Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఈ ప్రపంచంలోనే అత్యంత నొప్పి పుట్టించే కాట్లు
ఈ భూమి మీద ఉన్న జంతువులలో కొన్ని విషపూరితమైనవి. వాటికి తమ విషాన్ని ఎక్కించే సామర్ధ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ విషపూరితమైన జంతువులపై అవగాహన ఉండాలి. అవి మనపై దాడి చేసినప్పుడు ఎలాటి హాని కలిగిస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
విషాదం ఎప్పుడు తలుపు తడుతుందో మనకు తెలియదు. అది ఎక్కడైన ఎప్పుడైనా జరగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు వీటి గురించి తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అందుకే ఇక్కడ కొన్ని విషపూరితమైన, అత్యంత నొప్పి కలిగించే కాట్లను వివరిస్తున్నాం.
కొన్ని రకాల కాటుల కారణంగా ఒక వ్యక్తీని పక్షవాతానికి గురిచేయవచ్చు అలాగే కొన్ని సందర్భాలో వ్యక్తికి పూర్తిగా ప్రభావితమైన భాగాన్ని తొలగించవలసి ఉంటుంది. ఇప్పుడు ప్రమాదకరమైన జంతువుల గురించి అలాగే వాటి కాటుల గురించి తెలుసుకుందాం.

బ్రెజిలియన్ వండెరింగ్ స్పైడర్
ఈ సాలెపురుగులు అరటి ఆకుల మీద కన్పిస్తాయి. అందువలన వీటిని అరటి సాలెపురుగులు అని పిలుస్తారు. ఈ సాలెపురుగులు మానవుల మీద ఎక్కువ విష ప్రభావాన్ని చూపి ప్రాణ నష్టానికి కారణం అవుతాయి.
Image Courtesy

కాన్దిరు ఫిష్
ఈ చేప జననేంద్రియాల ద్వారా మానవ శరీరం లోపలకి ప్రవేశించి మానవ రక్తకణాలపై దాడి చేస్తుంది. ఒక చేప మానవులపై దాడి చేసి ప్రాణ నష్టం కలిగించే మార్గాలలో ఇది ఒకటి. ఈ చేపను శస్త్రచికిత్స లేకుండా తొలగించటం చాలా కష్టం.
Image Courtesy

అరిజోనా బార్క్ స్కార్పియన్
ఇవి ఉత్తర అమెరికాలో కనిపించే అత్యంత విషపూరితమైనవి. దీని విషం కారణంగా తీవ్రమైన నొప్పి,కండరాలు, నోరు వంకర పోవటం జరుగుతుంది.
Image Courtesy

రక్తపింజరి
రక్తపింజరి కాటు చాలా భాదాకరమైన కాటుగా ప్రసిద్ది చెందింది. ఈ కాటు కారణంగా మనిషి చాలా తక్కువ వ్యవదిలోనే చనిపోతాడు.
Image Courtesy

స్టోన్ ఫిష్
ఇవి ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చేపలు. ఈ చేప కుట్టిన ప్రదేశంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. కాబట్టి బీచ్ లో వాకింగ్ చేసే సమయంలో తప్పనిసరిగా చూసుకోవాలి.
Image Courtesy

బ్లాక్ విడో
ఇది అత్యంత క్రూరమైన సాలెపురుగులలో ఒకటి. సాధారణంగా ఈ సాలీడు కాటు నిరపాయమైనది. అయినప్పటికీ, స్పైడర్ పరిమాణంలో పెద్దదిగా ఉంటే మాత్రం అది మీ దురదృష్టం కావచ్చు. ఈ స్పైడర్ కుట్టినప్పుడు చాలా నొప్పితోపాటు కండరాల సంకోచానికి కారణం అవుతుంది.
Image Courtesy

స్వెట్ బీ
ఇవి సాదారణంగా ముదురు రంగు లేదా మెటాలిక్ రంగులో ఉండే పెద్ద తేనెటీగలు. ఇవి ప్రపంచంలో అతి సాధారణ తేనెటీగలులో ఒకటి. ఈ తేనెటీగ కుట్టినప్పుడు చర్మంపై వాటిని తొలగించటం చాలా కష్టం.
Image Courtesy

బుల్ హార్న్ అకేసియా చీమ
ఈ చీమలు చాలా తీవ్రంగా ఉండి సాదారణ కీటకాల మీద దాడి చేస్తాయి. ఇవి మనుషులను కుట్టినప్పుడు చాలా క్లిష్టమైన సమయం అని చెప్పవచ్చు.
Image Courtesy

సాదారణ తేనెటీగలు
సాదారణ తేనెటీగలు కుడితే మనుషులకు ప్రమాదమని తెలుసా? ఒక తేనెటీగ కుడితే తట్టుకోవచ్చు. అదే ఎక్కువ తేనెటీగలు కుడితే గుండె మీద ప్రభావాన్ని చూపి మరణానికి కారణం కావచ్చు.
Image Courtesy

అమెజాన్ గెయింట్ జెర్రి
ఈ మాంసాహార జెర్రిలు చాలా పొడవుగా పెరుగుతాయి. వీటి శక్తివంతమైన కాటు కారణంగా ఎలుకలు, గబ్బిలాల వంటి జంతువులు చనిపోతాయి. ఎప్పుడైనా ఈ జెర్రి కుడితే ఆ నొప్పి 12 గంటల వరకు ఉంటుంది.
Image Courtesy



Click it and Unblock the Notifications