For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైన్స్‌కి కూడా అంతుచిక్క‌ని ఆశ్చ‌ర్య‌క‌ర మిస్ట‌రీలు..!!

By Swathi
|

జీవితంలో చాలా విషయాలు గ‌మ‌నిస్తూ ఉంటాం. కొన్నిసార్లు చాలా సాధార‌ణంగా ఉంటాయి. కొన్ని విష‌యాలు చాలా ఆశ్చ‌ర్యానికి గురిచేస్తాయి. అయితే ఇక్క‌డ చెప్ప‌బోతున్న కొన్ని విష‌యాల‌కు సైంటిఫిక్ రీజ‌న్స్ ఆలోచిస్తే.. చాలా స‌ర్‌ప్రైజ్ అవుతారు. ఎందుకంటే.. ఇప్ప‌టివ‌ర‌కు సైన్స్‌కి కూడా వీటి వెన‌క ఉన్న సైన్స్ అర్థం కాలేదు. స‌మాధానం లేదు.

నార్మ‌ల్ గా, రెగ్యుల‌ర్ చూసే విష‌యాలే అయినా.. సైన్స్ కూడా వాటి వెన‌క ఉన్న సీక్రెట్స్‌ని వివ‌రించ‌లేక‌పోతోంది. బెర్ముడా ట్రైయాంగిల్ నుంచి ప‌క్షులు వ‌ల‌స పోయేంత‌వ‌ర‌కు.. వాటి వెన‌క ఉన్న మిస్ట‌రీ క‌నుక్కోలేక‌పోతోంది.
చాలా విష‌యాల‌కు ఎక్స్‌ప్ల‌నేష‌న్ కావాల‌ని ఎదురుచూస్తున్నాం. మ‌రి అలాంటి ఆస‌క్తిక‌ర విష‌యాలేంటో ఇప్పుడు చూద్దాం..

ప‌క్షులు వ‌ల‌స‌పోవ‌డం

ప‌క్షులు వ‌ల‌స‌పోవ‌డం

ప‌క్షులు వ‌ల‌స‌పోవ‌డం అనేది..చాలా అయోమ‌యానికి గురిచేస్తుంది. ఒక ప్ర‌త్యేక‌మైన సీజ‌న్‌లో ప‌క్షులన్నీ గుంపులుగా ఒక ప్రాంతానికి చేరుకుంటారు. ఎలాంటి ట్రాక‌ర్, నేవిగేష‌న్ సిగ్న‌ల్స్ లేకుండా.. అవి చేరాల‌నుకున్న ప్రాంతానికి చేరిపోతాయి. ఎలా వెళ్ల‌గ‌లుగుతాయ‌నేది సైన్స్‌కి కూడా అంతుచిక్క‌డం లేదు.

ఆక్సిజ‌న్ లేకుండా జంతువుల జీవనం

ఆక్సిజ‌న్ లేకుండా జంతువుల జీవనం

మీకు తెలుసా.. కొన్ని ర‌కాల బ్యాక్టీరియా, క్రిములు జీవించ‌డానికి ఆక్సిజ‌న్ అవ‌స‌రం లేదట‌. అవి ఆక్సిజ‌న్ లేకుండా ఎలా స‌ర్వైవ్ అవుతున్నాయ‌నే దానిపై ఇంకా సైంటిస్ట్‌లు రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు.

స్వ‌భావం

స్వ‌భావం

మీకు తెలుసా.. మ‌న ఫీలింగ్స్, స్వ‌భావం ఎలా క‌లుగుతుంది. మ‌న ఆలోచ‌ల‌న్నీ ఎప్పుడూ క‌రెక్టే అని ఎలా తెలుస్తుంది. సైకాల‌జిస్ట్ ల‌కు ఈ మిస్ట‌రీ కూడా ఇంకా అర్థం కావ‌డం లేదు. దీనిపై ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది.

ద‌య్యాలు

ద‌య్యాలు

న‌మ్మేవాళ్ల మ‌ధ్య న‌మ్మ‌కం లేని మ‌ధ్య ఇది చాలా పెద్ద డిబేట్ జ‌రుగుతోంది. చాలా ఏళ్లుగా ద‌య్యాలు ఉన్నాయి లేవు అనేదానిపై వాద‌న‌లు జరుగుతూనే ఉన్నాయి. సైన్స్ ఏమో దీన్ని మాన‌సిక స్థితి అని, సాధార‌ణ మ‌నుషులేమో.. ద‌య్యాల‌ను నిజంగానే చూశామ‌ని చెబుతుంటారు.

ఏలియ‌న్

ఏలియ‌న్

ఏలియ‌న్స్ ఉన్నాయ‌ని.. ఇప్ప‌టికీ కొంత‌మంది చెబుతూ ఉంటారు. కానీ.. ఇది ఇంకా నిరూపితం కానీ మిస్ట‌రీగానే ఉంది.

మాగ్నెటిక్ పోల్స్

మాగ్నెటిక్ పోల్స్

మాగ్నెటిక్ పోల్స్ గురించి సైన్స్‌కి అంతుచిక్క‌ని మిస్ట‌రీగా మారింది. ఎందుకంటే.. వీటిని ఎంత చిన్న‌గా క‌ట్ చేసినా.. అవి నార్త్ అండ్ సౌత్ పోల్స్ లాగే క‌ట్ అవుతాయి. చాలా ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దూ.

ఆవ‌లింత‌లు

ఆవ‌లింత‌లు

అల‌స‌ట‌, బోర్ కొడుతోంది అన‌డానికి ఆవలింత‌లు ఒక సంకేతం. అయితే ఆవ‌లింత‌లు రావ‌డానికి అస‌లు కార‌ణం.. ఎవ‌రూ వివ‌రించ‌లేక‌పోతున్నారు. శ‌రీరంలో ఆక్సిజ‌న్ త‌క్కువైంద‌ని సూచించే ల‌క్ష‌ణం అని కొంత‌మంది భావిస్తారు. అయితే.. దీనికి ఎలాంటి ప్రూఫ్ లేదు.

బెర్ముడా ట్ర‌యాంగిల్ మిస్ట‌రీ

బెర్ముడా ట్ర‌యాంగిల్ మిస్ట‌రీ

చాలా విమానాలు, షిప్‌లు డెత్ ట్రాప్ ట్రయాంగిల్‌లో చిక్కుకుని మిస్ అవుతున్నాయి. చాలామంది సైంటిస్ట్‌లు అస‌లు కార‌ణం క‌నుక్కోవ‌డానికి ఇంకా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వీటిని భూమిపై మిస్టీరియ‌స్ ప్లేస్‌లు భావిస్తారు.

English summary

Normal Things That Science Cannot Explain

Normal Things That Science Cannot Explain. Every day we come across many things in life, sometimes normal and at times highly surprising.
Story first published:Friday, July 29, 2016, 12:34 [IST]
Desktop Bottom Promotion