Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రపంచంలో అత్యంత ఖరీదైన మరియు విసుగు కలిగించే విషయాలు
ప్రపంచం అంతా క్రేజీ వ్యక్తులతో నిండి ఉంది. అంతేకాక ఈ క్రేజీ ప్రపంచంలో మనం అనేక అవివేకమైన మరియు అజ్ఞానమైన విషయాలను చూడవచ్చును.
కొన్ని సార్లు ఆ విషయాలు ఖరీదైనవిగా ఉండవచ్చు. లేక ఖరీదు లేకుండా కూడా ఉండవచ్చు. అలాగే కొన్ని విషయాలు వ్యర్ధంగా ఉంటాయి.
పైన చెప్పిన మాటలను బట్టి అయోమయంలోకి వెళ్ళకండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ఖరీదైన విషయాల గురించి తెలుసుకుందాం.
ఈ విషయాలలో కొన్ని విసుగుగాను మరియు ఖరీదుగాను ఉంటాయి. ఈ వ్యాసాన్ని చదివాక మీకు ఖచ్చితంగా చిరాకు కలుగుతుంది. ఈ క్రేజీ ప్రపంచంలో ఈ విషయాలను చదివితే కొన్ని దారుణంగా ఉంటాయి.
మరింత తెలుసుకోవడానికి కింద వాటిని చదవండి ....

స్కార్లెట్ జాన్సన్ వాడిన టిష్యూ
అవును, మీరు చదవింది నిజమే!. ఆమె ఉపయోగించిన టిష్యూ ను అత్యధిక మొత్తంలో అమ్మబడినది.ఆ టిష్యూ $ 5300 కు అమ్మబడినది. ఒక వెర్రి అభిమాని ఆమె ఉపయోగించిన టిష్యూ ని కొన్నాడు. ఆ డబ్బు ను దాతృత్వం కోసం ఉపయోగించినా అది ఇప్పటికి మాకు ఆశ్చర్యాని కలిగిస్తుంది. ఎందుకంటే ఎవరైనా తాము ఉపయోగించిన టిష్యూ ని అమ్ముతారా !!

పక్షి గూడు సూప్
మీరు గూడు అనగానే ఒక పక్షి యొక్క నివాసమని అనుకోకండి. ఈ సూప్ ఒక పక్షి యొక్క గట్టిపడిన లాలాజలం తో తయారవుతుంది. ఈ సూప్ ఒక్కొక్క కప్పు $40-$60 లకు దొరుకుతుంది. ఇది చైనా లో చాలా ప్రసిద్ది చెందిన వంటకం. అలాగే ఈ సూప్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

తిమింగలం వాంతి
ఇంతకు ముందు చదివినది ఏవగించుకుంటే మాత్రం ఇది మీకు నచ్చుతుంది. తిమింగలం వాంతిని అమ్బెర్గ్రిస్ అని కూడా పిలుస్తారు. దీనిని ఒక జంట $ 70,000 లకు సొంతం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా విసుగు చెందే విషయాలలో ఇది ఒకటి. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే దీనిని సెంట్ ల తయారీలో ఉపయోగిస్తారు.

మానవ మలం
ఇది నిజంగా చాలా క్రేజీ విషయం. కానీ ఇది చాలా సీరియస్ వ్యాపారం. కొన్ని వ్యాధులను నయం చేయటానికి ఉపయోగిస్తారు. నిజంగా ఆరోగ్యకరమైన వ్యక్తి నుండి మానవ మలం ఆస్పత్రులకు అమ్మబడుతుంది. మీరు సంవత్సరానికి $ 13,000 వరకు పొందవచ్చు.

పిశాచాల ఫేస్ లిఫ్ట్
ప్రముఖ సెలబ్రేటి కిమ్ కర్దాశియాన్ ఈ ప్రక్రియను చేయించుకొని ఫోటో పోస్ట్ చేయటంతో ఈ క్రేజీ ఫేస్లిఫ్ట్ కి ప్రజాదరణ వచ్చింది. దీని కోసం $ 950 నుండి $ 1,400 వరకు ఎంతైనా ఖర్చు చేయవచ్చు. ఈ ఫేస్లిఫ్ట్ ప్రక్రియలో ఒక వ్యక్తి యొక్క చేతి నుంచి రక్తంను తీసి ఉపయోగించటం జరుగుతుంది. అంతేకాక ప్లేట్లెట్లను సెంట్రిఫ్యూజ్ చేసి వేరు చేస్తారు. ఇది దీర్ఘ కాలంగా జరిగే ప్రక్రియ.

ఏనుగు పేడ బీర్
ఏనుగు పేడ నుండి బీర్ తయారుచేయాలనే ఆలోచన వచ్చిన వ్యక్తికీ హ్యాట్సాఫ్ చెప్పవచ్చు. ఈ క్రేజీ ఆలోచన చాలా మందికి నచ్చింది. ఇది ఒక సీసా $ 100 వరకు ఉంటుంది.

పక్షి రెట్ట ఫేషియల్
ఇది బ్యూటీ ఇండస్ట్రీలో చాలా ప్రాచుర్యం పొందింది. అలాగే ఒక సెషన్ కి దాదాపుగా $ 180 ఖర్చు అవుతుంది. ఈ క్రేజీ ఆవిష్కరణ చేసిన వారికి సరైన మోతాదులో పక్షి రెట్ట పడి ఉండవచ్చు.

కోపి లువాక్ కాఫీ
ఇండోనేషియన్ పునుగు పిల్లుల నుండి తీసిన రెట్టను ఒక కప్పు చొప్పున $ 90 విక్రయిస్తుంటారు! పిల్లులు కాఫీ బీన్స్ తింటే అది జీర్ణం అయ్యి, అది వేసే రెట్ట కాఫీ వాసన వస్తుందని నమ్మకం.



Click it and Unblock the Notifications