Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గతజన్మలో ఇష్టపడిన వ్యక్తిని.. ఇప్పుడు కలిశారని తెలిపే సంకేతాలు..!!
మీకు మగధీర సినిమా గుర్తుండే ఉంటుంది కదా. అందులో రామ్ చరణ్, కాజల్ ఒక జన్మ తర్వాత మళ్లీ పుట్టి... అనుకోకుండా కలుస్తారు. అలా కలిసినప్పుడు వాళ్లు ఒకరిని ఒకరు తాకితే.. చాలు ఏదో షాక్ కొట్టినట్టు.. పాత జన్మ కాస్త గుర్తొస్తుంది. అలా పాత జన్మ వ్యక్తిని మీరు లైఫ్ లో కలిసారా ? అదెలా సాధ్యం అనుకుంటున్నారా ? సినిమా కాబట్టి.. గ్రాఫిక్స్ చేశారు.. మరి రియల్ లైఫ్ లో అది సాధ్యమా అనేగా మీ సందేహం..??
నిజమే.. మనందరం అసాధ్యం అనుకుంటాం. కానీ.. మనకు గత జన్మలో చాలా క్లోజ్ ఉన్నవాళ్లను ఈ జన్మలో కలిశాము అంటే.. ఆ లక్షణాలు మనకు అర్థమవుతాయట. కొన్ని లక్షణాలను బట్టి.. వాళ్ల మీ గత జన్మలో కీలకపాత్ర పోషించినవాళ్లని గుర్తించవచ్చట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ..!
ప్రతిరోజూ చాలామందిని కలుస్తూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో వీళ్లను గతంలో ఎప్పుడైనా కలిశామన్న ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇది చాలా అయోమయానికి గురిచేస్తుంది. అలాంటప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి. అలాగే గత జన్మకు సంబంధించిన వ్యక్తి ఏమో అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. అయితే సిల్లీగా అనిపిస్తుంది.
అయితే ఇకపై అయోమయానికి గురి అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని లక్షణాలు కనిపిస్తే.. ఖచ్చితంగా మీరు ఆ వ్యక్తిని గత జన్మలో కలిసినట్టే అని నిర్ధారణకు రావచ్చు. కాబట్టి.. మీ చుట్టూ ఉన్నవాళ్లలో ఎవరి విషయంలోనైనా.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. మీరు ఆ వ్యక్తిని గత జన్మకు సంబంధించిన వాళ్లుగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు.

వెంటనే
వాళ్లను చూడగానే.. ఏ మాత్రం ఆలోచించకుండా.. వాళ్లతో మాటలు కలుపుతారు. కొన్ని ఏళ్లుగా.. ఫ్రెండ్స్ గా ఉంటారు. నిర్మొహమాటంగా మాట్లాడతారు. వాళ్లు మీ గత జన్మకు సంబంధించిన వాళ్లు అని చెప్పడానికి ఇదొక సంకేతం.

స్ట్రాంగ్ కనెక్షన్
ఫిజికల్ గా దూరంగా ఉన్నా.. వాళ్లతో చాలా ప్రేమగా ఉంటారు. వాళ్లు మాటల్లో చెప్పకపోయినా.. చూపులతోనే.. పవర్ ఫుల్ మెసేజ్ వినేస్తారు. ఇలాంటి సంకేతం ఖచ్చితంగా వాళ్లను మీరు గతంలో కలిసినట్టు తెలుపుతుందని టెలీపతీ చెబుతోంది.

వాళ్లతో ఉంటే సమయమే తెలియదు
వాళ్లతో కలిసి ఉన్నప్పుడు, వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు ఏమాత్రం టైం తెలియదు. చాలా హ్యాపీగా ఎంతసేపైనా వాళ్లతో స్పెండ్ చేయగలుగుతున్నారంటే.. ఖచ్చితంగా వాళ్లు మీ పూర్వ జన్మతో సంబంధం ఉన్నవాళ్లే అయి ఉంటారు.

బుక్ లా వాళ్లను చదివేస్తారు
కొన్ని సార్లు ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్, ఆలోచనలు తెలుసుకోవడానికి ఎలాంటి పదాలు అవసరం ఉండదు. కేవలం వాళ్లను చూస్తే చాలు.. వాళ్ల కళ్లలో.. అన్ని ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలుగుతాం.

మెమరీస్
గత జన్మకు సంబంధించిన అన్ని స్వీట్ మెమరీస్ ని వాళ్లతో పంచుకోగలుగుతున్నారు. ఒకే ప్లేస్ లో ఉంటారు.. లేదా గతంలో మీరు గడిపిన ప్రదేశాల్లోనే ఉంటారు. దీన్ని కో ఇన్సిడెన్స్ అనుకుంటారు.. కానీ.. పాస్ట్ లైఫ్ కి సంకేతం.

ఎమోషన్స్
ప్రతిసారీ వాళ్లను కలిసినప్పుడల్లా.. చాలా హ్యాపీగా ఫీలవుతారు. ఎమోషన్స్ ని చాలా ఫ్రీగా పంచుకుంటారు. ఇలాంటి ఫీలింగ్స్ వీళ్లతో తప్ప ఎవరితోనూ కలగవు అంటే.. ఖచ్చితంగా వాళ్లు మీ గత జన్మకు సంబంధించినవాళ్లే.

హ్యాపీ ఫీలింగ్
ఎప్పుడు, ఎక్కడ వాళ్లను కలిసినా.. ఏమాత్రం చిరాకు అనిపించదు. చుట్టూ ఎలా ఉన్నా.. చాలా ప్రశాంతంగా, ఇంట్లోనే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. వాళ్లతో షేర్ చేసుకునే రిలేషన్ షిప్.. చాలా తేలికగా ఉంటుంది. ఎలాంటి ఒత్తిడి అనిపించదు.



Click it and Unblock the Notifications