Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఈ మొక్కలు అందంగా ఉండటమే కాదు.. అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాయట...!
అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకొచ్చే అందమైన మొక్కలు..!
సాధారణంగా.. ఇంట్లో కొన్ని ఫోటోలు, కొన్ని వాస్తు నియమాలు, బొమ్మలు, విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ తమ ఇంట సిరులు కురిపిస్తాయని, అదృష్టం, ఐశ్వర్యం తీసుకొస్తాయని నమ్ముతారు. అయితే.. ఇంట్లో కొన్ని మొక్కలను పెట్టుకోవడం వల్ల కూడా.. సంతోషం, సంపద ఉంటాయని వాస్తుశాస్త్రం చెబుతోంది.
తేలికగా చూసుకోగలిగిన, ఎండిపోకుండా.. పచ్చగా ఉండే మొక్కలను ఇంట్లో పెట్టుకుంటే.. ఎలాంటి అనర్థాలు జరగకుండా, ఆర్థిక సమస్యలు రాకుండా, మనస్పర్థలకు దూరంగా ఉండేలా చేస్తాయని.. పండితులు సూచిస్తున్నారు. మరి అదృష్టం పొందడానికి, పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి. .?

లక్కీ బ్యాంబూ
వెదరు మొక్కను లక్కీగా భావిస్తారు. ఇప్పుడు మార్కెట్ లో అ లక్కీ బాంబూ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల రకరకాల ప్రయోజనాలు పొందవచ్చట. సంతోషం, సంపద, అదృష్టం, ఆరోగ్యం వంటి అన్ని మీ సొంతమవుతాయట.

మనీ ట్రీ
సాధారణంగా మనీ ప్లాంట్ అని పిలిచే ఈ మొక్కను ఇంట్లో పెట్టుకుంటే.. లక్ అని చెబుతుంటారు. నిజమే.. ఈ మొక్క ఇంట్లో ఉంటే.. అదృష్టం పండినట్టే. అలాగే.. మీ లక్కీ నంబర్ ఎంత అయితే.. అన్ని ఆకులు ఒక కొమ్మకు ఉంటే.. మరింత లక్కీ.

స్నేక్ ప్లాంట్
స్నేక్ ప్లాంట్ నే మదర్ ఇన్ లా ప్లాంట్ అని పిలుస్తారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే.. గుడ్ లక్ మీ ఇంట్లో ఉన్నట్టే. అంతేకాదు గాలిలో ఉండే విషపూరిత గ్యాస్ లను ఈ మొక్క గ్రహించగలుగుతుంది.

తులసి మొక్క
పాపులర్ మెడిసిన్ ప్లాంట్ మాత్రమే కాదు.. ఇంట్లో తులసి మొక్కను పెంచితే.. ప్రేమ, సంపద, లక్, అందం.. అన్నీ సొంతమవుతాయి. ఎలాంటి సమస్యలు ఉండవు. అలాగే ఇందులో ఉండే.. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆర్థికంగా సక్సెస్ అవడానికి సహాయపడుతుంది.

హనీ సకల్ (ఒకరకమైన పూలతీగ)
హనీ సకల్ అని పిలిచే ఈ మొక్క ద్వారా సువాసన వస్తుంది. అలాగే గుడ్ లక్ తీసుకొస్తుంది. అలాగే ఇది ఇంటికి రక్షణగా భావిస్తారు.

మల్లె మొక్క
మల్లెపూల మొక్క ఇంట్లో ఉంటే.. సువాసనబరితంగా ఉంటుంది. అలాగే ప్రేమ, డబ్బును ఎట్రాక్ట్ చేస్తుంది.

గులాబి మొక్క
రెడ్, వయోలెట్, బ్లూ ఎలాంటి రోజ్ ఫ్లవర్ మొక్క అయినా ఇంట్లో ఉంటే.. మీకు లక్కీయే. గులాబి అంటే.. ప్రేమకు, అదృష్టానికి చిహ్నం.



Click it and Unblock the Notifications