For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అరచేతిలో సింబల్స్ మరియు మార్కింగ్స్ కు సంకేతాలేంటి?

By Super Admin
|

అరచేయి మరియు వేళ్ళ మీద రేఖల గుర్తులు మరియు చిహ్నాలు అనుకూల మరియు ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. కొన్ని చిహ్నాలు లేదా త్రిభుజాల వంటి గుర్తులు సానుకూల శక్తి లేదా ఫలితాలను సూచిస్తాయి. క్రాస్ లైన్ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే స్థానం బట్టి ప్రభావం మారుతుంది.

ఉదాహరణ: అరచేతిలో మధ్య లైన్ అరచేతి చివరి అంచు నుంచి మొదలయ్యి కింద మెర్క్యురీ మౌంట్ తో కలిసి త్రిభుజంగా తయారవుతుంది. ఇది మధ్య వయస్సులో కీర్తిని సూచిస్తుంది.

ఖచ్చితమైన వయసులో వ్యక్తి యొక్క జీవితకాలమంతా త్రిభుజములు ప్లేస్మెంట్ నిష్పత్తిలో అపోలో రేఖ విభజించడం ద్వారా ఉత్పన్నమవుతాయి. ఏ వయసులో కీర్తిని సాధించవచ్చో సూచిస్తుంది.

హస్తసాముద్రికంలో గుర్తులు మరియు సింబల్స్ అర్థాలు

 బ్రేక్స్

బ్రేక్స్

అరచేయి యొక్క ప్రధాన లేదా చిన్న రేఖలలో బ్రేక్స్ పాజిటివ్ మరియు ప్రతికూలతలు రెండింటికి ప్రాతినిధ్యం వహించవచ్చు. అవి వివిధ లైన్ల మీద ఉన్న విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.

ఈ బ్రేక్స్ బొటనవేలి వైపు వెళ్తూ ఉంటే జీవితంలో కొత్త దిశను సూచిస్తాయి.

చేతి యొక్క అంచుల వైపు ఎగువ దిశలో బ్రేక్స్ ఊహించని లేదా అనూహ్యంగా వెళ్తూ ఉంటే, మీ దినచర్యలో ఊహించని మలుపు వస్తుందని అర్ధం.

ఈ బ్రేక్స్ మీ సాధారణ జీవితానికి ఎక్కువగా అడ్డంకి కావు. అయితే మీ జీవిత మార్గంలో ఒక మలుపు వస్తుందని అర్ధం.

సాధారణంగా ఈ బ్రేక్స్ మళ్లింపులు మరియు దృష్టి అనేవి ఎక్కడ ఎలా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

 చైన్స్ (గొలుసులు)

చైన్స్ (గొలుసులు)

మీ జీవితంలో ఎదుర్కొనే అడ్డంకులను సూచిస్తుంది. వారి చిన్నతనంలో కష్టం లేదా వారి ఎదుగుదలకు అడ్డు రావచ్చు.

రేఖల మీద ఉన్న చైన్స్ మీ ప్రేమ జీవితంలోని అనుభవాలకు సంబంధం కలిగి ఉంటాయి.

ఈ చైన్స్ ఆరోగ్య సమస్యలను కూడా సూచిస్తుంది.

చైన్ పొడవును బట్టి సమస్య సాగె సమయం ఉంటుంది.

క్రాసెస్

క్రాసెస్

జీవితంలో దీర్ఘకాలిక సమస్యలకు సూచన. అవి మీ జీవితంలో ప్రధాన మార్పుకు కారణం అవుతాయి.

అరచేతిపై ఉన్న స్థానాన్ని బట్టి అనుకూల లేదా ప్రతికూల మార్పులు ఉంటాయి.

ఇది మీ ప్రత్యర్ధుల నుండి ఆపద కలుగుతుందని ఒక సంకేతం అని చెప్పవచ్చు.

ఈ ప్రభావం కారణంగా బయట నుంచి ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది.

అలాగే ఈ క్రాసెస్ మన మనస్సు ఆధ్యాత్మిక జీవితం వైపు వెళ్ళటానికి ఒక సూచన.

గ్రిల్స్

గ్రిల్స్

ఈ గ్రిల్స్ ఎక్కువగా అరచేతిలో ఎత్తుగా కొండ వలే కనిపిస్తాయి.అంతేకాక ప్రతికూల సంకేతాలు ఉన్నాయని చెప్పుతూ సమస్యలు మరియు సర్దుబాట్లను సూచిస్తాయి.

అరచేతిలో ఏ భాగంలో ఉన్నా సరే జీవితంలో గాబరా, అభద్రత సూచిస్తుంది.

ఈ గ్రిల్స్ ఒక వ్యక్తి యొక్క అభివృద్దిలో ఆటంకాలను సూచిస్తాయి.

జీవితంలో వెంచర్లకు సంబంధించి, ఆరంభాలు లేదా అవాంతరాలు ఉంటాయని సూచిస్తుంది.

మీకు నిరంతరాయంగా ఆందోళన మరియు చికాకులు కలుగుతాయి.

డాట్స్ (చుక్కలు)

డాట్స్ (చుక్కలు)

అరచేతిలో చుక్కలు ఎప్పుడు కనపడవు. ఎందుకంటే అవి చాలా చిన్నగా ఉంటాయి.

ఇవి అనారోగ్యం, సంబంధాలు లేదా విధ్వంసక అనుభవం వంటి ఆందోళనలను సూచిస్తాయి. అవి మీ జీవితం లో సంక్షోభం సృష్టించిన ముఖ్యమైన మరియు జ్ఞాపకార్ధ సంఘటనలుగా సూచిస్తాయి.అంతేకాక అవి మీ జీవితంలో హెచ్చరిక ప్రమాదం చిహ్నాలుగా ఉంటాయి.

ఈ చుక్కలు శాశ్వతంగా ఉండవు కాబట్టి దురదృష్టకర పరిస్థితులలో మరియు సమస్యలు పరిష్కారం అయినప్పుడు కనుమరుగు అవుతాయి.

ద్వీపాలు

ద్వీపాలు

ఇవి జీవితంలో అననుకూల అంతరాయాలను సూచిస్తాయి.

ఇది ఒత్తిడిని సూచిస్తుంది. కెరీర్ లో వ్యక్తి కారణంగా చెడ్డ సంబంధం విషయంలో మానసిక ఒత్తిడి కలుగుతుంది.

అంతేకాకుండా భయం, ఆరోగ్యంలో బలహీనత మరియు శక్తిలో ఇబ్బంది లేదా బ్రేక్స్ మరియు వారసత్వంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని సూచిస్తుంది.

ద్వీపాన్ని దగ్గరగా పరిశీలన చేస్తే అది కొనసాగుతున్నట్టు కనిపిస్తే వారు అబద్దాలు ఆడతారనే దానికి సూచన.

ఈ రేఖ ముగింపు కూడా ప్రమాదకరం. అది ఆత్మహత్య వంటి పరిస్థితులకు దారితీస్తుంది.

స్టార్స్

స్టార్స్

అరచేతిలో స్టార్స్ ఉంటే విజయం మరియు మంచి అదృష్టాన్ని సూచిస్తుంది. అయితే అది గీత మరియు మౌంట్ ని బట్టి ఉంటుంది.

కానీ ఈ స్టార్ జీవన రేఖ కింద కనిపిస్తే భారీ సంక్షోభంనకు సూచన.

ఈ స్టార్ లైన్ చివరలో ఉంటే అది కీర్తి మరియు గొప్ప విజయాలకు సూచన. అంతేకాక సంబంధాలలో సక్సెస్ ని సూచిస్తుంది.

ఈ స్టార్ శని దగ్గర కనపడితే దురదృష్టం, భావోద్వేగ సమస్యలు మరియు వృత్తిలో ఆత్మవిశ్వాసం లోపించటం వంటి సమస్యలకు సూచన.

స్క్వేర్స్

స్క్వేర్స్

అరచేతిపై స్క్వేర్స్ ఉంటే సానుకూల సంకేతం మరియు ఆ లైన్ చుట్టూ బ్రేక్స్ ఉంటే అది రక్షణను సూచిస్తుంది. ఒకరిని రక్షించే దేవదూత, గురువు లేదా ఆధ్యాత్మిక మార్గదర్శి వంటి బయట శక్తుల నుండి అదృష్టం వస్తుంది. కానీ స్క్వేర్ మార్గంలో బ్రేక్స్ లేకుండా ఉంటే బాక్స్డ్ అనే ఒక సమయ వ్యవధిని సూచిస్తుంది.

టస్సెల్

టస్సెల్

వీటిని భయపెట్టే రేఖలు అని పిలుస్తారు. ఒక నిర్దిష్ట పరిస్థితి లేదా సమస్య గురించి గందరగోళం లేదా అశాంతిని సూచిస్తాయి.అంతేకాక శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక క్షీణతను సూచిస్తుంది.ఈ జీవన రేఖ చివరిలో వ్యక్తి యొక్క వయస్సును సూచిస్తుంది.

 విలోమ గుర్తులు

విలోమ గుర్తులు

వీటిని ప్రతికూల చిహ్నాలుగా చెప్పుతారు. ఇవి సానుకూల శక్తి క్షీణతకు సూచన. వారు ఎక్కడ ఉన్నా అడ్డంకులను కలిగిస్తుంది.అంతేకాక మీరు చెడు ప్రయోజనాల కోసం మీ నైపుణ్యాలను ఉపయోగిస్తారని సూచిస్తుంది.

త్రిభుజాలు

త్రిభుజాలు

త్రిభుజాలు చాలా అదృష్ట గుర్తులు మరియు భారీ విజయాన్ని సూచిస్తాయి.

వేరు వేరు పరిస్థితుల్లో సమర్థవంతంగా విశ్లేషించడానికి సామర్థ్యం కలిగి ఉంటారు. బహుళ విషయాలు సాధనకు బ్రెయిన్ పవర్ ఎక్కువ ఉంటుంది.

ఈ లైన్ ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఈ లక్షణాలను బలంగా చేస్తుంది.

అలాగే ఆధ్యాత్మిక లేదా అతీంద్రియాలకు ప్రతీకగా ఉంటుంది.

ఉదాహరణకు, సూర్యుడు రేఖపై ఒక త్రిభుజం ఉంటే అది జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో భారీ ఖ్యాతిని సూచిస్తుంది.

త్రిశూలాలు

త్రిశూలాలు

లైన్ పై త్రిశూలం గుర్తు ఉంటే అదృష్టం కలుగుతుంది. అంతేకాక మంచి లక్షణాలను పెంచుతుంది.

పొరుగు వారి మీద సానుకూల ప్రభావం ఉంటుంది. ఇది అదృష్టం తెస్తుంది మరియు మీరు జీవితంలో సంతోషంగా, ఆరోగ్యకరముగా మరియు సంపన్నంగా ఉంటారు.

 శాఖలుగా ఉండే రేఖలు

శాఖలుగా ఉండే రేఖలు

త్రిశూలాలు

లైన్ పై త్రిశూలం గుర్తు ఉంటే అదృష్టం కలుగుతుంది. అంతేకాక మంచి లక్షణాలను పెంచుతుంది.

పొరుగు వారి మీద సానుకూల ప్రభావం ఉంటుంది. ఇది అదృష్టం తెస్తుంది మరియు మీరు జీవితంలో సంతోషంగా, ఆరోగ్యకరముగా మరియు సంపన్నంగా ఉంటారు.

శాఖలుగా ఉండే రేఖలు

ఇవి ఊర్ధ్వ దిశలో ఉంటే మీరు జీవితంలో తీసుకొనే సొంత నిర్ణయాలు బ్లాక్స్ ని అధిగమించటానికి సహాయపడతాయని సూచిస్తుంది.

English summary

Meanings of Markings and Symbols in Palm

Meanings of Markings and Symbols in Palm,Markings and Symbols in a Palm are Positive or Negative interruptions and blockages in the normal flow of the palm lines, mounts and fingers.Few symbols or markings like Triangles indicate positive energy or results and symbols like crosses indicate negative results ba
Desktop Bottom Promotion