For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుభాష్ చంద్రబోస్ చనిపోయారా ? చంపేశారా ? ఏం జరింగింది ?

By Swathi
|

భారతదేశంలో అనేక మంది గొప్ప వ్యక్తులు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. అందులో చాలా మంది జీవితాన్ని కోల్పోయారు. కొందరు చనిపోయే ముందు కూడా అనేక రకాల త్యాగాలు చేశారు. అలాంటి గ్రేట్ ఫ్రీడం ఫైటర్స్ లో సుభాష్ చంద్రబోస్ ఒకరు. అయితే.. సుభాస్ చంద్రబోస్ అదృశ్యం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

వావ్: మరణం తర్వాత మనకు లైఫ్ ఉంటుందా ?వావ్: మరణం తర్వాత మనకు లైఫ్ ఉంటుందా ?

అసలు సుభాష్ చంద్రబోస్ ఎలా చనిపోయారు ? ఆయన అదృశ్యం వెనక రహస్యం ఏంటి అనేది ఎవరీ అంతుపట్టలేదు. సుభాష్ నిజంగానే ప్లేన్ క్రాష్ లో చనిపోయారా ? లేదా మరేదైనా జరిగిందా ? ఇలాంటి సందేహాలకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం..

నేతాజీ మరణంపై మిస్టరీ

నేతాజీ మరణంపై మిస్టరీ

సుభాష్ చంద్రబోస్ నేతాజీగా ప్రత్యేక గుర్తింపు ఉంది. బ్రిటీషుల నుంచి స్వాతంత్ర్యం పొందడానికి పాటుపడిన వాళ్లలో నేతాజీ ఒకరు. ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించిన మహావ్యక్తి సుభాష్ చంద్రబోస్. నేతాజీ జపాన్ కి చెందిన వాళ్లు బాంబ్ పెట్టడంతో ఆగస్ట్ 18, 1945లో సింగపూర్ నుంచి రష్యా వెళ్తుండగా జెట్ క్రాష్ లో చనిపోయారు. దానికి ముందు సుభాష్ చంద్రబోస్ థార్డ్ డిగ్రీకి గురయినట్లు వివరాలున్నాయి.

నేతాజీ మరణంపై మిస్టరీ

నేతాజీ మరణంపై మిస్టరీ

జపాన్ లోని రెంకోజి ఆలయంలో.. నేతాజీ అస్తికలు పెట్టారు. అయితే ఇతని మరణం గురించి చెబుతున్న విషయాలు వాస్తవం కాదని.. దీనికి మరో కారణం ఏదో ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నేతాజీ మరణంపై మిస్టరీ

నేతాజీ మరణంపై మిస్టరీ

బోస్ పై స్వామి వివేకానంద పాఠాలు చాలా ప్రభావం చూపాయి. తన తల్లిదండ్రుల కోరిక ప్రకారం నేతాజీ 1919లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ పూర్తిచేయడానికి ఇంగ్లాండ్ కి వెళ్లారు. 1920లో ఇంగ్లాండ్ లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ పూర్తిచేశారు. మెరిట్ లో పాస్ అయ్యారు. అయితే జలియన్ వాలాబాగ్ ఉద్యమంపై బోస్ చాలా డిస్ట్రబ్ అయ్యారు. దాంతో తన చదువుని మధ్యలోనే వదిలేసి 1921లో ఇండియాకి వచ్చేశారు.

నేతాజీ మరణంపై మిస్టరీ

నేతాజీ మరణంపై మిస్టరీ

ఇండియాకి వచ్చాక మహాత్మాగాంధీకి ప్రభావం అయి.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరారు. దేశబంధు చిత్తరంజన్ దాస్ కింద పనిచేయడం మొదలుపెట్టారు. తన లీడర్ షిప్ క్వాలిటీస్ తో కాంగ్రెస్ డెవలప్ మెంట్ కి పాటుపడ్డారు. 1928లో పూర్తీ స్వాతంత్ర్యం కోసం పోరాడతానని వివరించారు.

నేతాజీ మరణంపై మిస్టరీ

నేతాజీ మరణంపై మిస్టరీ

ఆ తర్వాత పార్మేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ లీగ్ ని ప్రకటించారు. 1930లో శాసన ఉల్లంఘనోద్యమం సమయంలో జైల్ కి వెళ్లారు నేతాజీ. తర్వాత గాంధీజీ ఐర్విన్ ఒప్పందంపై సంతకం చేయడంతో 1931లో విడుదలయ్యారు. దీన్ని నేతాజీ వ్యతిరేకించారు. అలాగే శాలసనోల్లంఘన ఉద్యమాన్ని సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకించారు. ముఖ్యంగా భగత్ సింగ్ తో పాటు ఇతరులను ఉరితీయడంతో.. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు బోస్.

నేతాజీ మరణంపై మిస్టరీ

నేతాజీ మరణంపై మిస్టరీ

ఫార్మేషన్ ఆఫ్ బెంగాల్ రెగ్యులేషన్ కింద సుభాష్ చంద్రబోస్ మళ్లీ అరెస్ట్ అయ్యారు. ఏడాది తర్వాత విడుదల చేసి.. ఇండియా నుంచి బహిష్కరించి యూరప్ కి పంపారు. యూరోపిన్ క్యాపిటల్స్ లో ఇండియా, యూరప్ మధ్య పొలిటికల్ కాంటాక్స్ ప్రోత్సహించడానికి కేంద్రాలను ఏర్పాటు చేశారు నేతాజీ. ఇండియా నుంచి చంద్రబోస్ ని బహిష్కరించడం సరికాదని.. వాదించడంతో.. మళ్లీ ఇండియాకి వచ్చారు. కానీ మళ్లీ ఏడాది జైల్లో గడిపారు.

నేతాజీ మరణంపై మిస్టరీ

నేతాజీ మరణంపై మిస్టరీ

1937 సాధారణ ఎన్నికల తర్వాత సుభాష్ చంద్రబోస్ విడుదలయ్యారు. తర్వాత హరిపురా కాంగ్రెస్ కి 1938లో ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం కోసం ఇండియాలోని వనరులను, మనుషులను ఉపయోగించుకుని.. సిద్ధమయ్యారు. ఈ పిలుపుకి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కానీ.. కలకత్తాలో హౌస్ అరెస్ట్ అయ్యారు. 1941 జనవరిలో చంద్రబోస్ కలకత్తాలోని తన నివాసం నుంచి అదృశ్యమై.. ఆఫ్గనిస్తాన్ మీదుగా జర్మనీకి వెళ్లారు. బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జర్మనీ, జపాన్ సహకరించాలని కోరారు.

నేతాజీ మరణంపై మిస్టరీ

నేతాజీ మరణంపై మిస్టరీ

1943 జూలై లో జర్మనీ నుంచి సింగపూర్ కి చేరుకున్నారు నేతాజీ. సింగపూర్ లో ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు. కానీ ఇండియన్ నేషనల్ ఆర్మీ ( ఆజాద్ హిందూ పూజ్ ) సక్సెస్ కాలేదు. లక్ష్యాలను చేరుకోలేకపోయింది. అదే సమయంలో 1945 ఆగస్ట్ 18న తైవాన్ ఎయిర్ క్రాష్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని చంపేశారని ప్రకటన వెలువడింది.

నేతాజీ మరణంపై మిస్టరీ

నేతాజీ మరణంపై మిస్టరీ

నేతాజీ మరణం వెనక మిస్టరీ కనుక్కోవడానికి జర్నలిస్ట్ అనూజ్ ధర్ ఇండియాస్ బిగ్గెస్ట్ కవర్ అప్ బుక్ తీసుకొచ్చారు. అలాగే నేతాజీ మరణంపై బ్రిటీష్ కూడా 7 నెలలపాటు దర్యాప్తు నిర్వహించింది. చివరికి నేతాజీ రష్యాలో ఉన్నట్లు ప్రకటించింది.

నేతాజీ మరణంపై మిస్టరీ

నేతాజీ మరణంపై మిస్టరీ

నేతాజీ మరణంపై మూడు కోణాలు వెలుగులోకి వచ్చాయి. తైవాన్ కి సంబంధించిన ఎయిర్ క్రాష్ లో చంపేశారని ఒక కథనం ఉంది. ఆగస్ట్ 1945 తర్వాత నేతాజీ రష్యాలో ఉన్నాడని చెప్పడం వల్ల అతను చనిపోలేదని మరో కథనం ఉంది. సుభాష్ చంద్రబోస్ మారువేశంలో ఇండియాలోనే ఉన్నారని మరో కథనం చెప్పుకొచ్చింది.

నేతాజీ మరణంపై మిస్టరీ

నేతాజీ మరణంపై మిస్టరీ

ఈ కథనాలపై జర్నలిస్ట్ అనుజ్ ధర్ కొన్ని కంక్లూజన్స్ ను పుస్తకంలో పేర్కొన్నారు. ఎయిర్ క్రాష్ లో చనిపోయినట్టు నేతాజీనే స్వయంగా జపనీస్ ఫ్రెండ్స్ తో కలిసి.. క్రియేట్ చేశాడని అనుమానాలున్నాయి. తనను ఆంగ్లో అమెరికన్స్ అరెస్ట్ చేశారని చెబితే.. యుద్ధం హింసాత్మకంగా మారుతుందని ఇలా ప్రకటించారని వివరించారు.

నేతాజీ మరణంపై మిస్టరీ

నేతాజీ మరణంపై మిస్టరీ

ఇండియాలో ఉన్నాడని చాలామంది భావించారు. మారువేశంలో నేతాజీ ఇండియాలోనే ఉన్నారని 1960లో రూమర్స్ వచ్చాయి. రష్యా కోణంలో ఇండియా గవర్నమెంట్.. కొన్ని జిమ్మిక్కులు చేసినట్లు అనుమానాలున్నాయి. బోస్ ఇండియాలోనే ఉన్నట్లు కొన్ని కారణాలు నమ్మేవిధంగా ఉన్నాయడం వాస్తవం.

నేతాజీ మరణంపై మిస్టరీ

నేతాజీ మరణంపై మిస్టరీ

నేతాజీ మరణంపై అనేక దర్యాప్తు కమిషన్లను వేశారు. ఆ తర్వాత 1946లో నేతాజీ మరణంపై ఫిగ్గీస్ రిపోర్ట్ తయారు చేశారు. ఈ రిపోర్ట్స్ ప్రకారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లో థైహోకు మిలటరీ హాస్పిటల్ లో 1700 నుంచి 2000 గంటల మధ్య (లోకల్ టైం)లో చనిపోయినట్లు వివరించారు. మరణానికి హార్ట్ ఫెయిల్యూర్ కారణమని తెలిపారు.

నేతాజీ మరణంపై మిస్టరీ

నేతాజీ మరణంపై మిస్టరీ

ఇండియన్ గవర్నమెంట్ 1970లో నేతాజీ అదృశ్యంపై ఖోష్లా కమిషన్ ని నియమించింది. అది వన్ మ్యాన్ కమిషన్. పంజాబ్ హైకోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జీడీ ఖోష్లాను ఇన్వెస్టిగేటర్ గా నియమించింది. ఇంతకుముందు వెలువడిన ఫిగ్గీస్, షా నవాజ్ కమిటీ రిపోర్ట్ ల ఆధారంగానే కాకుండా.. మరిన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహించారు.

నేతాజీ మరణంపై మిస్టరీ

నేతాజీ మరణంపై మిస్టరీ

1999లో భారత ప్రభుత్వం మాజీ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఎమ్ కే ముఖర్జీ ఆధ్వర్యంలో ముఖర్జీ కమిషన్ ని నియమించింది. నేతాజీ మరణంపై ఈ కమిషన్ దర్వాప్తు నిర్వహించింది. ఈ కమిటీ జపాన్, తైవాన్, రష్యాలు పర్యటించింది.

నేతాజీ మరణంపై మిస్టరీ

నేతాజీ మరణంపై మిస్టరీ

బోస్ కి చెందిన అస్థికలుగా ప్రకటించి రెంకోజీ ఆలయంలో ఉంచినవి.. బోస్ వి కాదని.. హార్ట్ ఫెయిల్యూర్ తో జపాన్ కి చెందిన సైనికుడివని ప్రకటించింది ఈ కమిషన్. ఈ రిపోర్ట్ ని ముఖర్జీ కమిషన్ 2005 నవంబర్ 8న సబ్ మిట్ చేసింది. దీన్ని ఇండియన్ పార్లమెంట్ లో 2006 మే 17న ప్రవేశపెట్టారు. దీన్ని భారత ప్రభుత్వం ఎలాంటి కారణం చెప్పకుండా తిరస్కరించింది.

నేతాజీ మరణంపై మిస్టరీ

నేతాజీ మరణంపై మిస్టరీ

ఈ మిస్టరీకి సంబంధించి భారత ప్రభుత్వం దగ్గర 10వేల ఫైల్స్ ఉంటే.. ముఖర్జీ కమిటీ దగ్గరకు వచ్చే సరికి అవి 993 మాత్రమే ఉన్నాయి. ఖోష్లా కమిటీ దగ్గర ఉన్న ఫైల్స్ అన్నీ ముఖర్జీ కమిటీకి చేరలేదు. 30 ఫైల్స్ ని ఖోష్లా కమిటీ కాల్చేసింది. దీనివెనక ఏదో కుట్ర ఉందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నేతాజీ మరణంపై మిస్టరీ

నేతాజీ మరణంపై మిస్టరీ

ముఖర్జీ కమిటీకి తైవాన్ ప్రభుత్వం.. ఆగస్ట్ 14 , 1945 నుంచి సెప్టెంబర్ 20 1945 వరకు ఎలాంటి క్రాష్ లు జరగలేదని ప్లేన్ క్రాష్ జరగలేదని వివరించింది. దీన్ని బట్టి ప్లేన్ క్రాష్ లో నేతాజీ చనిపోలేదని తెలుస్తోంది. భారత ప్రభుత్వం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద.. ఎలాంటి సమాచారం ఇవ్వడానికి అంగీకరించలేదు. పైగా ఫైల్స్ మిస్సవడంపై మరింత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఏదో ఒకరోజు నేతాజీ మరణంపై భారత ప్రభుత్వం సీక్రెట్ రివీల్ చేసే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.

English summary

Mystery behind Subhash Chandra Bose's disappearance

Mystery behind Subhash Chandra Bose's disappearance. It’s been 65 years since Independence, yet one of the greatest mysteries of India about freedom fighter Subhash Chandra Bose endures. Did he die in a plane crash?
Desktop Bottom Promotion