Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
కలలో వీటిని చూశారంటే.. త్వరలోనే ధనవంతులవుతారట..!!
మనందరికీ కలలు వస్తుంటాయి. కొన్ని మంచి కలలు, కొన్ని కలలు చెడుగా వస్తుంటాయి. అయితే.. కొన్ని కలలు వచ్చాయంటే.. వాటి వెనక కొన్ని ప్రత్యేక కారణాలుంటాయి. ఆ కలల వెనక కొన్ని ఆశ్చర్యకర రహస్యాలుంటాయి.
ఒక వస్తువు, జంతువు, మనుషులు, బంధువులు, ఫ్రెండ్స్.. ఇలా కలలో కనిపిస్తుంటాయి. ప్రత్యేకంగా ఒక వ్యక్తి లేదా ఒక వస్తువే కలలో కనిపించింది అంటే.. దానికి అర్థం, సంకేతాలు ఉంటాయి. అయితే కలలో కనిపించేవన్నీ భ్రమ అని కొందరు భావిస్తారు.
కానీ.. మనకు కలలు వస్తున్నాయంటే.. భవిష్యత్ కి లేదా తర్వాత రోజు జరగబోయే వాటికి సంకేతాలని.. కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. నిజమే.. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. మీ కలలో ఇప్పుడు చెప్పబోయేవి కనిపించాయి అంటే.. మీకు త్వరలోనే.. డబ్బు వస్తుందని, ధనవంతులు అవుతారని సూచిస్తాయి.

సూర్యుడు
మీ కలలో సూర్యుడిని చూశారంటే.. త్వరలోనే మీరు కొంత డబ్బుని పొందుతారని సంకేతం.

ధనవంతులు
ఒకవేళ చాలా బ్రైట్ లైట్ తో.. సూర్యుడు కనిపిస్తే మాత్రం.. త్వరలోనే.. మీ జీవితం అత్యంత డబ్బుతో నిండిపోతుంది. అంటే ధనవంతులు అవుతారని సంకేతం.

చంద్రుడు
కలలో సూర్యుడి లాగే చంద్రుడి కనిపించాడంటే.. త్వరలోనే ధనవంతులు అవుతారని సంకేతం.

కోపం
చంద్రుడు అంటే.. ప్రశాంతతకు సంకేతం. కాబట్టి.. మీలో కోపం తగ్గుతుందని కూడా సూచిస్తుంది.

జుట్టు రాలినట్టు
నిజ జీవితంలో జుట్టు రాలిపోవడం పెద్ద సంగతేం కాదు. కానీ.. కలల ప్రపంచంలో.. మీ జుట్టు రాలుతున్నట్టు చూశారంటే.. త్వరలోనే లక్ష్మీదేవి అనుగ్రహం, ఆశీర్వాదం పొందుతారని సంకేతం.

రెడీ అవుతున్నట్టు
ప్రత్యేక సందర్భాల్లో మనమందరం రెడీ అవుతూ ఉంటాం. అయితే.. కలలో మీరు రెడీ అవుతున్నట్టు ఎప్పుడైనా కనిపించిందా ? అంటే మీ ముఖం అందంగా.. కలలో కనిపించిందంటే.. మీరు త్వరలోనే సంపన్నులు అవుతారని సంకేతం.

పర్స్
సాధారణంగా పర్స్ అంటే.. డబ్బు దాచుకోవడానికి, పెట్టుకోవడానికి ఉపయోగిస్తాం. అదే కలలో పర్స్ కనిపించిందంటే.. త్వరలోనే మీకు కావాల్సినంత డబ్బు సొంతమవుతుందని సూచిస్తుంది.

జెండా
మనందరం.. స్వాతంత్ర్య దినోత్సవం రోజు, రిపబ్లిక్ డేన జెండా ఎగరవేయడాన్ని ఇష్టపడతాం. ఒక వేళ ఇలాంటి విషయాల గురించి కల వచ్చిందంటే.. త్వరలోనే ధనవంతులు అవుతారని సంకేతం.

ఆవు పాలు ఇస్తున్నట్టు
ఆవు పాలు ఇస్తుందని మనందరికి తెలుసు. అయితే ఆవు పాలు ఇస్తున్నట్టు కలలో కనిపిస్తే.. త్వరలో సంపన్నులవుతారని సంకేతమని చాలామందికి తెలియదు.

బంగారు నగలు
బంగారు నగలు కలిగి ఉంటే.. ఆ వ్యక్తి ధనవంతుడే. కానీ.. మిమ్మల్ని మీరు బంగారం ధరించినట్టు కలలో కనిపిస్తే.. బంగారం, డబ్బు త్వరలోనే మీ జీవితంలోకి వస్తాయని సంకేతం.

అద్దాలు
పగిలిన అద్దాలు రియల్ లైఫ్, డ్రీమ్స్ ఎక్కడ కనిపించినా.. మంచిది కాదు. అయితే.. ప్లెయిన్చ, అందమైన అద్దాలు కలలో కనిపిస్తే.. త్వరలోనే ధనవంతులు అవుతారని సంకేతం.

పాయసం
మనందరికి పాయసం అంటే ఇష్టమే కదా? బియ్యం, పాలు, పంచదారతో తయారు చేసిన పాయసంను కలలో చూశారంటే.. త్వరలోనే ధనవంతులు అవుతారని సంకేతం.



Click it and Unblock the Notifications