Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
లైఫ్ అండ్ డెత్ గురించి కొన్ని వింత వాస్తవాలు..
మరణం అన్నది ఉన్నది మరియు అది మనము ఎల్లప్పుడూ నివారించడానికి ప్రయత్నించే అనివార్య వాస్తవం. జీవించే ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు చావవలసిందే. మరణం కోసం ఒక ప్రత్యేక కారణం అంటూ ఉన్నది, కొంతమంది అనారోగ్య కారణం వలన మరియు కొంతమంది ప్రమాదాలవలన మరియు ఇంకొంతమంది వేరే అనేక ఇతర కారణాల వల్ల మరణిస్తారు. కొంతమంది తమ జీవితం పూర్తిగా జీవిస్తారు మరియు మరికొందరు చిన్నవయసులోనే మరణిస్తున్నారు. ఇక్కడ మనము అంతా విధి అని చెప్పుకోవొచ్చు.
మీరు చేయగలిగిన విషయం ఏమిటంటే ప్రమాదాల వలన ఏదైనా వైకల్యం లేదా ఏదైనా అనారోగ్యం రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం, చెక్-అప్ ల కొరకు వైద్యుడిని సందర్శించటం, వ్యాయామం చేయటం, ధూమపానం మరియు తాగుడు నివారించటం మరియు సంపూర్ణమైన జీవితం జీవించడానికి ఈ పనులను చేయాలి.

ఇక్కడ మనం ఆలోచించవలసినదేమంటే మనం యెంత ఎక్కువకాలం బ్రతికున్నాము అని కాదు యెంత ఆరోగ్యంగా, అందమైన జీవితాన్ని గడుపుతున్నాము అని ఆలోచించాలి. మెడికల్ సైన్సెస్ చాలా పురోగతి చెందింది కాబట్టి, మీకు ఏ తీవ్రమైన వ్యాధులు ఉన్నా సుదీర్ఘ జీవితాన్నిగడపటానికి అనేక అవకాశాలు ఉన్నాయి.
జీవితం మరియు మరణం గురించి కొన్ని విచిత్రమైన మరియు తెలియని నిజాలు ఉన్నాయి, వాటిని మీరు అవగాహన కోసం తప్పక తెలుసుకోవాలి. జీవితం మరియు మరణం గురించి విచిత్రమైన మరియు ఆసక్తికరమైన విషయాలను కొన్నిటిని చూద్దాం.

ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, వినికిడి చివరిగా మరణిస్తుంది. అంటే మరణించిన వ్యక్తి తరువాత కూడా కొంతసేపు శబ్దాలను వింటాడు అని అర్థం.

మగవారిలో అంగస్తంభనలు:
పురుషులలో వారి మరణం తర్వాత కూడా అంగస్తంభనలు జరుగుతుంటాయి. పురుషాంగం యొక్క మెంబ్రేన్లు కాల్షియం తీసుకోవడం వలన ఈ విధంగా జరుగుతుంది. కాల్షియం కుదింపులకు కారణమవుతుంది మరియు అందువలన ఒక విధమైన అంగస్తంభనలు ఏర్పడతాయి. ఇది కూడా మరణం గురించి తెలుసుకునే వింత నిజాలలో ఒకటి.

ఒక్క రోజులో మరణం:
మీ పుట్టినరోజునాడు 153.000 ప్రజలు మరణించవచ్చు. ఎడమ చేతివాటం వారు, కుడి చేతివాటం వారికంటే మూడేళ్ల ముందే మరణిస్తున్నారు.ప్రపంచంలో ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంతున్నారు. ప్రతి 90 సెకన్లకు, ఒక మహిళ గర్భం లేదా ప్రసవ సమయంలో మరణిస్తున్నది.

వ్యాయామలోపం :
శారీరక శ్రమ లేకపోవడం ప్రపంచవ్యాప్తంగా నివారించగల మరణాలకు గల ప్రధాన కారణాలలో ఒకటి.

పొల్యూషన్ :
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఎనిమిది మరణాలలో ఒకటి ప్రపంచంలో వాయు కాలుష్యం వలన కలుగుతున్నది. ఎయిర్ కాలుష్యం ఊపిరితిత్తుల ద్వారా శరీరంలోకి సులభంగా చేరుకుంటున్నది మరియు ఊపిరితిత్తుల ద్వారా సులభంగా రక్తాన్ని చేరుకుంటున్నది.

డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ :
ఒక్క యునైటెడ్ స్టేట్స్ లో 7000 మంది వైద్యులు వ్రాసిన తప్పుడు చేతి రాతవాళ్ళ తప్పు మోతాదులో మరియు న్యాయవిరోధ ప్రిస్క్రిషన్ కారణంగా మరణిస్తున్నారని ఒక అంచనా. ఈ ఫిగర్ భారతదేశంలో కూడా ఎక్కువ కావచ్చు.
వైద్యలోపాలు:
నివారించగల వైద్యపరమైన లోపాలతో ప్రతి సంవతర్సరం ప్రపంచ వ్యాప్తంగా దాదపు 44000 ప్రజలు మరిణిస్తున్నారు.

మౌంట్ ఎవరెస్ట్ పై అధిరోహకుల మృతదేహాలు దాదాపు 200 ఉన్నాయి. ఇవే ఇప్పుడు దాని శిఖరం చేరుకోవడానికి ఆనవాళ్లుగా మారాయి.

కట్నం
కట్నానికి సంబంధించిన నేరాలలో భారతదేశంలో ప్రతి గంటకు ఒక మహిళ మరణిస్తున్నది. ఇది మరణం గురించి ఒక వింత మరియు విచారించదగ్గ నిజం.



Click it and Unblock the Notifications