Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026
రాశిని బట్టి అమ్మాయిలను ఎట్రాక్ చేసే అబ్బాయిల లక్షణాలు..!
అమ్మాయిలు వాళ్ల రాశిని బట్టి అబ్బాయిలో కొన్ని క్వాలిటీలను కోరుకుంటారట. ఇలాంటి లక్షణాలున్న వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని, ఈ క్వాలిటీస్ ఉన్న వ్యక్తితోనే జీవితం పంచుకోవాలని డిసైడ్ అయి ఉంటారట.
మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ? మీ కాబోయే భర్త లేదా భార్య ఎలా ఉంటారు ? వివాహ జీవితానికి ఎంత విలువ ఇస్తారు ? మిమ్మల్ని ఎలా చూసుకుంటారు ? మీ నుంచి ఏం కోరుకుంటారు ? ఇలాంటి ప్రశ్నలు పెళ్లి చేసుకోవాలనుకునే ప్రతి అమ్మాయి, అబ్బాయిని సతమతపెడుతుంటాయి.

జీవితాంతం కలిసుండాల్సిన భర్త లేదా భార్య అలా ఉండాలి.. ఇలా ఉండాలి అని రకరకాల రిక్వైర్ మెంట్స్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. కొంతమంది అందానికి ప్రాధాన్యత ఇస్తే, మరికొందరు లక్షణాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ చూడగానే గుణగణాలు, మెంటాల్టీ తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే రాశులు ఈ విషయంలో కాస్త హెల్ప్ ఫుల్ గా ఉంటాయి.
అమ్మాయిలు వాళ్ల రాశిని బట్టి అబ్బాయిలో కొన్ని క్వాలిటీలను కోరుకుంటారట. ఇలాంటి లక్షణాలున్న వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని, ఈ క్వాలిటీస్ ఉన్న వ్యక్తితోనే జీవితం పంచుకోవాలని డిసైడ్ అయి ఉంటారట. మరి అమ్మాయి రాశిని బట్టి వాళ్ల రిక్వైర్ మెంట్స్ తో మీ అలవాట్లు మ్యాచ్ అవుతాయో లేదో తెలుసుకోండి. మరి అమ్మాయిలు రాశిని బట్టి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని ఇష్టపడతారో తెలుసుకుందాం..

మేష రాశి
మేష రాశి అమ్మాయిలు సాహసికుడిని ఇష్టపడతారు. వీడియో గేమ్స్ ఆడే అబ్బాయిలంటే ఇష్టం. అతను చాలా ఫన్నీగా ఉండాలి. బోరింగ్ గా ఉండకూడదు. చాలా యాక్టివ్ గా, బయటకు వెళ్లడం, ఎంజాయ్ చేసే తత్వం ఉండే వ్యక్తి అయి ఉండాలని కోరుకుంటారు.

వృషభ రాశి
స్వతంత్రంగా, స్థిరంగా ఉండే అబ్బాయిలను వృషభ రాశి అమ్మాయిలు ఇష్టపడతారు. ఈ రాశి అమ్మాయిలు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. అంటే యావరేజ్ అందం కలిగిన అబ్బాయిలను పెళ్లి చేసుకుంటారు. చాలా స్ట్రాంగ్ గా, తెలివైన వ్యక్తి అయి ఉంటే చాలని భావిస్తారు.

మిధున రాశి
బ్యాడ్ బాయ్స్ ని మిధున రాశి అమ్మాయిలు ఇష్టపడతారు. కొన్నిసార్లు సభ్యతలేకుండా, సంస్కారం లేకుండా ప్రవర్తించే అబ్బాయిలను ఇష్టపడతారు. అయితే చాలా స్వచ్ఛమైన మనసు కలిగిన వ్యక్తి అయి ఉంటే చాలని భావిస్తారు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి అబ్బాయిలు చాలా ఎమోషనల్ గా ఉండే అబ్బాయి కావాలనుకుంటారు. ఎందుకంటే తన ఫీలింగ్స్ పై లగ్నం చేసే వ్యక్తి, తన ఎమోషన్స్ ని అర్థం చేసుకోగలిగే వ్యక్తి అయితే.. తనను బాగా ప్రేమిస్తాడని భావిస్తుంది.

సింహ రాశి
సింహ రాశి అమ్మాయిలు స్పాట్ లైట్ గా ఉంటారు. కాబట్టి తనకు సెక్యూర్ గా, సపోర్టివ్ గా ఉండే వ్యక్తి భాగస్వామిగా కావాలనుకుంటారు.

కన్యా రాశి
కన్యా రాశి అమ్మాయిలు తన స్వభావంతో కలిసిపోయే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. తన భాగస్వామి సెన్సిటివ్ గా, స్మార్ట్ గా ఉండాలనుకుంటుంది. తన భార్య కోసం కాంప్రమైజ్ అవడానికి రెడీగా ఉండే వ్యక్తి కావాలనుకుంటుంది.

తులా రాశి
తులా రాశి అమ్మాయిలు చాలా సోషల్ గా, ఫన్నీగా ఉండే వ్యక్తిని భాగస్వామిగా కోరుకుంటుంది. బోర్ గా ఉండటాన్ని ఇష్టపడరు. పార్టీలు, బయట తిరుగుతూ గడిపే వ్యక్తిని ఇష్టపడతారు. కానీ మెచ్యూర్ గా ఆలోచించాలి, బాధ్యతగా ఉండే అబ్బాయి అయి ఉండాలి. అలాంటి వ్యక్తులనే తులారాశి అమ్మాయిలు ఇష్టపడతారు.

వృశ్చిక రాశి
రొమాన్స్ విషయానికి వస్తే.. వృశ్చిక రాశి వాళ్లు చాలా సాహసోపేతంగా ఉంటారు. కాబట్టి ఈ రాశి అమ్మాయిలు సెక్సువల్ గా యాక్టివ్ గా ఉన్న అబ్బాయిలను ఇష్టపడతారు. తమ భార్యను చాలా అల్లారుముద్దుగా చూసుకునే అబ్బాయిలు తమ భాగస్వామిగా రావాలని ఈ రాశి అమ్మాయిలు కోరుకుంటారు.

ధనస్సు రాశి
ధనస్సు రాశి అమ్మాయిలు ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి వీళ్ల అభిరుచికి తగిన అబ్బాయిల కోసం ఎదురుచూస్తారు. సాహసికుడిగా, ఫన్నీగా ఉండే అబ్బాయిలను ఇష్టపడతారు. బోరింగ్ గా ఉండే అబ్బాయిలు నచ్చరు.

మకర రాశి
మకర రాశి అమ్మాయిలకు క్రియేటివ్ గా ఉండే అబ్బాయిలంటే ఇష్టం. కాబట్టి ఆర్టిస్ట్ లుగా ఉండే అబ్బాయిలను ఇష్టపడతారు. తన భర్త విభిన్నంగా ఉండటాన్ని ఇష్టపడుతుంది. తన స్కిల్స్ ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటుంది.

కుంభ రాశి
కుంభరాశి అమ్మాయిలు చాలా సిగ్గుపడతారు. తన ఫీలింగ్స్, ఎమోషన్స్ కి క్లియర్ గా చెప్పే అబ్బాయి భాగస్వామిగా కావాలని కోరుకుంటుంది.

మీన రాశి
మీన రాశి అమ్మాయిలు కళాత్మక వ్యక్తులను ఇష్టపడతారు. ఒకవేళ మీ భాగస్వామి కళాత్మకమైన వ్యక్తి కాకపోతే.. ఆ వ్యక్తిని ఇష్టపడరు.



Click it and Unblock the Notifications