Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎక్కడా కనీవినీ ఎరుగని ప్రపంచంలోనే అత్యంత వింతైన మ్యూజియమ్స్
మ్యూజియమ్స్ అంటే చరిత్రకు ఆనవాళ్లు, పురాతన వస్తువులకు నెలవుగా ఉంటుంది. అప్పటి విశేషాలను తర్వాతి తరాలకు వివరించడానికి ఆ కాలంలో ఉపయోగించిన వస్తువులు, నాణేలు, ఆభరణాలు, తుపాకీలు వంటి వాటిని ఏర్పాటు చేస్తారు. వాటిని చూడటం ద్వారా అప్పటి కళాత్మకత, వాళ్ల అభిరుచులు, లైఫ్ స్టైల్ అన్నీ ఒక అవగాహనకు వస్తాయి.
షాక్..!! ప్రపంచంలోనే అతి పెద్ద సింక్హోల్స్ ( అగాధాలు )..
విభిన్నమైన వస్తువులు, ఆనవాళ్లను భద్రంగా దాచిపెట్టడానికి ఈ మ్యాజియం పేరుతో అమర్చుతారు. అయితే.. మీరు క్రేజీ, భయంకరమైన మ్యూజియమ్స్ గురించి ఆలోచిస్తే.. విస్తుపోతారు. ఎందుకంటే.. ప్రపంచంలోనే అత్యంత వింతైన మ్యూజియమ్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.
మీరు ఆశ్చర్యపోయే భయంకరమైన ఫేస్ టాటూలు.. !!
మీరు గతంలో కనీవినీ ఎరుగని అసాధారణమైన మ్యూజియమ్స్ ని మీకు పరిచయం చేయబోతున్నాం. కొన్ని మ్యూజిమ్లలో అత్యంత భయంకరమైన, వింతైన వస్తువులు సందర్శకులు చూడటానికి ఏర్పాటు చేశారు. మరి అలాంటి వింత మ్యూజియమ్స్ చూడాలని ఉందా.. అయితే వెంటనే కింద స్లైడ్స్ క్లిక్ చేయండి..

టాయిలెట్స్ కోసం మ్యూజియం !
ఇదెక్కడి విడ్డూరం అనుకుంటున్నారా ? టాయిలెట్ల కోసం మ్యూజియం ఏర్పాటు చేయడం ఏంటి అని వాపోతున్నారా ? నిజమే.. ఈ టాయిలెట్ మ్యూజియం ఎక్కడో కాదు మన ఇండియాలోనే ఉంది. 4 వేల 500 సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్న టాయిలెట్స్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాదు.. ఒక్కో టాయిలెట్ కి సంబంధించి వివరణ కూడా ఉంటుందట.
Image Courtesy

బ్యాడ్ ఆర్ట్
మ్యూజియమ్ ఆఫ్ బ్యాడ్ ఆర్ట్.. దీన్నే మోబా (MOBA) అని పిలుస్తారు. అద్భుతమైన ఫోటోగ్రాఫ్స్ ని మ్యూజియమ్స్ లో ఏర్పాటు చేయడం కామన్. కానీ.. బ్యాడ్ ఆర్ట్స్ ని ఇక్కడ ప్రదర్శించడం ఈ మోబా మ్యూజియం స్పెషల్. మీరు అద్భుతంగా పెయింటింగ్ వేయలేకపోయినా.. ఎంకరేజ్ చేస్తుంది ఈ మ్యూజియం.
Image Courtesy

రష్యా
ఈ మ్యూజియంలో ప్రదర్శించే ప్రతి ఒక్కటీ క్రేజీగానే ఉంటాయి. వైకల్యంతో ఉండే మనుషుల పిండాన్ని వెనిగర్ లో ఉంచుతారు. ఇలా ఉంచిన తలలు చాలా భయంకరంగా ఉంటాయి
Image Courtesy

హెయిర్ మ్యూజియం
ఇది అత్యంత భయంకరమైన మ్యూజియం. దీన్ని చీకటిగా ఉండే ఒక గుహలో ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 16 వేల మంది మహిళల జుట్టుని కలెక్ట్ చేసి.. ఇక్కడ సందర్శనకు ఉంచారు.
Image Courtesy

క్రిప్టో మ్యూజియం
ఇక్కడ అన్నీ మనుషుల్లా, జంతువుల్లా ఉంటాయి. కానీ.. అవన్నీ క్రియేట్ చేసినవే. చూడ్డానికి మాత్రం నిజమైన జంతువుల మాదిరిగా కనిపిస్తాయి. హెయిర్, మనుషుల ప్రతి అవయవంతో.. అద్భుతంగా క్రియేట్ చేసి ఉంటారు.
Image Courtesy

టార్చర్ పరికరాలు
ఇదో భయంకరమైన మ్యూజియం. ఇక్కడ 100కు పైగా టార్చర్ పరికరాలు ఉంటాయి. కొన్ని పరికరాలను చూస్తే.. వెంటనే వాటి గురించి అర్థమవుతుంది. కానీ.. కొన్ని ఏమాత్రం అర్థం కావు. కొన్ని తలపై గీకడం, మరికొన్ని వెనక నుంచి కొట్టడం వంటి వింత పనులు చేస్తాయి.
Image Courtesy

ముళ్ల తంతి మ్యూజియం
ముళ్ల కంచె మ్యూజియం గురించి విన్నారా ? క్రేజీగా ఉంది కదూ. ఇక్కడ 2400 కంటే ఎక్కువ ముళ్ల కంచెలు ఉంటాయి. ఈ మ్యూజియం యునైటెడ్ స్టేట్స్ లో ఉంది.
Image Courtesy



Click it and Unblock the Notifications