Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
అదృష్టం పొందాలంటే బర్త్ డే రోజే చేయాల్సిన పనులు..!!
ఆరోగ్యం, అదృష్టం పొందాలంటే.. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి. అలాగే నెగటివ్ ఎనర్జీని కూడా.. ఈ టిప్స్ మీ నుంచి తొలగిస్తాయి. మీరు కోరుకునే అదృష్టం పొందాలంటే బర్త్ డే రోజే చేయాల్సినవి ఏంటో చూద్దాం..
బర్త్ డే అంటే ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. అందుకే బర్త్ డే రోజు.. ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన పనులు చేస్తారు. తమ కుటుంబ సభ్యులు కూడా.. పుట్టిన రోజు జరుపుకునే వాళ్ల కోసం ఇష్టమైన వంటకాలు, ఇష్టమైన ట్రిప్స్ ప్లాన్ చేస్తారు. ఏడాదిలోనే అత్యంత స్పెషల్ డేగా బర్త్ డేని ప్రతి ఒక్కరూ ఫీలవుతారు.

సంప్రదాయం ప్రకారం తిథిని బట్టి..బర్త్ డేని జరుపుకుంటారు. కానీ ఇటీవల అందరూ.. వెస్ట్రన్ స్టైల్ ఫాలో అవుతున్నారు. అంటే మనం పుట్టిన డేట్ ని బట్టి.. బర్త్ డేట్ ని ఫిక్స్ అయిపోయి.. ఆ రోజు జరుపుకుంటున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బర్త్ డే జరుపుకునేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
బర్త్ డే రోజు కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. మీకు ఆ దేవుడి నుంచి మంచి దీవెనలు అందుతాయి. అందరూ కోరుకునే ఆరోగ్యం, అదృష్టం పొందాలంటే.. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి. అలాగే నెగటివ్ ఎనర్జీని కూడా.. ఈ టిప్స్ మీ నుంచి తొలగిస్తాయి. మీరు కోరుకునే అదృష్టం పొందాలంటే బర్త్ డే రోజే చేయాల్సినవి ఏంటో చూద్దాం..

దీపం వెలిగించడం
బర్త్ డే రోజు ఉదయాన్నే నిద్రలేచి.. స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో గంగాజలం కలుపుకోవాలి. తర్వాత మీకు ఇష్టమైన దేవుడి ముందు దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ దూరమవుతాయి.

గుడి
అంతేకాకుండా దేవాలయంలో లేదా ఇంటికి దగ్గరలో ఉన్న ఆలయం, మసీదు, చర్చి ఎవరికి నచ్చిన దగ్గర వాళ్లు దీపం వెలిగించాలి. ఇలా దీపం వెలిగించడం వల్ల నాలెడ్జ్ పొందడంతో పాటు, ఆత్మశుద్ధి అవుతుంది.

జుట్టు కట్ చేసుకోవడం
మీ జుట్టు లేదా గోళ్లను మీ బర్త్ డే రోజు కట్ చేసుకోవడం ఏమాత్రం శుభప్రదం కాదు. ఇది మీ ఆర్థికపరిస్థితులపై దుష్ర్పభావం చూపుతుంది.

మాంసాహారం
తమ బర్త్ డే రోజున ఎట్టిపరిస్థితుల్లో జంతువులను చంపరాదు. కాబట్టి మాంసాహారం తినకపోవడం మంచిది. ఒకవేళ బర్త్ డే రోజు మాంసాహారం తింటే.. నెగటివ్ కర్మ వెంటాడుతుంది. కాబట్టి నాన్ వెజ్ కి దూరంగా ఉండండి.

వివాదాలు
బర్త్ డే రోజు వివాదాలకు దూరంగా ఉండండి. ప్రేమను పంచండి. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో ప్రేమను పంచడం ద్వారా మీరు హ్యాపీగా ఉంటారు. అదృష్టం పొందుతారు.

గంగాజలం
బర్త్ డే రోజు గంగాజలంతో స్నానం చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి.. మీరు ప్రశాంతత పొందుతారు.

అన్నదానం
బర్త్ డే రోజు అన్నదానం చేయండి లేదా పేదవాళ్ల అన్నం పెట్టడం వల్ల మీకు అదృష్టం కలుగుతుంది.

దీపం
బర్త్ డే రోజు. దేవుడి ముందు దీపం వెలిగించి.. మరుసటి రోజు ఉదయం వరకు వెలుగుతూ ఉండేలా చూడటం వల్ల.. పూర్వీకుల నుంచి ఆశీర్వాదం పొందుతారు.



Click it and Unblock the Notifications