Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
దీపావళి జరుపుకునేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన సేఫ్టీ టిప్స్..!
దీపావళి అంటే రంగురంగు టపాకాయల వెలుగులు, ఇల్లంతా వెలుగులు నింపే దీపాల వెలుగు, నోరూరించే పిండివంటలు, సంప్రదాయాన్నే వెల్లివిరిసే లక్ష్మీపూజలు, కుటుంబ సభ్యుల సందడి. అంతా దీపావళి సంబరాల్లో ఆనందంగా గడిపే సమయం.
దీపావళి పండుగను చాలా సందడి సందడిగా, ఉత్సాహంగా, క్రాకర్స్ సౌండ్స్ తో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం.
ఈ పండుగ చీకటిని తొలగించి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును నింపుతుంది. కానీ పండుగ సెలబ్రేషన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు.. ముఖ్యంగా పిల్లలు సేఫ్టీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
దీపావళి పండుగకు చిన్నా, పెద్దా అందరూ.. క్రాకర్స్ పేల్చడానికి ఆసక్తిచూపుతారు. అయితే ఈ పండుగలో అనుకోకుండా.. గాయాలు, దెబ్బలు తగిలే అవకాశాలుంటాయి. క్రాకర్స్ పేల్చాలని ఉత్సాహం పెరిగే కొద్దీ.. దెబ్బలు ఎక్కువ తగులుతాయి. ఇలాంటి సందర్భాలు మీకు ఎదురవకుండా మీరూ, మీ పిల్లలు, కుటుంబ సభ్యులు కొన్ని సేఫ్టీ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి.

మంచి క్వాలిటీ క్రాకర్స్
గవర్నమెంట్ సూచించే క్రాకర్స్ ని మాత్రమే ఉపయోగించాలి. ఇండియాలో దీపావళి పండుగ సందర్భంలో.. చట్టభద్రత లేని స్టోర్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి వాటిలో క్రాకర్స్ కొనడం డేంజర్. కాబట్టి.. ఈ విషయంలో జాగ్రత్త వహించండి.

పిల్లలకు సలహాలు
పిల్లలందరూ క్రాకర్స్ ని ఇష్టపడతారు. ఖచ్చితంగా పెద్ద టపాకాయలు, చిన్న టపాకాయలు పేల్చాలని ఇష్టపడతారు. కాబట్టి పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్లకు కొన్ని సేఫ్టీ టిప్స్ సూచించాలి. అలాగే ముందు జాగ్రత్తలు చెప్పాలి. కేర్ లెస్ గా ఉండకూడదని నేర్పించాలి. ఎప్పటికప్పుడు పిల్లలను చూస్తూ ఉండాలి.

క్లోజ్ ఏరియాలలో
క్లోజ్ ఉన్న ఏరియాలలో క్రాకర్స్ పేల్చకూడదు. కొంతమంది ఫన్ కోసం.. ఇంట్లో లేదా రూమ్ లో క్రాకర్స్ పేల్చాలని ట్రై చేస్తారు. కానీ.. ఇది చాలా డేంజరస్. కాబట్టి ఇంటి బయటే.. క్రాకర్స్ పేల్చాలి.

జాగ్రత్తగా క్రాకర్స్ తొలగించడం
క్రాకర్స్ ని పేల్చడం ఎంత ఫన్నీగా, తేలికగా ఉంటుందో.. వాటిని తొలగించడం కూడా అంతే ముఖ్యం. ఉపయోగించిన క్రాకర్స్ ని నీళ్లు ఉన్న బకెట్ లో వేయడం లేదా ఇసుకలో వేయడం మంచిది. కాల్చిన వెంటనే కడ్డీలు, వంటి వేడి వాటిని జాగ్రత్తగా దూరంగా పెట్టాలి.

మంటను ఆర్పడం
దీపావళి సెలబ్రేషన్స్ లో చాలా ముఖ్యమైనది.. క్రాకర్స్ కాల్చిన తర్వాత.. మంటలు ఆర్పేయాలి. అలాగే ఏ సమయంలో అయినా మంటలు పెద్దగా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి.. ఒక బక్కెట్ నీటిని దగ్గరలో పెట్టుకోవాలి. ఏ సమయంలో అవసరమవవచ్చు.

క్లాత్స్
దీపావళి సెలబ్రేట్ చేసుకునేటప్పుడు.. ముఖ్యమైనది సెఫ్టీ టిప్స్ లో క్లాతింగ్. కాటన్ క్లాత్ మెటీరియల్స్ ఉపయోగించాలి. సింథటిక్ మెటీరియల్స్ దీపావళి సమయంలో ఉపయోగించరాదు. లేదంటే.. ఇవి మంటను త్వరగా ఎట్రాక్ట్ చేసి ప్రమాదాలకు కారణమవుతుంది.

ఫస్ట్ ఎయిడ్
దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు, క్రాకర్స్ పేల్చేటప్పుడు దగ్గరలో ఫస్ట్ ఎయిడ్ ఉండేలా జాగ్రత్తపడాలి. ఏ చిన్న గాయమైనా.. ఫస్ట్ ఎయిడ్ ఉపయోగించవచ్చు. వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం మంచిది. చూశారుగా ఈ సేఫ్టీ టిప్స్ ని మీరు ఫాలో అయి.. దీపావళి సెలబ్రేట్ చేసుకోండి. హ్యాపీ అండ్ సేఫ్ దీపావళి. ఎంజాయ్ చేయండి.



Click it and Unblock the Notifications