Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
బంగారంపై భరించలేనంత ఇష్టం ఉన్నవాళ్లు ఏం చేశారో తెలుసా ?!
మనుషులకు రకరకాల పిచ్చి ఉంటుంది. కొంతమందికి బైక్స్, మరికొందరికి కార్లు, టూర్లు, షికార్లు, అమ్మాయిలకైతే షాపింగ్.. ఇలా రకరకాల ఇష్టాలుంటాయి. తమకు ఇష్టమైన పనుల ద్వారా అమితమైన ఆనందం పొందుతారు. అయితే కొందరు తమకిష్టమైన దానికోసం ఏం చేయడానికైనా వెనకాడరు.
బంగారానికి సంబంధించి కొన్ని వింతైన మరియుఆసక్తికర విశేషాలు
అయితే వస్తువులు, ఆభరణాలు, వాహనాలపై మోజు ఉంటే పర్వాలేదు. కానీ.. బంగారంపై కొంతమందికి అమితమైన ఇష్టం ఉంటుంది. బంగారం ఇష్టపడేవాళ్లు చాలా మందే ఉంటారు. అలా ఇష్టపడేవాళ్లు చైన్స్, రింగ్స్, నెక్లెస్ లు.. ఇంకా స్తోమత ఉంటే.. వడ్డాణాలు, వంకీలు.. ఇలా కేజీల కొద్దీ బంగారం కొనేస్తారు. కానీ ఈ ఎల్లో మెటల్ అంటే ఎక్కడలేని ఇష్టం ఉండటం వల్ల.. ఎలాంటి వస్తువు అనే దానితో సంబంధం లేకుండా.. బంగారంతో వస్తువులు తయారు చేసుకున్నారు కొంతమంది.
పెళ్లైన స్టార్స్ పై మనసు పారేసుకున్న.. అందాల తారలు
బాత్ రూమ్ దగ్గర నుంచి ట్యాబ్లెట్స్ వరకూ.. అన్నింటినీ.. బంగారంతో తయారు చేసుకుని.. మురిసిపోతున్నారు. వాళ్లు చాలా ధనవంతులు లేదా గోల్డ్ అంటే ఇష్టం.. కారణమేదైనా.. వాళ్లు మాత్రం బంగారంతో రకరకాల వస్తువులు తయారు చేసుకుని.. అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. మరి బంగారంపై భరించలేనంత ఇష్టం ఉన్నవాళ్లు బంగారంతో తయారు చేసుకున్న క్రేజీ వస్తువులేంటో చూద్దాం..

బంగారపు శవపేటిక
దహన సంస్కారాలను రకరకాలుగా నిర్వహించడం చూస్తూ ఉంటాం. అయితే ఈసారి ఇది చాలా విభిన్నంగా మారింది. బంగారంతో తయారు చేసిన శవ పేటికలో వాళ్ల శవాన్ని పెట్టించడానికి బంగారంతో శవ పేటిక తయారు చేయించడం ఆశ్చర్యంగా ఉంది కదూ..
Image Courtesy

గోల్డెన్ స్ట్రా
కోల్డ్ కాఫీ తాగడానికి బంగరంతో స్ట్రా తయారు చేయించుకున్నాడో వ్యక్తి.
Image Courtesy

గోల్డెన్ గ్రిల్
ఇది చూశారా ? బంగారంతో తయారు చేసిన గ్రిల్ మిషిన్. దీని ఖరీదు ఎంతో తెలుసా ? 165 వేల డాలర్లు. దీని తయారీకి ఉపయోగించిన ప్రతి రాడ్, ప్రతి నట్ 24 క్యారెట్ల బంగారమే. అంతా చేత్తోనే తయారు చేశారు.
Image Courtesy

గోల్డెన్ గోల్ఫ్
బంగారంతో తయారు చేసిన ఈ గోల్ఫ్ ని చూస్తుంటే.. ఆడుకోవాలనిపిస్తుందా.. ! హ్యాపీగా దాచిపెట్టేసుకోవాలి అనిపించదూ.
Image Courtesy

స్మోకింగ్
ఈ రోలింగ్ పేపర్ ని 24 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. దీన్ని స్మోక్ చేయడానికి ఎవరి మనసు ఒప్పుకుంటుంది.
Image Courtesy

టాయిలెట్ పేపర్
టాయిలెట్ పేపర్ అంటేనే.. చిత్తు కాగితంతో సమానం. కానీ.. దాన్ని బంగారంతో చేయించుకున్న క్రేజీ ఫెలో ఎవరో అనిపిస్తోందా ? నిజమే.. దీన్ని కూడా 22 క్యారెట్ల గోల్డ్ తో చేయించుకున్నాడు.
Image Courtesy

గోల్డెన్ షూస్
హాలీవుడ్ డైరెక్టర్ యాక్టర్ మైఖేల్ జోర్డాన్ కి గిఫ్ట్ గా బంగారంతో తయారు చేసిన స్నీకర్స్ షూస్ ని ఇచ్చాడట. నటుడి ఫర్మామెన్స్ నచ్చడంతో.. ఇలా డిఫరెంట్ గిఫ్ట్ ఇచ్చాడు డైరెక్టర్.
Image Courtesy

గోల్డెన్ పిల్స్
గోల్డెన్ పిల్స్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ? అవి దేనికోసమో తెలిస్తే మరింత షాక్ అవుతారు. మలవిసర్ణ బంగారంలా మెరిసిపోవాలని ఈ గోల్డెన్ పిల్స్ తయారు చేయించుకున్నారట.
Image Courtesy



Click it and Unblock the Notifications
