Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చివరి వేలు చూపుడు వేలుని తాకగలిగితే దేనికి సంకేతం..??
చివరి వేలు చాలా సమాచారాన్ని, వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకతలను చాలా క్లియర్ గా వివరిస్తుందట.
చేతివేళ్లు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. కొంతమందికి పొడవుగా ఉంటే.. కొంతమందికి పొట్టిగా ఉంటాయి. మరికొందరు ఎక్స్ ట్రా మరొక వేలు ఉంటుంది. అసలు చేతివేళ్లు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండటానికి కారణం.. అందులో దాగున్న వ్యక్తిత్వ రహస్యాలు.
ఒక్కో వ్యక్తి చేతి వేళ్లు ఒక్కో విధంగా ఉంటాయి. పొడవు, ఆకారం రెండూ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. చేతివేళ్ల ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని, అభిరుచులను చాలా వివరంగా చెబుతాయట. చివరి వేలు చాలా సమాచారాన్ని, వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకతలను చాలా క్లియర్ గా వివరిస్తుందట.

పైన భాగం
చివరి వేలులో మూడు భాగాలు అంటే బాక్సులుగా ఏర్పడి ఉంటాయి కదా. వాటిలో పైన పార్ట్ కాస్త పొడవుగా ఉంటే.. మీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. చాలా ప్రత్యేకమైన లక్షణాలుంటాయి. నమ్మసక్యంకాని సత్తా మీలో ఉంటుంది. మీరు అంత తేలికగా ఫూల్ కాలేరు.

మధ్య భాగం
ఒకవేళ చివరి వేలులో మధ్యలోని భాగం పొడవుగా ఉంటే.. సహజంగా ఇతరులకు సహాయం చేయాలన్న ఆలోచన ఉంటుంది. అలాగే చాలా పట్టుదల కలిగిన వ్యక్తి మీరు.

మూడో భాగం
ఒకవేళ మూడో భాగం పొడవుగా ఉంటే.. మీరు చాలా నిజాయితీగా ఉంటారు. ఎప్పుడూ నిజమే చెబుతారు. అలాగే చాలా అద్భుతమైన సోషల్, వెర్బల్ స్కిల్స్ ఉంటాయి.

సన్నని చివరి వేలు
పామిస్టరీ ప్రకారం చాలా చిన్నగా మీ చివరి వేలు ఉంటే.. మీకు ఓర్పు ఉండదు. ఒకవేళ మీ చివరి వేలు కాస్త పొడవుగా ఉంటే.. జాలి, దయ ఉండదు.

వంకరగా ఉంటే
ఒకవేళ చిటికెన వేలి షేప్ స్ట్రెయిట్ గా లేకుండా.. వంకరగా ఉంటే.. వాళ్లను అంతతేలికగా నమ్మకూడదు. వాళ్లు చాలా కన్నింగ్ గా ఉంటారు.

ఉంగరపు వేలిని తగిలితే
ఒకవేళ చిటికెన వేలు.. ఉంగరపు వేలి గోటి వరకు రాగలిగితే.. ఆ వ్యక్తి జీవితంలో చాలా ఖచ్చితమైన లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. వీళ్లు గొప్ప ఇంజనీర్లు, డాక్టర్లు అవుతారు. ఇలాంటి వ్యక్తులు చాలా డబ్బు, పరపతిని సంపాదిస్తారు. జీవితంలో ప్రతి అడుగులోనూ.. డబ్బుల వర్షం కురుస్తుంది.

చూపుడు వేలుని తాకితే
ఒకవేళ చిటికెన వేలు.. చూపుడు వేలు నెయిల్ కి తగిలింది అంటే.. అలాంటి వాళ్లు మంచి వ్రైటర్స్, నటులు అవుతారు.

ఒకే పొడవు
ఒకవేళ చూపుడు వేలు, చిటికెన వేలు ఒకే పొడవు ఉంటే.. అలాంటి వాళ్లు చాలా షార్ప్ గా ఉంటారు. చాలా ప్రణాళికాబద్ధంగా ఉంటారు. అంతేకాదు మంచి రాజకీయవేత్తలు అవుతారు.



Click it and Unblock the Notifications