For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షాక్: మీ చుట్టూ దెయ్యం తిరుగుతోందని తెలిపే సంకేతాలివే.. !!

By Swathi
|

చీకట్లో ఒక్కరే ఉన్నారా ? లేదా కరెంట్ పోయింది ఇంట్లో ఎవరూ లేరు. ఎటు చూసినా.. అంతా చీకటిగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏ మాత్రం అలికిడి అయినా.. ఉలిక్కిపడతాం. అలాంటప్పుడే.. టీవీల్లో, థియేటర్లలో ఎంజాయ్ చేసిన.. హర్రర్ సినిమాలు గుర్తొచ్చి.. భయాన్ని రెట్టింపు చేస్తాయి. ఇలాంటి సంఘటనలు మీకు ఎదురయ్యాయా ?

ఆత్మహత్య తర్వాత వాళ్ల ఆత్మ ఏమవుతుందో తెలుసా ?

చాలామందికి చీకటి అంటే భయం, మరికొందరికి రాత్రిపూట బయటికి వెళ్లాలంటే వణుకు. ఇవన్నీ ఎందుకు ? దెయ్యాలు, భూతాలు అన్న మూఢనమ్మకాలు, భయాలు మనచుట్టూ కమ్మేయడం వల్ల. అయితే దెయ్యాలు అంటే మరేవో కాదు ఆత్మలే దెయ్యాలు. కొన్ని ఆత్మలు ఎలాంటి హాని చేయవు. మరికొన్ని కొన్ని సంకేతాలను ఇస్తుంటాయి.

దెయ్యాలు మరియు ఆత్మల గురించి 10 తమాషా నిజాలు

మీకు దెయ్యాలపై నమ్మకం లేకపోయినా.. కొన్ని సందర్భాల్లో హఠాత్తుగా వినిపించే శబ్ధం, అదోరకమైన వినికిడి భయం కలిగిస్తాయి. అలాగే భయం కారణంగా కూడా దెయ్యం ఉందేమో అన్న ఆందోళన వెంటాడుతుంది. తమ చుట్టూ ఏదో ఉందన్న భ్రమ కూడా దెయ్యాలుగా భావిస్తారు. అయితే.. కొన్ని రకాల ఆత్మలు ఇచ్చే సంకేతాలు దెయ్యాలు ఉన్నాయని నమ్మేలా చేస్తున్నాయి. మరి మిమ్మల్ని దెయ్యం ఫాలో అవుతుందని తెలిపే సంకేతాలేంటో తెలుసుకోవాలని ఉందా ?

నీడ

నీడ

మీరు మీ గదిలో పైకప్పుపై నీడను చూడటం మొదలుపెట్టారంటే.. మీ చుట్టూ దెయ్యం తిరుగుతోందని సంకేతం.

గుసగుసలు

గుసగుసలు

మీ చెవిలో ఎవరో గుసగుసలు చెబుతున్నట్లు నిరంతరం వింటున్నారా ? కొన్ని సందర్భాల్లో ఇది ఊహే అయినప్పటికీ.. ఇది మీ చుట్టూ దెయ్యం ఉందనడానికి సంకేతం కూడా.

గమనించడం

గమనించడం

మిమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నట్లు నిరంతరం మీరు ఫీలవుతున్నారా ? ఒకవేళ అవును అయితే.. మీపై దెయ్యం కన్నేసిందని గుర్తించాలి.

బ్యాటరీ

బ్యాటరీ

పాత భవనాలు, దెయ్యాలు ఉంటాయని చెప్పే ప్రదేశాల్లో ఎలక్ట్రానిక్ డివైజ్ లలో ఉన్నట్టుండి బ్యాటరీ అయిపోయిందంటే.. మీ చుట్టూ ఏదో జరుగుతోందని సంకేతం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

వ్యక్తపరచలేని అశాంతి

వ్యక్తపరచలేని అశాంతి

రోజూ ఒక ప్రత్యేకమైన సమయంలో అంటే ఒకేసమయానికి అశాంతికి గురవుతున్నారా ? ఇది మీ చుట్టూ దెయ్యం ఉందనడానికి సంకేతం కావచ్చు.

నిస్సత్తువ

నిస్సత్తువ

దెయ్యాల మీలో ఉన్న శక్తిని నాశనం చేసి.. మిమ్మల్ని పూర్తీగా బలహీనంగా, నిస్సత్తువగా మార్చేయగలవు.

పాదాల అడుగులు

పాదాల అడుగులు

పాదాల అడుగులు పడుతున్నట్లు మీకు మాత్రమే వినపడుతున్నట్లైతే.. మీ చుట్టూ దెయ్యం ఉన్నట్టే. ఒకవేళ పాదాల అడుగులు పడుతున్నాయని అనుమానం వస్తే.. వెంటనే పరిశీలించండి.

తలుపులపై శబ్ధం

తలుపులపై శబ్ధం

ఎవరూ లేకపోయినా.. తలుపులపై గట్టిగా శబ్ధం రావడం, వెనకవైపు తలుపు శబ్ధం రావడం, వంటింట్లో అలమరాల్లో శబ్ధం వినిపించడం.. ఇలాంటివన్నీ.. మీ ఇంట్లో దెయ్యం ఉందని తెలిపే సంకేతాలు.

కుక్క

కుక్క

మీ ఇంట్లో ఉన్న కుక్క ఎక్కడో చూస్తూ.. చాలా గట్టిగా అరుస్తోందా ? కానీ ఆ ప్రాంతంలో మీరు ఏమీ గమనించలేకపోతున్నారా ? జంతువులు.. ఏదైనా దుష్టశక్తులను వెంటనే గుర్తించగలవు. కాబట్టి.. మీ కుక్క అలా అరుస్తోందంటే.. అక్కడ దెయ్యం ఉండే అవకాశం ఉంటుంది.

వస్తువులు కదలడం

వస్తువులు కదలడం

అవును ఏదైనా పుస్తకం, గ్లాస్ హఠాత్తుగా గాల్లో ఎగరడం వంటి సంకేతాలు దెయ్యం ఉందని తెలుపుతాయి. ఒకవేళ గ్లాసు ఒక దగ్గర పెడితే.. అది మరో ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించినా.. మీ చుట్టూ దెయ్యం ఉందని సంకేతం.

భయంకరమైన వాసన

భయంకరమైన వాసన

కొన్ని సందర్భాల్లో దెయ్యాలు తమ ఉనికిని తెలపడానికి చెడు వాసనను బయటపెడతాయి. ఒకవేళ మీరు ఉన్నట్టుండి భయంకరమైన వాసనను పసిగడితే.. మీ దగ్గర దెయ్యం ఉందని సంకేతం.

ముట్టుకున్నట్టు

ముట్టుకున్నట్టు

మీ వెనకవైపు ఎవరో ముట్టుకున్నట్టు లేదా మీ భుజాలు తట్టినట్టు లేదా మీ జుట్టు లాగినట్టు లేదా మిమ్మల్ని ముందుకు తోసినట్టు ఫీలయ్యారు అంటే.. మీ చుట్టూ దెయ్యం ఉందని సంకేతం.

భూతం

భూతం

నీడకు భూతానికి తేడా ఉంటుంది. ఎందుకంటే.. అది మనిషిలా కనిపిస్తుంది. క్లాత్ వేసుకున్నట్లు, ముఖ భాగాలను గుర్తించగలిగితే.. మీ చుట్టూ దెయ్యం ఉందని సంకేతం.

చూడండి

చూడండి

ఈ సంకేతాలన్నీ.. మీ చుట్టూ దెయ్యం ఉందని కాదు. ఈ సంకేతాలు కనిపించినప్పుడు భయపడకుండా.. జాగ్రత్తగా పరిశీలిస్తే.. అసలు విషయం తెలుస్తుంది. ఏ చిన్న శబ్దం వచ్చినా, నీడను చూసినా.. భయపడిపోకండి. దెయ్యాలపై ఆందోళన పెట్టుకోకండి.

English summary

Signs that a ghostly presence is around you

Signs that a ghostly presence is around you. Even if you don't necessarily believe in ghosts, sometimes there is a nagging fear that something around you is not right.
Story first published:Tuesday, April 26, 2016, 15:46 [IST]
Desktop Bottom Promotion