Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రాశిని బట్టి ఎదుటివాళ్ల నిజాయితీని అంచనా వేయవచ్చు..! అదెలా ??
ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడంలో ఆస్ట్రాలజీ కీలకపాత్ర పోషిస్తుంది. జీవితంలో వాళ్లు ఎలా సక్సెస్ అవుతారు, ఎప్పుడు సక్సెస్ అవుతారు, వాళ్లు లైఫ్ ఎలాంటి ఉంటుంది అనే రకరకాల విషయాలను అంచనా వేయవచ్చు. అలాగే వ్యక్తి స్వభావాన్ని రాశులు చాలా పక్కాగా వివరిస్తాయి.
అయితే చాలామంది ఆస్ట్రాలజీని నమ్మరు. వాళ్ల పర్సనాలిటీకి రాశికి ఎలాంటి సంబంధం లేదని భావిస్తారు. అయితే.. ఇది చాలా వరకు ప్రభావం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతారు. వ్యక్తిత్వంపై చాలా ప్రభావం చూపుతాయని అంటారు. కొన్ని సందర్భాల్లో మన రాశుల ప్రకారం మనకు జరిగే విషయాలను గమనిస్తే.. ఇది అర్థమవుతుంది.
అయితే మనం గతంలో ఒక వ్యక్తి నిజాయితీని, నమ్మకాన్ని వివరించాం. అయితే ఇవాళ ఏ రాశి వాళ్లను నమ్మడానికి వీలులేదా, మోసం చేసే గుణాలను కలిగి ఉంటారనేది తెలుసుకుందాం. అలాగే వాళ్ల ఆలోచనలు, అభిప్రాయాలు, అనుభవాలు ఎలా ఉంటాయనేది అంచనావేద్దాం.. మరి.. నిజాయితీ లేని రాశులు ఏంటో తెలుసుకుందామా

మేషరాశి
మేషరాశి వాళ్లు చాలా లేజీగా, నిర్లక్ష్యంగా ఉంటారు. అపద్దాలు చెప్పే స్వభావం కలిగి ఉంటారు. చాలా విషయాల్లో అంటే సిల్లీగానే కాదు.. సీరియస్ విషయాల్లోనూ అపద్దాలు చెప్పే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మేషరాశివాళ్లను నమ్మకం కాస్త కష్టంగా ఉంటుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వాళ్ల లాంటి వ్యక్తులను మీరు గతంలో ఎప్పుడూ కలిసి ఉండరు. వాళ్లను వాళ్లు కంట్రోల్ చేసుకోవడానికి ఇష్టపడరు. చాలా పవర్ ఫుల్ గా ఫీలవుతారు. స్థిరత్వం సంపాదించడానికి ప్రయత్నిస్తారు. వీటన్నింటినీ సంపాదించడానికి ఎక్కువగా అపద్ధాలు చెబుతారు. దీనివల్ల ఎదుటివాళ్లు అయోమయానికి గురవుతారు.

మిధున రాశి
పర్సనాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీళ్లు రెండురకాలుగా ప్రవర్తించే గుణం కలిగి ఉంటారు. దీనివల్ల వీళ్లు చాలా ఎక్కువగా పదే పదే అపద్దాలు చెబుతూ ఉంటారు. ఇతరులతో పోల్చితే వీళ్లు ఎక్కువగా అపద్దాలు చెబుతూ ఉంటారు.

ధనస్సు రాశి
ధనస్సు రాశి వాళ్లు చాలా జాలీగా ఉంటారు. చాలా స్పాంటేనియస్ గా వ్యవహరిస్తారు. ప్రతిసారీ అపద్దాలను జోడిస్తారు. కానీ వీళ్లు కంపల్సరీ అపద్దాలు చెప్పేవాళ్లు అని కాదు. వాళ్లు అపద్దం చెప్పగానే ఆ ఫీలింగ్ ఫేస్ లో కనిపిస్తుంది.

సింహరాశి
సింహరాశి వాళ్లు చాలా పట్టుదల కలిగి ఉంటారు. ఏపనిచేయడానికైనా వెనకాడరు. భయపడరు. చాలా పోటీతత్వం కలిగి ఉంటారు. అలాగే లక్ష్యాలను సాధిస్తారు. అలాగే అపద్దాలు చెప్పడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.



Click it and Unblock the Notifications