Latest Updates
-
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం
ఆహారం కాదు, నీళ్లు కాదు.. ఆ దేశానికి చెత్త కరువు వచ్చింది..!
ఎవరైనా చెత్తను వదిలించుకుంటారు కానీ.. దిగుమతి చేసుకోవడం ఏంటని ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. చెత్తను దిగుమతి చేసుకుంటున్న దేశం ఏది ? ఇతర దేశాల చెత్త ఆ దేశానికి ఎందుకు ?
ఇండియాలో చెత్త కుప్పలు తెప్పలుగా పేరుకుపోతోంది. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా అడ్డుకోవడానికి స్వచ్ఛ భారత్ నినాదం తెరపైకి వచ్చినా.. ఇంకా చెత్త సమస్య తీరడం లేదు. వీధుల్లో, మెయిన్ రోడ్లలో ఎక్కడ చూసినా.. చెత్త మయమే. కానీ ఒకదేశం మాత్రం చెత్త తక్కువైపోయి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.

ఆ దేశంలో మాత్రం ధాన్యాలు కాదు, కూరగాయలు కాదు.. చెత్త కరువొచ్చిందట. చెత్త కరువు రావడం ఏంటి అనుకుంటున్నారా ? అంతేకాదండోయ్.. చెత్తను ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటోందట. ఎవరైనా చెత్తను వదిలించుకుంటారు కానీ.. దిగుమతి చేసుకోవడం ఏంటని ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం.
చెత్తను దిగుమతి చేసుకుంటున్న దేశం ఏది ? ఇతర దేశాల చెత్త ఆ దేశానికి ఎందుకు ? అసలు చెత్త షార్టేజ్ రావడం ఏంటి ? చెత్తతో ఆ దేశం ఏం చేస్తోంది ? తెలుసుకోవాలని ఉందా..

స్వీడన్
స్కాండినేవియన్ దేశం అయిన స్వీడన్ కి చెత్త కరువు వచ్చింది. దీంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.

రీసైక్లింగ్
స్వీడన్ చాలా అద్భుతమైన ఉపాయం వెతుక్కుంది. దేశంలో ఎక్కడచూసినా కుప్పలుగా పేరుకుపోయే చెత్తను రీసైక్లింగ్ కి ఉపయోగిస్తుంది. దీంతో మనదేశంలో లాగే చెత్త పెరిగిపోకుండా.. కరువు రావడానికి కారణమైంది.

ట్యాక్స్
శిలాజ వనరులతో విద్యుత్ ఉత్పాదన లేకుండా స్వీడన్ ప్రభుత్వం 1991లో ఓ చట్టం తీసుకొచ్చింది. దీంతో 1991లో శిలాజ ఇంధనంపై హెవీ ట్యాక్స్ విధించిన మొదటి దేశం స్వీడన్. అప్పటినుంచి నీరు, చెత్త ద్వారానే కరెంటు ఉత్పత్తి చేస్తారు.

విద్యుత్
ఇలా ఎక్కువ ట్యాక్స్ విధిస్తుండటంతో విద్యుత్ ఉత్పత్తికి నవీకరణాలను గుర్తించే పనిలో పడింది స్వీడన్.

అద్భుతమైన ఐడియా
స్వీడన్ లో దాదాపు చాలా ప్రాంతాలకు విద్యుత్ ని రీసైక్లింగ్ ద్వారా ఉత్పత్తి చేస్తుంది. అది కూడా చెత్త ద్వారానే విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.

1 శాతం మాత్రమే
గతేడాది ఇళ్ల నుంచి వచ్చిన మొత్తం చెత్తలో కేవలం 1 శాతం మాత్రమే డంపింగ్ యార్డులకు తరలించారు. అంటే మిగిలిన చెత్తనంతటినీ రిసైక్లింగే ఉపయోగించారన్నమాట.

ప్రైవేటు సంస్థలు
స్వీడన్ కొహెసివ్ నేషనల్ రీసైక్లింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగస్వాములుగా ఉండే ప్రైవేట్ సంస్థలు చెత్తను దిగుమతి చేసుకుని దాన్ని మండించడం ద్వారా ఉత్పత్తి అయిన వేడిని నేషనల్ హీటింగ్ నెట్‌వర్క్‌కు అనుసంధానం చేస్తాయి.

హీటింగ్ నెట్ వర్క్
చలికాలంలో చాలా తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఆ సమయంలో ఒక్కో ఇంట్లో హీటర్లు పెట్టుకునే అవసరం లేకుండా.. నేషనల్ హీటింగ్ నెట్ వర్క్ ద్వారా హీట్ ని ప్రతి ఇంటికీ సరఫరా చేస్తారన్నమాట.

చెత్త కరువు
ఇలా రకరకాలుగా చెత్తను ఉపయోగించుకోవడంతో.. దేశంలో ఇళ్ల నుంచి వస్తున్న చెత్త ఏమాత్రం సరిపోవడం లేదట. దీంతో స్వీడన్ వాళ్లు బయటి దేశాల నుంచి చెత్త దిగుమతి చేసుకోవడానికి సిద్ధమైపోయారు.

యూరోపియన్ దేశాల నుంచి
దక్షిణ యూరప్‌లో హీటింగ్ ప్రక్రియ కోసం చెత్తను ఉపయోగించరు. యూరప్‌లో చెత్తను భూమిలో పాతిపెట్టే విధానంపై నిషేధం అమలులో ఉంది. కాబట్టి వారికి చెత్తతో పెద్దగా పని లేదు. దీంతో యూకే లాంటి దేశాల నుంచి చెత్తను దిగుమతి చేసుకుంటోంది స్వీడన్.



Click it and Unblock the Notifications