Latest Updates
-
మాతృ దినోత్సవం రోజున భార్య, అమ్మ మధ్య నలిగిపోతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గొడవలు ఉండవు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా?
కాశ్మీర్ లో అందాలే కాదు.. అద్భుతాలూ దాగున్నాయి.. !
ప్రకృతి అందాలకు ఆలవాలం కాశ్మీర్. పచ్చని చెట్లు, మనస్సుకు ఆనందాన్ని నింపే ప్రకృతి రమణీయతకు ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే. అందుకే మన కవులు కాశ్మీర్ అందాల గురించి ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తుంది. అరవిరిసిన అందాలతో మనల్ని మంత్రముగ్దులను చేసే భూలోక స్వర్గం కాశ్మీర్.
ఇండియన్స్ ఫాటించే మూఢనమ్మకాల వెనకున్న రహస్యాలు
ఇండియాలోని అత్యంత అందమైన ప్రాంతాల్లో కాశ్మీర్ ఒకటి. భూలోక స్వర్గంగా కాశ్మీర్ ని వర్ణిస్తారు. కాశ్మీర్ సందర్శించిన తర్వాత.. అదో ఆధ్మాత్మిక అనుభూతి కలుగుతుందని సాధారణంగా చెబుతుంటారు. ఇది వాస్తవమే. ఎందుకంటే.. అక్కడ అనేకమంది పవిత్రమైన వ్యక్తులు ఉన్నారు.
ప్రకృతిని అత్యంత అందంగా చూడగలిగే ప్రాంతం కాశ్మీర్ కావడంతో.. ఇక్కడ ఎక్కువ సినిమాల షూటింగ్ లు జరుగుతూ ఉంటాయి. అలాగే టూరిస్ట్ ప్లేస్ కావడంతో కాశ్మీర్ ని సందర్శించేవాళ్ల సంఖ్య కూడా ఎక్కువే. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఈ కాశ్మీర్ అందాలను ఒక్కసారైనా చూడాలని భావిస్తారు.
ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకున్న స్టార్స్ వీరే.. !
కులమతాలకు అతీతంగా కాశ్మీరీయులు అందరికీ సహాయం చేస్తుంటారు. వచ్చిన అతిథులను చాలా ఆత్మీయంగా చూసుకుంటారు. ఇక్కడ పూలు, పర్వతాలు, లేక్స్, నదులు చెప్పుకోదగిన అందాలు. ఈ అందాలను చూస్తే.. జీవితంలో మరిచిపోలేని అద్భుతంగా మిగిలిపోతుంది. ఈ అందాలే కాదు.. కాశ్మీర్ గురించి సర్ ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి.

రెండు రాజధానులు
జమ్మూ కాశ్మీర్ కి రెండు రాజధానులున్నాయి. సమ్మర్ లో శ్రీనగర్ రాజధాని అయితే.. వింటర్ లో జమ్ము రాజధానిగా ఉంటుంది.

అక్షరాస్యత
కాశ్మీర్ లో చాలా వరకు అందరూ చదువుకున్నవాళ్లే. ఇక్కడ అక్షరాస్యత శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.

జనాభా
కాశ్మీర్ జనాభా 16 మిలియన్లు. ప్రపంచంలోని 133 ఆయా ప్రాంతాల జనాభా కంటే ఎక్కువ.

ఆర్టికల్ 370
ఈ ఆర్టికల్ ప్రకారం కాశ్మీర్ లో ఇతర ప్రాంతాల వాళ్లు భూమి కొనడానికి వీలు లేదు. జమ్మూ కాశ్మీర్ కి చెందని ఏ ఒక్కరూ ఇక్కడ భూమి కొనే ఛాన్సే లేదు.

సిటిజెన్ షిప్
జమ్మూ కాశ్మీర్ కి చెందిన ఏ మహిళ అయినా.. ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో లేదా వేరే దేశాల్లో సిటిజన్ షిప్ కలిగిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. ఒకవేళ అలా చేసుకుంటే.. ఆమెకున్న కాశ్మీర్ సిటిజన్ షిప్ క్యాన్సిల్ అవుతుంది.

సిటీ ఆఫ్ లక్ష్మీ
శ్రీనగర్ ను సిటీ ఆఫ్ లక్ష్మీగా పిలుస్తారు. ఈ అందమైన ప్రాంతాన్ని అశోకుడు కనిపెట్టాడు. జమ్మూని 3000 సంవత్సరాల క్రితం గుర్తించారు.

మతాలు
కాశ్మీర్ లో ముస్లింలు ఎక్కువగా ఉంటే.. జమ్ములో హిందువులు ఎక్కువగా ఉంటారు. అలాగే లఢక్ లో బుద్దిస్ట్ లు ఎక్కువగా ఉంటారు.

ఫస్ట్ సూపర్ స్టార్
లెజండ్రీ సింగర్, ఇండియాలో ఫస్ట్ సూపర్ స్టార్ కెఎల్ సైగల్ జమ్మూ అండ్ కాశ్మీర్ కి చెందినవారే.

బార్డర్
జమ్ము కాశ్మీర్ కు చైనా, పాకిస్తాన్ రెండు బార్డర్ దేశాలే. రెండు అంతర్జాతీయ దేశాల బార్డర్స్ కలిగిన భారతీయ రాష్ట్రంగా కాశ్మీర్ ను చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications