Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సమ్మర్ లో పుట్టారా ? వింటర్ లో పుట్టారా ? సీజన్ ని బట్టి వ్యక్తిత్వం..!
మీరు పుట్టిన సీజన్ కూడా.. మీ వ్యక్తిత్వాన్ని, తలరాతను తెలుపుతుందని.. ఎప్పుడైనా ఊహించారా ? అవును ఎండాకాలం, చలికాలం, గాలికాలం.. ఇలా ఏ సీజన్ లో పుట్టిన వాళ్ల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ?
ప్రతి సంప్రదాయంలోనూ తలరాతను నమ్ముతారు. అలాగే తలరాత రాశులకు, గ్రహాలతో సంబంధం కలిగి ఉందని కూడా నమ్ముతారు. అలాంటివే కాకుండా.. మీరు పుట్టిన సీజన్ కూడా.. మీ వ్యక్తిత్వాన్ని, తలరాతను తెలుపుతుందని.. ఎప్పుడైనా ఊహించారా ?

అవును ఎండాకాలం, చలికాలం, గాలికాలం.. ఇలా ఏ సీజన్ లో పుట్టిన వాళ్ల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే దానికి కనెక్ట్ అయి ఉంటుందని తాజా అధ్యయనాలు నిరూపిస్తున్నారు. హంగేరీలోని సెమ్మిల్వెస్ యూనివర్సిటీ 400 మందిపై రీసెర్చ్ చేసింది. ఒక వ్యక్తి పుట్టిన సీజన్, వాళ్ల పర్సనాలిటీ మధ్య కనెక్షన్ ఉంటుందని కనుగొన్నారు. మరి మీరు పుట్టిన సీజన్ తో మీ వ్యక్తిత్వం కనెక్ట్ అయిందో లేదో తెలుసుకోండి..

బ్రెయిన్ యాక్టివిటీ
పుట్టిన సీజన్ ఒక వ్యక్తి బ్రెయిన్ యాక్టివిటీపై ప్రభావం చూపుతుందని, అలాగే కొన్ని సమస్యలు, వ్యాధులు కూడా.. సీజన్ ని వచ్చే అవకాశం ఉంటుందని ఈ స్టడీస్ తేల్చి చెబుతున్నాయి.

సమ్మర్ (ఎండాకాలం)
సమ్మర్ లో పుట్టిన వాళ్లలో చాలా తరచుగా, వేగంగా మూడ్ లో మార్పులు వస్తుంటాయి. మానసిక కల్లోలానికి గురవుతుంటారు. అయితే వీళ్లకు హై లెవెల్స్ లో ఎనర్జీ ఉంటుంది.

వింటర్ (చలికాలం)
చలికాలం పుట్టినవాళ్లు చాలా అనుకూలమైన, ప్రశాంతమైన స్వభావం కలిగి ఉంటారు. వీళ్లు అంత తేలికగా మనుషులను నమ్మరు. అలాగే అంత తేలికగా విసుగు, కోపం రాదు.

రెయినీ సీజన్ (వర్షాకాలం)
వర్షాకాలంలో పుట్టినవాళ్లు ఖ్యాతి పొందడానికి తాపత్రయపడతారు. అలాగే తొందరగా భావోద్వేగానికి లోనవుతారు. సరదాగా గడపడాన్ని ఇష్టపడతారు. రహస్యాలు తెలుసుకోవడం ఆసక్తికరం. తొందరగా బాధపడతారు. నమ్మినవాళ్లు మోసం చేస్తే.. వాళ్లను అసహ్యించుకుంటారు.

వసంత రుతువు (చిగురించే కాలం)
వసంత రుతువు సీజన్ లో పుట్టిన వాళ్లు జీవితంపై ఆశావాదం కలిగి ఉంటారు. మార్చి 1 నుంచి మే 1 వరకు ఉండేది వసంత రుతువు. ఈ సీజన్ లో పుట్టిన వాళ్లు లేజీగా ఉండటాన్ని ఏమాత్రం ఇష్టపడరు. చాలా యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉంటారు.

శరదృతువు ( గాలి కాలం)
శరదృతువు సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 1వరకు ఉంటుంది. ఈ సీజన్ లో పుట్టినవాళ్లు ఒత్తిడికి గురయ్యే అవకాశాలుంటాయి. డిప్రెషన్ లో ఉండవచ్చు. కానీ వీళ్ల స్వభావం మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది.

ఉదయం 8నుంచి, మధ్యాహం 12మధ్య
ఉదయం 8నుంచి, మధ్యాహం 12మధ్య పుట్టిన వాళ్లు చాలా ఆశావాదులుగా ఉంటారు. వీళ్లు ఫిలాసఫర్స్ కూడా.

మధ్యాహ్నం 12 నుంచి 4మధ్య
మధ్యాహ్నం 12 నుంచి 4మధ్య పుట్టిన వాళ్లు చాలా క్రియేటివ్ గా ఉంటారు. త్వరగా కలిసిపోయే తత్వం ఉంటుంది.

4 నుంచి 8 మధ్య
సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య పుట్టినవాళ్లు చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు.

రాత్రి 8 నుంచి మధ్యరాత్రి
రాత్రి 8 నుంచి మిడ్ నైట్ మధ్యలో పుట్టినవాళ్లు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. లోన్లీగా ఉండే అవకాశాలుంటాయి.

మధ్యరాత్రి నుంచి ఉదయం 4గంటల లోపు
మధ్యారాత్రి తర్వాత, ఉదయం 4గంటలలోపు పుట్టినవాళ్లు చాలా సున్నితంగా, ఊహాత్మకంగా, నమ్మకంగా ఉంటారు. రియాలిటీతో డీల్ చేయడం కొన్నిసార్లు వీళ్లకు ఇబ్బందిగా మారుతుంది.



Click it and Unblock the Notifications