Latest Updates
-
ఆకలి తీరాలి, బరువు పెరగకూడదు..అయితే డిన్నర్ కి ఇది బెస్ట్ చాయిస్..10 నిమిషాల్లోనే చేసేయండిలా! -
బానిసత్వం పోయింది బాస్: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగి..మేనేజర్ ప్రశ్నకు జెన్ జీ ఉద్యోగి దిమ్మతిరిగే కౌంటర్ -
పప్పులు నానబెట్టే పనే లేదు.. అప్పటికప్పుడు అచ్చం పునుగుల్లా ఉండే మినీ రైస్ బోండా చేసుకోండిలా.. -
ఆ కంపెనీలో హస్తప్రయోగం చేసుకోడానికి అరగంట బ్రేక్! -
పిల్లల లంచ్ బాక్స్ ఖాళీ అయ్యి రావాలా? ప్రోటీన్ రిచ్ సోయా పుదీనా రైస్ చేసి పెట్టండి! -
హిందూ ధర్మంలో అగ్ని ఎందుకు పవిత్రంగా భావించబడుతుంది? -
జలై 1నే డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటారు? 2026 థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత -
జూలై 2న కుంభరాశిలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి తిరుగేలేదు, ఎవరికి జాగ్రత్త? -
National Doctor's Day 2026: తెల్ల కోటు వేసుకున్న ప్రత్యక్ష దేవుళ్లు..డాక్టర్స్ డే విషెస్ ఇలా చెప్పండి -
జూలై 1 శాలరీ డే: ఈ 5 రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం!
పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీకు, మీ ఫ్యామిలీకి అదృష్టం తీసుకొస్తుందా ?
ఇండియాలో ప్రతి అమ్మాయిని అదృష్టంగా, శుభకరంగా భావిస్తారు. అలాగే చూస్తారు కూడా. అమ్మాయిలంటే ప్రేమ, అదృష్టం, శ్రేయస్సుగా ఫీలవుతారు. పుట్టినింట్లో అయినా, మెట్టినింట్లో అయినా.. మహిళలు దేవతలుగానే భావిస్తారు. లక్ష్మీ స్వరూపంగా చూస్తారు. అందుకే ఇంట్లో మహిళలు అందంగా తయారై.. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

మరి మీ ఇంటికి వచ్చే అమ్మాయి లేదా మీ లైఫ్ లోకి వచ్చే అమ్మాయి మీకు, మీ కుటుంబానికి అదృష్టకరమా ? లేదా అన్న విషయం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంతేకాదు ఆ అమ్మాయి మీ జీవితంలో సంతోషం తీసుకొస్తుందా లేదా అని తెలుసుకోవాలని ఉందా ? అయితే ఈ ఆర్టికల్ ను జాగ్రత్తగా చదివేయండి. అమ్మాయిల్లో అందం, మీకు అదృష్టం తీసుకొచ్చే విషయాలు చర్చిద్దాం..

మహిళలు, అదృష్టం
కొన్ని సందర్భాల్లో అదృష్టాన్ని శరీరక విషయాలను బట్టి, వాళ్ల అలవాట్లను బట్టి అంచనా వేస్తారు. అయితే కొన్ని రకాల మచ్చలు, గుర్తులను బట్టి ఆ అమ్మాయి అదృష్టవంతురాలా ? కాదా అనేది తెలుసుకోవచ్చు. బాడీ పార్ట్ లేదా మచ్చను బట్టి అమ్మాయిల గురించి అనేక విషయాలు తెలుసుకోవచ్చు.

పాదాల కింది భాగం
పామిస్టరీ ప్రకారం అమ్మాయిల పాదాల అడుగు భాగంలో త్రిభుజాకారం గుర్తు ఉంటే.. వాళ్లు తెలివైన వాళ్లు, అర్థం చేసుకునే తత్వం కలిగినవాళ్లుగా చెప్పవచ్చు. అంటే సహాయం చేసే తత్వం, తెలివితేటలు ఉంటాయి. మీ కుటుంబంలో అందరినీ హ్యాపీగా ఉంచాలని కోరుకుంటుంది. కుటుంబ విలువలను గౌరవిస్తుంది.

నాభి ( బొడ్డు )
మహిళల నాభి దగ్గర ఎక్కడైనా పుట్టు మచ్చ ఉంటే.. మీ కుటుంబానికి వాళ్లు అదృష్టం. సంతోషకరమైన, శ్రేయష్కరమైన జీవితం ఉంటుంది.

కాలి వేళ్లు
మహిళల కాలి వేళ్లు ఎక్కువ పొడవుగా ఉంటే.. వాళ్లు తరచుగా జబ్బు పడుతూ ఉంటారు. అయితే ఒకవేళ బొటనవేలు వెడల్పుగా, గుండ్రంగా, ఎర్రగా ఉంటే.. ఆమె అదృష్టవంతురాలు.

కాలివేళ్లపై గుర్తులు
అమ్మాయిల కాలివేళ్లపై స్పైరల్ ఇంప్రింట్స్ ఉంటే.. మంచి భవిష్యత్ ఉంటుంది. వాళ్ల జీవితంలో ఎక్కువ కష్టాలు పడాల్సిన అవసరం ఉండదు. అలాంటి అమ్మాయిపై ఎప్పుడూ దేవుడి అనుగ్రహం ఉంటుంది.

పాదాల అడుగు భాగంపై ఇంప్రింట్స్
మహిళల పాదాల అడుగుపాదంపై తామర, సైకిల్, లేదా శంఖం ఆకారంలో ఇంప్రింట్స్ ఉండే మహిళలు చాలా అదృష్టవంతులు. వాళ్లు లేదా వాళ్ల భాగస్వామి ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

ముక్కుపై మచ్చ
ముక్కుకి ఏదో ఒకవైపు మచ్చ ఉండే మహిళలు.. అదృష్టవంతులు. వాళ్లు ఎప్పుడు శ్రేయస్కరంగా ఉంటారు. ఎప్పటికీ సంపద కలిగి ఉంటారు.

నాభి లోపలికి ఉంటే
ఏ మహిళ నాభి లోపలికి ఉంటుందో.. అంటే బయటకు రాకుండా లోపలికి ఉంటుందో.. వాళ్లు జీవితాంతం సంతోషకరమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. జీవితంలో ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉండదు.

నాలుక
సాఫ్ట్ గా, పింక్ కలర్ నాలుక ఉండే మహిళలు.. చాలా సంతోషకరమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. వాళ్ల కుటుంబాన్ని కూడా అంతే సంతోషంగా చూసుకుంటారు.

కళ్లు
అమ్మాయిల కళ్లు అందంగా ఉంటే.. వాళ్లు చాలా హ్యాపీగా ఉంటారు, అలాగే చాలా ప్రేమ కలిగి ఉంటారు. కంటికి చివరి భాగంలో ఎర్రగా ఉంటే.. మీరు అదృష్టవంతులని అర్థం. అలాంటి అమ్మాయి దొరికితే వదిలిపెట్టకండి అమ్మాయిలూ.. !

పాదాలు
పింక్, సాఫ్ట్ గా ఉండే పాదాలు కలిగి ఉండే మహిళలు.. తన భర్త లేదా బాయ్ ఫ్రెండ్ ని సంతోషంగా ఉంచుతారు. శారీరక ప్రేమను ఇష్టపడతారు. వాళ్ల భాగస్వామి దగ్గర ఎప్పుడూ క్లోజ్ గా ఉండటానికి ఇష్టపడతారు.

పాదాల వేళ్లు సమానంగా ఉంటే
పాదాల వేళ్లు అన్నీ సమానంగా ఉంటే.. వాళ్లు జీవితాంతం సంతోషం పొందగలుగుతారు. అలాగే తమ కుటుంబాన్ని సంతోషపెడతారు.

ఎడమవైపు బుగ్గకు మచ్చ
ఏ మహిళకైతే ఎడమవైపు బుగ్గపై మచ్చ ఉంటుందో.. వాళ్లు అందరినీ చాలా ప్రేమగా చూసుకుంటుంది. అమితమైన ప్రేమ కలిగి ఉంటుంది. చాలా బాగా వంట చేస్తుంది. ఆమె రుచికరమైన వంటకాలతో కుటుంబ సభ్యులను సంతోషపెడుతుంది.

గోళ్లు
అందమైన పింక్ కలర్ గోళ్లు కలిగి ఉన్న అమ్మాయిలు మంచి లక్షణాలు కలిగి ఉంటుంది. మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటుంది. అలాగే ఆరోగ్యవంతురాలు.

పాదాల మధ్య వేలు
పాదాల మధ్య వేలు అన్నింటికంటే పొడవుగా ఉంటే.. ఆ మహిళ అపవిత్రమైనదిగా భావిస్తారు. కాబట్టి అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడం మంచిది.

కాలి మడమ
అమ్మాయిల కాలి మడమ గుండ్రంగా, సాఫ్ట్ గా ఉంటే.. వాళ్లు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. వాళ్ల జీవితంలో పెద్దగా కష్టాలు ఉండవు.

పళ్లు
పొడవుగా ఉండే పళ్లు కలిగిన మహిళలు.. ఎప్పటికీ ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోరు. వాళ్ల బ్యాంక్ అకౌంట్స్ ఎప్పుడూ ఫుల్ గా ఉంటాయి.

పాదాల వేళ్లు అతుక్కుంటే
మహిళల పాదాలు ఒకదానికి ఒకటి అతుక్కుని ఉంటే.. అలాంటి మహిళలు చాలా అదృష్టవంతులు. వాళ్ల మనస్తత్వం చాలా బాగుంటుంది.

శరీరంపై మచ్చ
మహిళలు శరీరంలో ఎక్కువగా ఎడమవైపు మచ్చలు కలిగి ఉంటే.. చాలా అదృష్టవంతులు. వాళ్లు, వాళ్ల కుటుంబానికి అదృష్టం తీసుకొస్తారు.

నుదుటిపై మచ్చ
తమ నుదుటి భాగం మధ్యలో మచ్చ కలిగి ఉండే మహిళలు.. చాలా ధనవంతులను పెళ్లి చేసుకుంటారు. ఎలాంటి కష్టాలు లేకుండా.. మంచి జీవితం పొందగలుగుతారు.



Click it and Unblock the Notifications