, పేరులో మొదట అక్షరం భో, జా, జీ, ఖీ, ఖూ, ఖె, ఖో, గా, గీ అనే అక్షరాలు ఉన్నవారు ‘‘ఓం ఏం క్లీం హ్రీం శ్రీం సో:'' అనే మంత్రాన్ని పఠించాలి.

కుంభం రాశి
కుంభం రాశిలో జన్మించిన వారు, పేరులో మొదట అక్షరం గూ, గె, గో, సా, సి, సూ, సె, సో, దా అనే అక్షరాలు ఉన్నవారు ‘‘ఓం హ్రీం ఏం క్లీం శ్రీం:'' అనే మంత్రాన్ని పఠించాలి.

మీన రాశి
మీన రాశిలో జన్మించిన వారు, పేరులో మొదట అక్షరం దీ, దూ, ధ, ఝ, దె, దో, చా, చీ అనే అక్షరాలు ఉన్నవారు ‘‘ఓం హ్రీం క్లీం సో:'' అనే మంత్రాన్ని పఠించాలి.



Click it and Unblock the Notifications