Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి! -
ఏప్రిల్ 26న గ్రహాల మార్పు: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్తలు తప్పవా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! - ఆదివారం, 26 ఏప్రిల్ 2026 -
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్‌షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై!
సూసైడ్ (ఆత్మహత్యలు) చేసుకోవడానికి ..కామన్ రీజన్స్..!!
మనిషి తన జీవితాన్ని అంతం చేసుకోవాలనే విపరీతమైన ప్రవర్తన కలిగి ఉండటాన్ని వైద్యపరిభాషలో పారాసూసైడ్ అంటారు. సాధారణ పరిభాషలో సూసైడల్ టెండెన్సీ అని వ్యవహరిస్తాము. మనిషి తన జీవితాన్ని అంతం చేసుకుంటే దానిని ఆత్మహత్య లేదా సూసైడ్ అంటాము.ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన, దానికోసం చేసే ప్రయత్నాలు ఈ రెండూ కూడా మానసిక వ్యాధులు.
ఈ మద్యకాలంలో ఆత్మహత్యలనేవి చాలా సాధారణమైపోయాయి. రోజురోజుకు ఆత్మ హత్యలు చేసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిపోతున్నది. ఆత్మహాత్యలు చేసుకోవడానికి వివిధ రకాల కారణాలున్నాయి.మనిషి నిస్సహాయుడు కావడం, భవిష్యత్తుపై ఆశ సన్నగిల్లడం, మానసిక వత్తిడి, తనకు లభించే మార్గాలను సరిగ్గా ఎంచుకోలేకపోవడం మొదలైన కారణాలు మనిషిని ఆత్మహత్యకు పురికొల్పుతాయి. కారణాలు ఏమైనా ఒక వ్యక్తి మైండ్ లో ఆత్య హత్య గురించి ఆలోచించడం మంచిది కాదు. మనస్సులో ఇలాంటి ఆలోచనలు రాకుండా వాటిని నాశనం చేయాలి. లేదా చికిత్స తీసుకోవాలి.
వ్యక్తులు ఆత్యహత్యలు చేసుకోవడానికి వివిధ రకాల కారణాలున్నాయి. ముఖ్యంగా ఆత్య హత్యకు పాల్పడే వారు మొదట వారి మనస్సులో వారు బ్రతికుండటం అవసరం, వారి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదనేది వారి మనస్సులు గట్టిగా నిర్ణయించుకుంటారు. వారు తప్ప మిగిలినవారంతా సంతోషంగా ఉన్నారనుకుంటారు లేదా వారు ఎక్కువ రోజులు సంతోషంగా గడపడలేమని తెలుసుకున్నాక..ఆత్మహత్య చేసుకోవడానికి ఎన్నో కారణాలను చూపుతారు. అయితే సహజంగా ఎలాంటి విషయాల్లో ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతారో తెలుసుకుందాం...

ఉద్యోగం లేదని:
బాగా చదివిన వారైనా...లేదా ఏమి చదవని వారైనా సరే సరైన ఉద్యోగం లేదనే చింతతో ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. వారు జీవితంలో సంతోషంగా గడపలేరు. ఇలాంటి వారు ఆర్థిక పరంగా ఇంట్లో వారు లేదా స్నేహితుల మీద ఆధారపడుతన్నామన్న విషయం గ్రహించాక ఖచ్చితంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

రిలేషన్ షిప్ లో సమస్యలు:
ఆత్మ హత్య చేసుకోవడానికి మరో సాధారణ కారణం, ఒంటరిగా జీవించేటప్పుడు, పార్ట్నర్ మోసం చేస్తుందన్న విషయం తెలుసుకున్న తర్వాత, వారి పాట్నర్ ను ఎక్కువగా ప్రేమిస్తుంటే కనుక, ఈ విషయం భరించలేని వ్యక్తులు ఆత్మహత్యకు కమిట్ అవుతుంటారు. పార్ట్నర్ చీటింగ్ చేసిననప్పుడు, ఈ ప్రపంచంలో తనకుంటూ ఎవరూ లేరని ఆలోచిస్తాడు, అంటే అతని జీవితంలో ఏదో తప్ప జరుగుతున్నదిని ఊహించుకుంటారు. దాంతో ఆమె/అతడు సూసైడ్ కు కమిట్ అవుతారు.

సాంఘిక సమస్యలు :
మరో అత్యంత సహజమైన కారణం. ఒక వ్యక్తిని మోసం చేయడం అనేది చాలా ఘోరం. సంఘంలో మోసగించి బ్రతకడం అనేది పెద్ద క్రైమ్ గా భావిస్తారు . వ్యక్తిగతంగా తమగురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తులు, ఇతరులతో పోల్చుకోవడం, సంఘంలో వీరికంటే మరెవరూ ఎక్కువ కాదని ఆలోచిస్తారు . సాంఘిక సమస్యలలో ప్రధానమైనవి జాతి వివక్ష, అణచివేతకు గురి కావడం ఆర్థిక కారణాల్లో ప్రధానమైనవి తమ స్థాయికి మించిన అప్పులు చేయడం, కనీసావసరాలకు కూడా డబ్బు సరిపోకపోవడం మానసిక కారణాల్లో ప్రధానమైనవి పరీక్షలు, ఎన్నికలు మొదలైన వాటిలో ఓటమి చవి చూడటం, వ్యాపారంలో నష్టపోవడం, ఆత్మీయులు మృతి చెందటం, భరించలేని స్థాయిలో అవమానాలకు గురి కావడం మానసిక వ్యాధులకు సంబంధించి డిప్రెషన్, స్కిజోఫ్రీనియా, వ్యక్తిత్వ లోపాలు, మద్యపానం మొదలైనవి ముఖ్య కారణాలు.

గతంలో జరిగి విషయాలను తలచుకుని :
కొన్ని సందర్భాల్లో గతం జరిగిన విషయాలను అంత సులభంగా మర్చిపోలేరు. ప్రెజెంట్ లైఫ్ లో వారున్నా, గతంలోని విషయాలను ఎక్కువగా గుర్తించుకోవడం వల్ల మానసికంగా ఎక్కువగా దెబ్బతింటారు . ఇటువంటి పరిస్థితిలో ఉన్నవారిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఇటువంటి మనస్థత్వం ఉన్నవారు వారంత వారు ప్రమాదాలను కొనితెచ్చుకుంటారు. ఆత్మహత్య చేసుకోవడానికి బహుశా ఇది ఒక బలమైన కారణం కావచ్చు.

మానసిక సమస్యలు :
డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిలో 15 నుంచి 20 శాతం వరకూ ఆత్మహత్యలకు పాల్పడుతారు. స్కిజోఫ్రీనియా వ్యాధితో బాధపడేవారిలో 10 శాతం మంది ఆత్మహత్యలకు పాల్పడుతారు. డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిలో ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తున్న సూచనలు ముందుగానే కనిపిస్తాయి. వారు చుట్టూ ఏం జరుగుతున్నా ఎక్కువగా పట్టించుకోరు. వారికేమీ తెలియదన్నట్లుగానే ప్రవర్థిస్తారు.

మత్తు మందులకు బానిసలవ్వడం:
మత్తు మందులకు అలవాటు పడటం వల్ల వారిని బానిసలుగా మార్చేస్తుంది. టైమ్ కు అవి లేకపోతే వారి బ్రతకడం వేస్ట్ అన్నంత లోతుగా వారి ముంచేస్తాయి, డిప్రెషన్ లోకి నెట్టేస్తాయి. డ్రగ్స్ లేకుండా వారు ఒక క్షణం కూడా గడపలేమన్నంగా జీవితం మీద ఆశ వదిలేస్తారు. జీవితం ముగిసిపోయిందని అనుకుంటారు . ఇటువంటి పరిస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతారు.

విపరీతమైన భయం
ఆత్యహత్యలు చేసుకోవడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. అయితే కొన్ని బలహీనమైన కారణాలు కూడా ఉన్నాయి. వాటిలో భయం ఒకటి. ప్రతి చిన్న విషయానికి భయపడుతుంటారు. భయం అనేది మనషిని సంగం చంపేస్తుంది. అనవసరమైన విషయాలన్నింటికి భయపడటం వల్ల వారు ప్రేమించిన వారిని కోల్పోతున్నామన్న దిగులు వారిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. జీవితంలో వారికిష్టమైనవి ప్రాణాలు కానీ, వస్తువులు కానీ, కోల్పోయినప్పుడు, ఇక వారికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వెంటాడుతాయి.

ఫ్రస్టేషన్ :
ఆత్మహత్య చేసుకోవడానికి రో సాధారణ కారణం, ఏదో ఒక విషయంలో ఎక్కువగా ఫ్రష్టేషన్ కు గురి కావడం. ఉద్యోగం, జీవితం, ప్రేమ, తల్లిదండ్రులు లేదా ఇతర కొన్ని విషయాల్లో బలహీనపడటం వల్ల ఫ్రష్టేషన్ కు గురి అవుతారు . ఈ కారణంగా ఆత్మహత్య ఒకటి మార్గం అని ఆలోచిస్తుంటారు.

నమ్మకం కోల్పోవడం :
జీవితంలో నమ్మకం అనేది అత్యంత విలువైనది. నమ్మిన వ్యక్తులు మోసం చేసినా..లేదా వారు ఇతరుల మీద నమ్మకం కోల్పోయినా జీవితం ఇక అంతటితో ముగిసిపోయిందని నిర్ణయం తీసుకుంటారు

డిప్రెషన్ :
మోస్ట్ కామన్ రీజన్ డిప్రెషన్, ఈ మద్యకాలంలో డిప్రెషన్ లో ఉండి ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది. ఏవిషయంలో అయినా సరే డిఫ్రెషన్ కు గురైనప్పుడు వెంటనే డిప్రెషన్ లో నుండి బయటకు రావడానికి కొన్ని ప్రయత్యాలు చేయాలి.లేదంటే ఆత్మహత్య వైపు అడులేపిస్తుంది..

చిన్నపాటి చిట్కాలు :
చిన్నపాటి విషయాలకే విలువైన జీవితాన్ని బలితీసుకోకుండా ఒక్క క్షణము ఆలోచించండి ..,

చిన్నపాటి చిట్కాలు :
ఇలాంటి ప్రమాదాలు చాలావరకు క్షణికావేశములోనే జరుగుతుంటాయి అందుకే ముందుగా ఆవేశాన్ని నిగ్రహించుకోవాలి .

చిన్నపాటి చిట్కాలు :
కొద్దిసేపు మౌనము గా ఉండడం మంచిది

చిన్నపాటి చిట్కాలు :
కొన్ని నిముషాలపాటు అంకెలు లెక్కపెట్టడము.

చిన్నపాటి చిట్కాలు :
కడుపునిండా చల్లటి నీరు త్రాగడం ,

చిన్నపాటి చిట్కాలు :
ఒంటరిగా ఉండ కుండా మీసమస్యను స్నేహితులతోను , తోబుట్టువులతోను , మీకు నచ్చిన వారితో పంచుకోవడం .

చిన్నపాటి చిట్కాలు :
తల్లిదండ్రులు కూడా వారి పిల్లల చేసే అకతాయి పనులకు పదే పదే .. అదేపనిగా మంలించడము , పదుగురి మధ్య ఆ విషయాలు చెప్పి అవమానించడం చేయకూడదు .

చిన్నపాటి చిట్కాలు :
పిల్లలు పూర్తిగా టివి లకో , వీడియో గేములకో పరిమితమై ముభావము గా ఉంటే వారిని కాస్తా కుటుంబ వ్యవహారాల్లో బాధ్యులను చేయండి .

చిన్నపాటి చిట్కాలు :
పరధ్యానము గా ఉండడము , భోజము పై ఆసక్తి చూపకపోవడం లాంటివి చేస్తుంటే వారిపట్ల జాగ్రత్తలు తీసుకొని సామాజిక పనులలో నిమగ్నమయినట్లు చేయంది .



Click it and Unblock the Notifications