Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చూపుడు వేలు, ఉంగరపు వేలు సమానంగా ఉంటే దేనికి సంకేతం ?
మనుషులు చాలా క్యూరియస్ గా ఉంటారు. మన గురించి తెలుసుకోవడానికి, ఇతరుల గురించి తెలుసుకోవడానికి, భవిష్యత్ పై అంచనా వేయడానికి చాలా ఆసక్తి చూపుతాం. జ్యోతిష్యుల ప్రకారం మనుషులు శారీరకంగా కనిపించేదాన్ని బట్టి.. వాళ్ల స్వభావం ఆదారపడి ఉంటుందని చెబుతారు. మన శరీరంలోని ప్రతి పార్ట్ ద్వారా మన పర్సనాలిటీని అంచనా వేయవచ్చు.

ఒక వ్యక్తి స్వభావం తెలుసుకోవడానికి వాళ్ల కళ్లు, ముక్కు, చేతుల ఆకారం, చేతి రేఖలు చూస్తే చాలని చాలా స్టడీస్ తెలిపాయి. అయితే తాజా మరో ఇంట్రెస్టింగ్ థింగ్ వెలుగులోకి వచ్చింది. చేతివేళ్ల సైజుని బట్టి.. మన వ్యక్తిత్వం గురించి, ఇతరుల స్వభావం గురించి తెలుసుకోవచ్చని తాజా అధ్యయనాలు రివీల్ చేస్తున్నాయి. మరి మీ చేతి వేళ్లలో దాగున్న పర్సనాలిటీ సీక్రెట్స్ ఏంటో చూసేద్దామా..
చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి ఒక వ్యక్తి స్వభావం అంచనా వేయవచ్చని పామ్ రీడర్స్ చెబుతున్నారు. అంతేకాదు.. ఒక్క చూపుడు వేలు ఆధారంగానే.. మనుషుల గురించి అనేక విషయాలు తెలుసుకోవచ్చని ఈ స్టడీస్ చెబుతున్నాయి.

డామినేట్ చేసే స్వభావం
సాధారణంగా అందరికీ మధ్యవేలు అన్నింటిలోకి పొడవుగా ఉంటుంది. కానీ.. మధ్యవేలుకి సమానంగా చూపుడు వేలు పొడవు ఉంటే.. ఆ వ్యక్తి చాలా డామినేటింగ్ గా ఉంటారు. అంతేకాదు వీళ్లు కొంచెం సంస్కారం లేని వాళ్లుగా ప్రవర్తిస్తారు. అహంకారం కలిగి ఉంటారు.

చూపుడు వేలు పొడవు
మధ్యవేలు కంటే.. చూపుడు వేలు పొడవుగా ఉంటే.. వాళ్లు చాలా స్వార్థపూరితంగా ఉంటారు. ఎదుటివాళ్లు ఎంత ముఖ్యమైనవాళ్లు అయినా.. తమ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు.

పొడవు తక్కువ
చూపుడు వేలు సాధారణం కంటే.. మరీ పొడవు తక్కువగా ఉంటే.. ప్రతిష్టాత్మకమైన వ్యక్తి కాదని తెలుపుతుంది. ఎలాంటి కొత్త పని చేసినా.. హ్యాపీగా ఫీలవరు.

ఉంగరపు వేలు కంటే పొడవు
ఒకవేళ ఉంగరపు వేలు కంటే.. చూపుడు వేలు పొడవుగా ఉంటే.. ప్రతిష్టాత్మకమైన వ్యక్తి అని తెలుపుతుంది. చాలా ఉత్తేజంగా ఉండే వీళ్ల స్వభావం కొన్ని సందర్భాల్లో వాళ్ల పనికి అంతరాయం ఏర్పడేలా చేస్తుంది.

ఉంగరపు వేలుకి సమానంగా
ఒకవేళ ఉంగరపు వేలుకి సమానంగా చూపుడు వేలు పొడవు ఉంటే.. చాలా డబ్బు సంపాదించి.. సమాజంలో గౌరవించబడతారు.

చూపుడు వేలు పొట్టిగా ఉంటే
ఒకవేళ ఉంగరపు వేలు కంటే.. చూపుడు వేలు పొట్టిగా ఉంటే.. ఎలాంటి సందర్భంలోనైనా, పరిస్థితిలోనైనా ఓర్పు, సహనం కలిగి ఉంటారు. హ్యాపీగా, లక్కీగా ఉంటారు.

చిటికెన వేలు
ఒకవేళ చిటికెన వేలు.. చూపుడు వేలు నెయిల్ కి తగిలింది అంటే.. అలాంటి వాళ్లు మంచి వ్రైటర్స్, నటులు అవుతారు.

చూపుడు వేలు, చిటికెన వేలు
ఒకవేళ చూపుడు వేలు, చిటికెన వేలు ఒకే పొడవు ఉంటే.. అలాంటి వాళ్లు చాలా షార్ప్ గా ఉంటారు. చాలా ప్రణాళికాబద్ధంగా ఉంటారు. అంతేకాదు మంచి రాజకీయవేత్తలు అవుతారు.

అదృష్టం
ఒక వ్యక్తి చూపుడు వేలు పొడవుగా, పలుచగా, సరైన ఆకారం కలిగి ఉంటే.. ఆ వ్యక్తి జీవితంలో చాలా అదృష్టవంతులవుతారు. ఒకవేళ చిటికెన వేలు కంటే.. చూపుడు వేలు సన్నగా ఉంటే.. దురదృష్టానికి సంకేతం.



Click it and Unblock the Notifications