Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మీకు సంతాన యోగాన్ని తెలిపే...అరచేతి హస్త రేఖలు..మీకు ఎంత మంది పిల్లలో చెప్పవచ్చు?
హస్తసాముద్రికా శాస్త్రం ప్రకారం మన చేతిలోనే సంతాన రేఖలు ఉంటాయి. చిటికెన వేలికి కింద, వివాహ రేఖకు పైన సంతాన రేఖలు ఉంటాయి. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం...
వివాహం జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ పిల్లల కోసం కలలు కంటారు. కొందరికి త్వరగా సంతానం కలిగితే, మరి కొందరికి ఆలస్యం అవుతుంది. అయితే మీకు ఎంతమంది సంతానమో మీ హస్త రేఖల ద్వారా తెలుసుకోవచ్చు. సంతానానికి, హస్త రేఖలకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా. అయితే హస్తసాముద్రికా శాస్త్రం ప్రకారం మన చేతిలోనే సంతాన రేఖలు ఉంటాయి. చిటికెన వేలికి కింద, వివాహ రేఖకు పైన సంతాన రేఖలు ఉంటాయి.
హస్తసాముద్రిక జ్యోతిషం ప్రకారం వీటి ద్వారా మీకు ఎంత మంది పిల్లలో చెప్పవచ్చు. సాముద్రిక శాస్త్రం ప్రకారం అరచేతిలోని చిటికెన వేలి కింద భాగంలో బుధ గ్రహం ఉంటుంది. ఈ గ్రహం మనకు పుట్టుబోయే సంతానం గురించి తెలియజేస్తుంది. సంతాన రేఖ ఎలాంటి అడ్డంకులు లేకుండా తిన్నగా ఉంటే పుట్టబోయే పిల్లల జీవితాలు ఆటంకం లేకుండా సాగిపోతాయి. అలా కాకుండా అస్తవ్యస్తంగా ఉంటే జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం...

చేతిలో బుధ గ్రహ రేఖ పొడుగ్గా ఉంటే
చేతిలో బుధ గ్రహ రేఖ పొడుగ్గా ఉంటే ఎక్కువ మంది అంటే నలుగురు కంటే ఎక్కువ మంది పుడతారు. వీరిలో బాలికల కంటే బాలురే ఎక్కువ ఉంటారట. అలాగే వీళ్లు ఉన్నత విద్యావంతులే కాకుండా సభ్యత గలవారు. ఇంద్ర గ్రహానికి చెందిన రేఖ పొడుగ్గా ఉంటే ఒక్కరు మాత్రమే పుడతారు. పుట్టే బిడ్డ సుగుణాలతోపాటు బాధ్యతయుతమైన వ్యక్తిగానూ వ్యవహరిస్తాడు.

అరచేతిలోని సంతాన రేఖ బలంగా ఉంటే
అరచేతిలోని సంతాన రేఖ బలంగా ఉంటే పిల్లల నుంచి తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమను పొందుతారు. అలాగే సంతాన రేఖల్లో ఒక్క రేఖ స్పష్టంగా కనబడితే పిల్లల్లోని ఒకరిని మీరు ప్రత్యేకంగా చూస్తారు. వారికి మరింత చేరువవుతారు.

భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి అరచేతిలో సంతాన రేఖ లేకపోయినా
భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి అరచేతిలో సంతాన రేఖ లేకపోయినా పిల్లలు ఉండరని అనుకోకూడదు. భార్య లేదా భర్త అరచేతిలో సంతాన రేఖ ఉంటే ఆడపిల్లలు పుడతారు. చేతి రేఖలు కూడా పిల్లల లక్షణాలను తెలుసుకోడానికి సహాయపడతాయి. సంతాన రేఖ విశాలంగా ఉంటే వీరికి మగ బిడ్డ పుట్టే అవకాశం ఉంది. భార్యా లేదా భర్త అరచేతిలో సంతాన రేఖలు ఎవరికి స్పష్టంగా, విశాలంగా ఉంటాయో వారికే పిల్లలు మరింత చేరవవుతారు.

అరచేతిలో రేఖలు బాగా ఇరుకుగానూ
అరచేతిలో రేఖలు బాగా ఇరుకుగానూ, ఒకదానికొకటి సమాంతరంగా సాగితే వీరికి పుట్టేబిడ్డ ఆడపిల్ల అవుతుంది.

సంతాన రేఖలు స్పష్టంగానూ
సంతాన రేఖలు స్పష్టంగానూ, బలంగానూ ఉంటే పుటే పిల్లలు బలవంతులు, సంపూర్ణ ఆరోగ్యవంతులు.

సంతాన రేఖలో ఒకటి పొడుగ్గా లేదా స్వచ్ఛంగా ఉంటే వీరి పిల్లల్లో
సంతాన రేఖలో ఒకటి పొడుగ్గా లేదా స్వచ్ఛంగా ఉంటే వీరి పిల్లల్లో ఒకరు తల్లిదండ్రులు, వారి సోదరులకు ప్రియమైనవారుగా ఉంటారు.

భర్త చేతిలో సంతాన రేఖలు
భర్త చేతిలో సంతాన రేఖలు స్పష్టంగా కనబడితే ఇలాంటి వాళ్లు గొప్ప తండ్రిగానూ, పిల్లలను అమితంగా ఇష్టపడే వ్యక్తిగానూ ఉంటారు.

అరచేతిలోని సంతాన రేఖలు వంకరగానూ
అరచేతిలోని సంతాన రేఖలు వంకరగానూ, అడ్డంకులు ఉంటే పుట్టే సంతానం బలహీనంగా ఉంటారు. అంతే కాకుండా ఎదుగుతున్న కాలంలో వైద్యపరమైన సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications