Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
మీ రాశిని బట్టి మీ లక్కీ డే ఇప్పుడే తెలుసుకోండి.. !!
ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేయాలంటే.. మీ లక్కీ డ్రెస్ ఎంచుకుంటున్నారా ? అలాగే మీరు చేయబోతున్న పనిలో సక్సెస్ అవ్వాలంటే.. కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతున్నారా ? అయితే.. మీ రాశిని బట్టి మీకొక లక్కీ డే ఉంటుందని తెలుసా ? అవును మీరు అనుకున్న పనిలో సక్సెస్ కావాలన్నా.. మీరు లక్ష్యాలు సాధించాలన్నా.. మీకు లక్కు, కిక్కు తీసుకొచ్చే రోజు ఆ పని ప్రారంభిస్తే.. విజయం మీదే.
2016లో ఏ రాశి వాళ్లకు ఏ కలర్ అదృష్టం తీసుకొస్తుంది ?
మీకు ఏ రోజు అనుకూలంగా ఉంటుందో.. ఆ రోజు మీ పని ప్రారంభించడం, పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు ఊహించని రేంజ్ లో సక్సెస్ అయిపోతారు. సింపుల్ మీ రాశిని బట్టి మీకు ఏ రోజు అదృష్టం తీసుకొస్తుందో ఇప్పుడే ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి.

మేషరాశి
మేషరాశివాళ్లకు అదృష్టం తీసుకొచ్చే రోజు మంగళకరమైన మంగళవారం. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి అనుకున్నప్పుడు, ఎదుటివాళ్లలో మీపై అటెన్షన్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు మంగళవారం మీ పని స్టార్ట్ చేయడం సక్సెస్ అవుతారు.

వృషభ రాశి
వృషభ రాశివాళ్లకు శుక్రవారం, బుధవారం, శనివారం, సోమవారాలు బాగా కలిసొస్తాయి. గురువారం ఎక్కువ ఖర్చులు ఉంటాయి. శుక్రవారం ఉపవాసం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

మిథున రాశి
మిథునరాశి వాళ్లకు బుధవారం చాలా లక్కీ డే. కొత్త కోర్సు కానీ, కొత్త యాక్టివిటీ గానీ మొదలు పెట్టాలి అనుకుంటే.. బుధవారం స్టార్ట్ చేస్తే మీరు ఆశించిన ఫలితాలు పొందవచ్చు.

కర్కాటక రాశి
ఆదివారం, శుక్రవారం కర్కాటక రాశి వాళ్లకు సంతోషంగా, ఎంజాయ్ చేయడానికి సహాయపడతాయి. మంగళవారం, సోమవారం, గురువారాలు సక్సెస్ ని తీసుకొస్తాయ. ప్రయాణాలు, పెట్టుబడులకు బుధవారం అనుకూలమైన రోజు. శనివారం మీకు అంతగా కలిసిరాదు. అలాగే సోమవారం ఉపవాసం ఉంటే మంచిది.

సింహ రాశి
సింహరాశి వాళ్లకు సండే లక్కీ డే. మీ టాలెంట్ నిరూపించుకోవడానికి ఆదివారం సరైన రోజు. మీ లక్ష్యాలు చేరుకోవడానికి ఆదివారం ఇంకా ఎక్కువ కష్టపడితే మంచిది.

కన్యా రాశి
బుధ, శుక్ర, సోమ, గురు వారాలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆదివారం, మంగళవారం, శనివారాల్లో ఏదైనా పనిమొదలు పెట్టినా, ముఖ్యమైన పనులు చేసినా.. సక్సెస్ కాలేరు.

తులా రాశి
తులారాశి వాళ్లకు శుభప్రదమైన శుక్రవారం చాలా అనుకూలమైన రోజు. శుక్రవారం మీరు ఎక్కువ ఫలితాలు పొందగలుగుతారు. అలాగే డిప్లమేటిక్ ఆటిట్యూట్ కూడా శుక్రవారం బాగా ఉపయోగపడుతుంది. మీరు ఆశించిన ఫలితాలు పొందాలంటే.. శుక్రవారం ఏదైనా పని ప్రారంభించడం మంచిది.

వృచ్చిక రాశి
వృచ్చిక రాశివాళ్లకు ఆది, సోమ, మంగళ, గురు, శుక్రవారాలు చాలా అదృష్టకరమైన రోజులు. ఏదైనా మంచి ఫలితాలు సాధించాలి అనుకుంటే.. ఈ వారాలు ఎంచుకోవడం మంచిది. బుధ, శనివారాల్లో ఎలాంటి కొత్త పనులు ఆరంభించకపోవడం మంచిది.

ధనుస్సు రాశి
గురువారం ధనస్సు రాశి వాళ్లకు అనుకూలం. స్నేహితులు, భాగస్వామితో మీ రిలేషన్ బలపరుచుకోవడానికి గురువారం సరైనది. అలాగే.. మీ వర్క్ లో మీ ఆలోచనలు చెప్పడానికి కూడా గురువారం అనుకూలమైనది.

మకర రాశి
మకర రాశి వాళ్లకు శనివారం అదృకరమైనది. ఎందుకంటే.. మిగిలిన రోజులకంటే.. శనివారం మీరు చాలా యాక్టివ్ గా, ఫ్రెష్ మైండెడ్ గా ఉంటారు. కాబట్టి శనివారం ఏ పని చేసినా.. చాలా పాజిటివ్ ఫలితాలు పొందుతారు.

కుంభ రాశి
గురువారం, శుక్రవారం, మంగళవారం, సోమవారం.. ఈ రోజులన్నీ మీ వెనకే ఉంటాయి. ఈ నాలుగు రోజులూ మీకు లక్కీనే. బుధవారం, శనివారం మీకు అంతగా కలిసిరావు. ఆదివారం అనుకూల, వ్యతిరేక ఫలితాల మిశ్రమం.

మీన రాశి
మీది మీన రాశి అయితే.. మీకు గురువారం బాగా అనుకూలంగా ఉంటుంది. గురువారం మీ కలలు నిజం చేసుకుంటారు. అలాగే కొత్త పనులు ప్రారంభిస్తే.. ఎక్కువ ఫలితాలు పొందవచ్చు.



Click it and Unblock the Notifications