Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
బాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేసిన సీక్రెట్ రిలేషన్స్..!
బాలీవుడ్ లో మనం గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ చూశాం. రీల్ లైఫ్ లో కావచ్చు.. రియల్ లైఫ్ లో కావచ్చు. అవి చాలా గొప్పగా నిలిచిచాయి. అయితే రియల్ లైఫ్ లవ్ స్టోరీస్ కొన్ని పాపులర్ అయ్యాయి. మరికొన్ని బ్రేక్ అప్ అయ్యాయి. కానీ కొన్ని లవ్ స్టోరీస్ మాత్రం ప్రపంచానికి తెలియని సీక్రెట్ లవ్ స్టోరీస్ గా పాపులర్ అయ్యాయి.
అయితే ఈ సీక్రెట్ లవ్ స్టోరీస్ కొన్ని కారణాల వల్ల దాగుడుమూతలాడాయి. ఇదంతా వాళ్ల వ్యక్తిగతం. కానీ కొన్నేళ్లుగా.. బాలీవుడ్ లో షాకింగ్ సీక్రెట్ రిలేషన్ షిప్స్ సక్సెస్ అయ్యాయి. మరి అలాంటి.. షాకింగ్ సీక్రెట్ రిలేషన్ షిప్స్ గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా.. లెట్స్ చెక్ ఔట్..

కంగనా, హృతిక్
తాజాగా బాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది కంగనా, హృతిక్ సీక్రెట్ రిలేషన్ షిప్. వీళ్లిద్దరి సీక్రెట్ రిలేషన్ గురించి బాలీవుడ్ కి మాత్రమే కాదు.. ఎవరికీ తెలియదు. కానీ కంగనా ఓ ఇంటర్వ్యూలో తన సిల్లీ ఎక్స్ హృతిక్ అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. వాళ్ల డేటింగ్ లో ఉన్నట్టు కంగనా స్ట్రాంగ్ గా చెప్పేసింది.

షారుక్, ప్రియాంకా
షారుక్ ఖాన్, ప్రియాంకా సీక్రెట్ రిలేషన్ షిప్ నడుపుతున్నారని.. బీటౌన్ లో వార్తలు షికారు చేస్తున్నాయి. ఒకప్పుడు వీళ్ల రిలేషన్ గురించి చాలా రూమర్స్ వచ్చాయి. అయితే వీళిద్దరి సీక్రెట్ రిలేషన్ ఎంతవరకు నిజమో ఇంకా క్లారిటీ రాలేదు.

కంగనా, అజయ్ దేవగన్
కంగనా, అజయ్ సీక్రెట్ రిలేషన్ బాలీవుడ్ ని షాక్ కి గురిచేసింది. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై సినిమా షూటింగ్ లో వీళ్లిద్దరూ కలిశారు. కాజోల్ ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వీళ్ల సీక్రెట్ రిలేషన్ నడిచింది. అయితే ఆ తర్వాత అజయ్ దేవగన్ కాజోల్ ని వదిలిపెట్టలేడని తెలుసుకుని.. అజయ్ తో రిలేషన్ కి బ్రేకప్ చెప్పంది.

రేఖ, అమితాబ్
బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన మరో సీక్రెట్ రిలేషన్ బీటౌన్ డ్రీమ్ గాళ్ రేఖ, బిగ్ బీ అమితాబ్ లవ్ స్టోరీ. జయాతో పెళ్లి అయిన తర్వాత అమితాబ్ సినిమాలు తీసేటప్పుడు రేఖతో సీక్రెట్ రిలేషన్ నడిపారని వార్తలు వచ్చాయి. నీతూ, రిషి పెళ్లిలో రేఖ మంగళసూత్రం, సింధూర్ తో కనిపించడంతో.. అందరూ షాక్ అయ్యారు. అయితే.. ఎవరికోసమో తన ఫ్యామిలీని విడిచిపెట్టేది లేదని.. అమితాబ్ తేల్చిచెప్పాడు. అప్పుడప్పుడు ఈ ఇద్దరు ఫ్యాన్స్ ముందు దర్శనమిస్తూ ఉంటారు.

నర్గీస్, రాజ్ కపూర్
రాజ్ కపూర్, నర్గీస్ రిలేషన్ గురించి చాలా మందికి తెలియదు. కానీ ఆ తర్వాత వీళ్ల సీక్రెట్ రిలేషన్ కి బ్రేక్ పడింది. 16 సినిమాల్లో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండించిన వీళిద్దరూ.. ఆఫ్ స్క్రీన్ లో కూడా రిలేషన్ లో ఉన్నారు. తర్వాత తన ఫ్యామిలీని రాజ్ కపూర్ వదులుకోడని తెలుసుకున్న నర్గీస్.. సునీల్ దత్ తో ప్రేమాయణం నడిపింది.

రాణి ముఖర్జీ, ఆదిత్య చోప్రా
రాణి ముఖర్జీ, ఆదిత్యా చోప్రా మధ్య ఎపైర్ చాలా కాలం సీక్రెట్ గానే ఉంది. వీళ్లిద్దరూ ఏమాత్రం రిలేషన్ గురించి రివీల్ చేయలేదు.. ఒప్పుకోలేదు కూడా. ఆదిత్యా తన చిన్ననాటి ప్రేమికురాలు పాయల్ కన్నాని పెళ్లి చేసుకున్నాడు. కానీ రాణి ముఖర్జీతో.. రిలేషన్ బలపడిన తర్వాత.. ఆదిత్యా చోప్రా.. పాయల్ కన్నాను వదిలిపెట్టి.. రాణి ముఖర్జీని పెళ్లాడాడు.

మలైకా అరోరా ఖాన్, అర్జున్ కపూర్
వీళ్లిద్దరి సీక్రెట్ రిలేషన్ గురించి బాలీవుడ్ లో ఎవరూ నమ్మలేదు. మలైకా ఎఫైర్ లో ఉందంటే.. ఇదంతా గాసిప్స్ అనుకున్నారు. అయితే ఈ రూమర్స్ పెరిగిపోవడం, మలైకా అర్భాజ్ తో బ్రేక్ అప్ అవడంతో.. ఈ రూమర్స్ కి మరింత బలం చేకూరింది.

మహేష్ భట్, పర్వీన్ భాయ్
మహేష్ భట్.. పర్వీన్ తో తన ఎఫైర్ గురించి పబ్లిక్ గా అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత కిరణ్ బేడీని పెళ్లి చేసుకునే వరకు ఇద్దరూ డేటింగ్ చేశారు.

నర్గీస్ ఫక్రీ, ఉదయ్ చోప్రా
నర్గీస్ ఫక్రీ, ఉదయ్ చోప్రా రిలేషన్ తెలిశాక.. బాలీవుడ్ సినీ ప్రపంచమంతా షాక్ లోకి వెళ్లిపోయింది. వాళ్లిద్దరూ మంచి స్నేహితులని అందరూ భావిస్తున్న సమయంలో.. ఇద్దరూ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు లీక్ అవడంతో.. వీళ్ల సీక్రెట్ రిలేషన్ తెలిసి.. బీటౌన్ షాక్ అయింది. ఉదయ్ చోప్రా తన జీవితంలో పార్ట్ అని నర్గీస్ చెప్పింది.

విక్రమ్ భట్, సుస్మితా సేన్
90లలో లాంగ్ రిలేషన్ లో ఉన్నట్టు చాలా రూమర్స్ వచ్చాయి. తనకు వివాహేతర సంబంధం ఉండటం వల్ల డివర్స్ తీసుకుంటున్నట్లు విక్రమ్ ప్రకటించాడు. అయితే విక్రమ్ కి సుస్మితాతో ఉన్న రిలేషన్ షిప్ ఆధారంగా చేసుకుని.. ఆన్కహీ సినిమా రూపొందించినట్లు వార్తలొచ్చాయి.



Click it and Unblock the Notifications