కాఫీ లవర్స్ తప్పకుండా టేస్ట్ చేయాల్సిన డిఫరెంట్ కాఫీలు..

అంతేనా...ఇంకేం కావాలి? కుదరితే కప్పు కాఫీ...వీలైతే నాలుగు మాటలు' ఈ డైలాగ్ గుర్తుండే ఉంటుంది.? ఎందుకంటే నిద్రలేస్తానే మనకు కావల్సిందే ఇదే కదా?! మన నిత్య జీవితంలో ఒక బాగమైపోయింది కాదూ! ఉదయం నిద్రలేవగానే బెడ్ కాఫీ కావాల్సిందే..! వర్క్ ప్రెజర్, టెన్షన్స్, చిరాగ్గా ఉన్నా, తలనొప్పిగా ఉన్నా ఒక కప్పు వేడి వేడి కాఫి పడితే కానీ మూడ్ సెట్టవ్వదు..

ఎవరితోనైనా అలా సరదాగా కబుర్లు చెప్పాలన్నా..మీటింగ్స్ లో మాట్లాడుకోవాలన్నా ముందుగా గుర్తొచ్చేది వేడి వేడి కమ్మని కాఫీనే..అంతెందుకు కొత్త సినిమా రిలీజైందా ? 'మంచి కాఫీలాంటి సినిమా' అయితేనే చూద్దాం..! ఇలా ఎవరికి తోచిన విధంగా వారి కాఫీతో ముడిపెట్టి చెబుతుంటారు. ఒక రకంగా చెప్పాలంటే కాపీ లేనిది..జీవితం లేదు. కనీసం కొదరికైనా ..! కాఫీ పేరు వినగానే నాలుకు జివ్వుని లాగేస్తుంది. ఆరోగ్యానికి మంచిదే అని కొందరు , కాదని మరికొందరు..అదని ఇదనీ ఎవరెన్ని చెప్పినా...కాఫీ రుచి నాలుకకుతగలగానే అవన్నీ మర్చిపోతాం..మనల్ని మనం మైమరిచిపోతాం...అంత శక్తి ఉంది మరి ఈ కాఫీకి.

ఇంతకు ముందు కాఫీ అంటే కేవలం ఇన్ స్టంట్ కాఫీ, లేదా ఫిల్టర్ కాఫీ ఈ రెండు రుచులే మరి ఒప్పుడో? కోరినన్ని కాఫీ రుచులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకమైన కాఫీల కోసం స్పెషల్ కేఫ్ లో దర్శనమిస్తుంటాయి . కోరినన్ని ఫ్లేవర్స్ ...సిప్పు సిప్పుకీ కప్పుల కొద్దీ మాజా మజా..! ఇంతకీ కాఫీలో ఆ వెరైటీ టేస్టులేంటో ఓ లుక్కేద్దాం..

ఎన్ ప్రెసో

ఎన్ ప్రెసో

కాఫీ షాపుల మెనులూ పాపులర్ గా ఉండేది ఎన్ ప్రెసోనే. తా.ాగా తయారుచేయడం వెంటనే ఆస్వాధించేలా ఉండేడం దీని పాలపులారిటీకి కారణం. తక్కవు మొత్తంలో బాగా వేడి చేసిన నీటిలో మంచి నాణ్యమైన కాఫీ గింజలు వేస్తే ఎన్ ప్రెసో తయారవుతుంది. స్ట్రాంగ్ ఫీల్ కోరుకునే వారుకి ఎన్ ప్రెసోనిప్రిఫరర్ చేయవచ్చు. వివిధ రకాల కాఫీల తయారీకి దీన్ని బేస్ గా ఉపయోగిస్తుంటారు.

బ్లాక్ కాఫీ లేదా బ్రూడ్ కాఫీ :

బ్లాక్ కాఫీ లేదా బ్రూడ్ కాఫీ :

కాఫీ గింజలపై వేడి నీరు పడేలా చేసి, వచ్చిన డికాషన్ ని కిందున్న ఫిల్టర్ ద్వారా మరో పాత్రలోకి చేర్చుతారు. ఇందులో పాలు కలపకుండా నేరుగా సర్వ్ చేస్తారు. దీని తయారీకి ఇంకో పద్దతి ఉంది. కింది భాగంలో ఫిల్టర్ ఉన్న పాత్రలో కాఫీ గింజలపై వేడి నీరు పోసి కాసేపు అలాగే ఉంచాలి. తర్వాత దాన్ని స్పూన్ తో కలపాలి. అప్పుడు గింజల నుంచి వెలువడే డికాషన్ ఫిల్టర్ కింద పాత్రలోకి చేరుతుంది. వంద గ్రాముల వేడినీటికి ఏడు గ్రాముల కాఫీ చేర్చితే బాగుంటుంది.

అమెరికానో:

అమెరికానో:

ఎన్ ప్రెసోకి మరి కొన్ని వేడినీళ్లు చేర్చితే అమెరికానో తయారవుతుంది. దీనికి కలిపే నీటిని బట్టి రుచి, గాడత మారుతాయి. ఎన్ ప్రెసో మరీ స్ట్రాంగ్ గా అనిపించేవారికి కోసం దీనికి వేడినీటిని చేర్చి లైట్ గా తయారుచేయడం దీని ప్రత్యేకత. నచ్చిన ఫ్లేవర్స్ కూడా ఇందులో చేర్చవచ్చు.

కాపచినో:

కాపచినో:

ఎస్ స్రెసో కాఫీ, స్టీమ్డ్ మిక్క్, మిల్క్ ఫోమ్ మూడు సమపాళ్లలో తీసుకుని కలిపితే ఏర్పడేదే కాపచినో.

మాఖియాటో:

మాఖియాటో:

ఎన్ ప్రెసో కాఫీపై ఏదైనా గుర్గు, డిజైన్ ని వేస్తే దాని మాఖియాటో అంటారు. కొద్ది పాళ్ల స్టీమ్డ్ మిల్క్ లేదా మిల్క్ ఫోమ్ తో ఈ డిజైన్లను చేస్తారు.

లాటే:

లాటే:

మూడు వంతుల వేడి పాలకు ఒక వంతు ఎస్ ప్రెసో కాఫీ కలిపితే ఏర్పడేదే లాటే. ఇది లైట్ గా ఉంటుంది. కాఫీ గాఢత తక్కువగా ఉండి పాలు ఎక్కుగా ఉంటాయి. అందుకే దీన్ని మిల్క్ కాఫీ అంటారు. మరీ స్ట్రాంగ్ గా కాకుండా క్లాసిక్ రుచి కావాలనుకునే వారు దీనిని ప్రిపర్ చేయవచ్చు.

కాఫెఓలే:

కాఫెఓలే:

ఇది ఇంచుమించు లాటేలాగనే ఉంటుంది. కాకపోతే అక్కడ పాలకు ఎన్ ప్రెసో కాఫీ కలుపుతారు. ఈ విధానంలో పాలకు బ్రూడ్ కాఫీ చేర్చుతారు. బ్రూడ్ కాఫీ, పాలు రెండూ సమపాళ్లలో తీసుకోవల్సి ఉంటుంది.

మోక:

మోక:

కాఫీ చాక్ లెట్ రెండింటి మిశ్రమంతో ఏర్పడేదే మోకా కాఫీ. ఎస్ ప్రెసోకి వేడి చాక్లెట్, స్టీమ్డ్ మిల్క్ కలపడం ద్వారా మోకుహ్ కాఫీ తయారవుతుంది.

ఫిల్టర్ కాఫీ:

ఫిల్టర్ కాఫీ:

ఇది మనలో చాలా మందికి పరిచయం ఉన్నదే. బాగా వేయించిన కాఫీ గింజలను ఫిల్టర్ లోని వేడి నీటిలో కొన్ని గంటలపాటు నానబెట్టి ఉంచాలి. ఫిల్టర్ నుంచి కింది పాత్రలోకి కాఫీ డికాషన్ వచ్చి చేరుతుంది. దీనికి వేడి వేడి పాలు చేర్చితే ఫిల్టర్ కాఫీ రెడీ.

ఐరిష్ కాఫీ:

ఐరిష్ కాఫీ:

వేడి వేడి కాఫీ , ఐరిష్ విస్కీ, పంచదార మిశ్రమంతో దీన్ని తయారుచేస్తారు. కాఫీ తయారైన తర్వాత దీనికి పైన మందంగా ఉండే క్రీం చేర్చాలి. దీన్ని శీతాకాలంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.

ఎన్ ప్రెసో కాన్ పనా:

ఎన్ ప్రెసో కాన్ పనా:

ఎన్ ప్రెసో కాఫీకి స్వీట్ క్రీమ్ చేర్చితే ఏర్పడే దే ఎన్ ప్రెసో కాన్ పనా..

అఫొగాటో:

అఫొగాటో:

ఎన్ ప్రెసో కాఫీకి ఐస్ క్రీం చేర్చడం వల్ల తయారయ్యేదే అఫోగాటో కాఫీ..'

White కాఫీ

White కాఫీ

ఈ ఫేమస్ కాఫీ ఒరిజినల్ గా మలేషియాలో పుట్టింది . ఈ కాఫీని బీన్ ను పామాయిల్ లో రోస్ట్ చేసి తర్వాత తయారుచేస్తారు . ఈ రకమైన కాఫీకి వెన్న తీసిన పాలు మరియు పంచదార వేస్తారు.

కాఫీలో ఎన్నిరుచులున్నాయో...

కాఫీలో ఎన్నిరుచులున్నాయో...

చూశారుగా..కాఫీలో ఎన్నిరుచులున్నాయో...ఇవన్నీ చూస్తుంటే కాఫీల్లో ఉండే వెరైటీలన్నీ వెంటనే టేస్ట్ చేయాలనిపిస్తుంది కాదూ..!మరింకెందుకు ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గర్లో ఉన్న కాఫీ హౌస్ కి వెళ్లి మీకు నచ్చిన కాఫీతో మాన్ సూన్ ఎంజాయ్ చేయండి.

Desktop Bottom Promotion