Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
మగవాళ్ల వేళ్లు.. మహిళలపై ఎలాంటి అభిప్రాయాన్ని సూచిస్తాయి ?
ఎలా ఉంటుందో తెలియని భవిష్యత్ గురించి, ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారో తెలియని వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి మనుషులు చాలా ఆరాటపడతారు. మనుషుల స్వభావం పసిగట్టి.. వాళ్లకు అనుగుణంగా ఉండాలని భావిస్తారు. ప్రస్తుతం రకరకాల శాస్త్రాలు.. మనుషుల పర్సనాలిటీని తేలికగా వివరిస్తున్నాయి.
కేవలం.. చేతి గీతలు, చేతి వేళ్లు, ఆకారాలు గమనిస్తే చాలు. అయితే.. మగవాళ్లు ఆడవాళ్లను ఎలా ట్రీట్ చేస్తారనేది.. వాళ్ల వేళ్ల పొడవును, ఆకారాన్ని బట్టి కనుక్కోవచ్చట. చాలామంది మగవాళ్లు ఆడవాళ్ల విషయంలో క్రూరంగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి.. వాళ్లు ఆడవాళ్లను ఎలా గౌరవిస్తారో తెలుసుకుంటే.. ముందు జాగ్రత్త పడవచ్చు.
బర్త్ చార్ట్ అవసరం లేకుండా.. కేవలం మగవాళ్ల చేయి చూసి.. వాళ్ల నిజమైన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. మహిళల పట్ల వాళ్లు కోపంగా, క్రూరంగా వ్యవహరిస్తారా ? ప్రేమగా మసలుకుంటారా అనేది తెలుసుకోవచ్చని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. మరి మగవాళ్ల చేతివేళ్లను బట్టి.. వాళ్లకు మహిళలపై ఉన్న అభిప్రాయం ఎలాంటిదో తెలుసుకుందామా..

సాముద్రిక శాస్త్రం
పురాతన కాలం నుంచి.. రకరకాల శాస్త్రాల్లో.. బాడీ అనాలసిస్ గురించి చాలా వివరించాయి. అరచేయి, నుదురు, పాదాలు, ఫేస్ రీడింగ్ వంటివి చాలా శాస్త్రాలు వివరించాయి. సాముద్రిక శాస్త్రం వీటన్నింటిలో ఒకటి. ఇది.. చేతి ఆకారం, సైజు, గీతలను బట్టి వ్యక్తిత్వాన్ని వివరిస్తుంది.

బాడీ అనాలసిస్
ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను, భవిష్యత్ ను సాముద్రిక శాస్త్రం పూర్తీగా వివరిస్తుందని.. గరుడ పురాణం చెబుతోంది. గీతలు, మచ్చలు, మార్క్స్ వంటి గుర్తుల ద్వారా వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంది.

మీ భర్త గురించి
ఇవాళ మీ భర్త గురించి వివరించబోతున్నాం. అంటే.. మీ భాగస్వామి.. మహిళల పట్ల ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు, మహిళలను ఎలా ట్రీట్ చేస్తారు, ఎంత గౌరవం ఇస్తారు అనే విషయాన్ని అంచనా వేద్దాం.

చూపుడు వేళు
మిగిలిన వేళ్ల కంటే.. చూపుడు వేలు పొడవుగా ఉన్న వాళ్లు.. చాలా వివాద స్వభావం కలిగి ఉంటారు. మహిళల పట్ల చాలా రూడ్ గా, హింసాత్మకంగా వ్యవహరిస్తారు. ఇలాంటి వ్యక్తి భార్య.. డొమెస్టిక్ వయోలెన్స్, ఎమోషనల్ వయోలెన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.

ఉబ్బినట్టు ఉంటే
చేతి వేళ్ల కొనలు ఉబ్బినట్టు ఉంటే.. వాళ్ల సమస్యలను దాచిపెట్టే స్వభావం కలిగి ఉంటారు. వాళ్ల భార్య దగ్గర చాలా విషయాలను.. ఎప్పటికీ దాచిపెట్టే స్వభావం కలిగి ఉంటాడు.

సమానంగా ఉంటే
ఉంగరపు వేలు, చూపుడు వేలు సమానంగా ఉన్న మగవాళ్లు.. చాలా ఆకర్షణీయంగా ఉంటారు. చాలా పొలైట్ గా, శ్రద్ధగా వ్యవహరిస్తారు. వాళ్ల ప్రాథమిక అజెండాను.. వాళ్ల అందం వెనక దాచిపెట్టే స్వభావం కలిగి ఉంటారు.

పొడవాటి ఉంగరపు వేలు
పొడవాటి ఉంగరపు వేలు ఉండే మగవాళ్లు చాలా దూకుడు స్వబావం కలిగి ఉంటారు. అలాగే.. అయోమయ వ్యక్తిత్వం కలిగి ఉంటారు. దీనివల్ల వాళ్ల భార్య, వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి.

దూకుడు స్వభావం
ఉంగరపు వేలు.. టెస్టోస్టెరాన్ తో లింగ్ అయి ఉంటుందని భావిస్తారు. ఉంగరపు వేలు చాలా పొడవుగా ఉంటే.. దూకుడు స్వభావం వల్ల అనేక సమస్యలు వస్తాయని సూచిస్తుంది.

వెంట్రుకలు
మగవాళ్ల చేతులవెనక వైపు చాలా మందంగా, ఒత్తుగా వెంట్రుకలు ఉంటే.. చాలా అన్ లక్కీ అని సంకేతం. ఇతరులతో పోల్చితే.. వీళ్లు ఎలాంటి వ్యాపారంలోనూ సక్సెస్ కాలేరు.

మోకాళ్ల వరకు చేతులు
బాగా లావుగా ఉన్న చేతులు కలిగి, మోకాళ్ల వరకు చేతులు పొడవు కలిగిన మగవాళ్లు.. కింగ్ స్టైల్ లైఫ్ కలిగి ఉంటారు. అన్ని రకాల లగ్జరీలను ఎంజాయ్ చేయగలుగుతాడు.

చేతివేళ్లు
చేతి వేళ్లన్నీ ఒకదానికి ఒకటి దగ్గర దగ్గరగా ఉండే మగవాళ్లు చాలా ఆస్తులు కలిగి ఉంటారు. భూములు, ఇల్లులు, కార్లు, అనేక బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉంటారు.

తెలివైనవాళ్లు
చాలా షార్ప్ గా, పొడవాటి వేళ్లు కలిగిన మగవాళ్లు.. ఫ్యాట్ ఏమాత్రం లేకుండా ఉండే వేళ్లు కలిగి ఉంటే.. వాళ్లు చాలా తెలివైన వాళ్లని.. సాముద్రిక శాస్త్రం చెబుతోంది.



Click it and Unblock the Notifications