Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హగ్గింగ్ స్టైల్ బట్టి, ఎదుటివారి వ్యక్తిత్వాన్నితెలుసుకోవచ్చు..!!
సాధారణంగా ఎవరికి బాధ కలిగినా దగ్గరున్నవారిని కౌగలించుకుని ఏడుస్తారు. అదే అలవాటు పిల్లల్లో కూడా మనం తరచుగా చూస్తూవుంటాం. ఇదొక అసంకల్పిత చర్య. అలా చేయడం వల్ల మనసు క్షణాల్లో కుదుటపడుతుంది. ఆనందం వచ్చినా, విషాదం కలిగినా ఒకరినొకరు హత్తుకోవడంలో ఎంతో స్వాతన ఏర్పడుతుంది. అయితే ఈ హత్తుకునే ప్రక్రియలో మరిన్ని లాభాలు కూడా ఉన్నాయి.ఎవరైనా ఆప్యాయతతో హత్తుకుంటే చాలు మెమరీ పవర్ పెరగడంతో పాటు ఒత్తిడి మటుమాయం అవుతుందని వియన్నా యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది. ఆస్ట్రియాలోని వియన్నా యూనివర్శిటీ శాస్త్ర వేత్తలు శరీరంలో పిట్యూటరీ గ్రంథితో ఏర్పడే హర్మోన్ల ఆక్సిడెంట్ల మీద కొన్ని పరిశోధనలు జరిపారు.
హగ్(ఆలింగనం)చేసుకోవటం వల్ల కలిగే 12 ఆరోగ్య ప్రయోజనాలు
ఇం దులో స్నేహితులు, సహోదరులు, బంధువులు, ప్రేమికులు ఆప్యాయతతో హత్తుకుంటే.. రక్తపోటు తగ్గిందని తేలింది. అంతేగాకుండా మెమరీ పవర్ పెరుగుతుందని, ఒత్తిడి దూరమవుతుందని తెలిసింది. అయితే మనకు పరిచయం లేని వారు గానీ, ఇష్టం లేని వ్యక్తులు గానీ హత్తుకున్నా, కౌగిలించుకున్నా ఫలితాలు పూర్తిగా ప్రతికూలంగా వస్తున్నాయట. దీనిపై వియన్నా యూని వర్శిటీ శాస్తవ్రేత్త, పిల్లల్ని హత్తుకునేటప్పుడు, దంపతులు హత్తుకునేటప్పుడు మాత్రమే పరస్పర నమ్మకంతో రక్తపోటు తగ్గడంతో పాటు మెమరీ పవర్ పెరుగుతుం దని తెలియవచ్చిందన్నారు. పరిచయం లేని వారు హత్తుకుంటే వ్యతిరేక ఫలితాలు నమోదవుతున్నట్లు ఆయన వెల్లడించారు.
మీ భాగస్వామిని కౌగిలించుకోవటానికి 10 కారణాలు
మరి మీకు హగ్ చేసే అలవాటుందా? అలవాటున్నట్లైతే ఏవిధంగా హాగ్ చేసుకుంటారు? హగ్ చేసుకోవడంలో కూడా వివిధ రకాలున్నాయి. వ్యక్తులు ఒకరికొకరు హగ్ చేసుకునే విధానంను బట్ట వారి వ్యక్తిత్వం అంచనా వేయవచ్చు. ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో హాగ్ అనేది కామన్ థింగ్, అయితే ఒక్కోవ్యక్తిని కలిసినప్పుడు ఒక్కో విధమైన డిఫరెంట్ హగ్ చేస్తుంటారు. హగ్ చేసే విధానంలో టైట్ గా.. లేదా లూజ్ గా చేసుకునే విధానం బట్టి కూడా ఎదుటివారి పర్సనాలిటిని తెలుసుకోవచ్చు. మరి మీరు హగ్ చేసే విధానం బట్టి మీరు ఎలాంటి వారు తెలుసుకోవడానికి మీరు రెడీనా....

ప్రొటక్టర్:
వెనుక నుండి హగ్ చేసుకోవడం వల్ల ఒక నమ్మకం ఉంటుంది. ఈ రకమైన హగ్ చేసే వారు ఎదుటి వ్యక్తిని పూర్తిగా నమ్ముతున్నాడు. మరియు అతను మీతో జీవించడానికి సంతోషపడుతున్నాడు.

ట్యాప్ హగ్ :
టాప్ హగ్ అంటే , ఇది స్నేహితులు మన ఆప్తులకు ఇచ్చే ఆలింగనం . ఈ హంగ్ వల్ల ఎదుటివారిలో ఎలాంటి రొమాంటిక్ లేదా సెక్సువల్ ఫీలింగ్స్ ఉండవు.

రాగ్ డాల్ :
రాగ్ డాల్ హగ్ స్టైల్ . ఈ స్టైల్ ఆఫ్ హగ్ చేసేవారు, వన్ సైడ్ రిలేషన్ షిప్ కలిగి ఉంటారు. ఎదుటివారు, చాలా ఘాడంగా హగ్ చేసుకున్నప్పుడు ఎదుటి వారిలో ఎలాంటి రియాక్షన్ ఉండదు, కానీ హగ్ చేసుకునే వారు మాత్రం వన్ సైడ్ రిలేషన్ కలిగి ఉన్నట్లు.

నడుము చుట్టు చేతులు వేసుకుని హాగ్ చేయడం:
నడుము చుట్టు చేతులు వేసి హగ్ చేయడం వల్ల, వారిలో మీరు సెక్యురిటీని మరియు సౌకర్యాన్ని అందిస్తార్న భరోసా కల్పిస్తారని అర్థం.

నేరుగా కళ్ళలోకి చూస్తూ హాగ్ చేయడం :
కొత్త మంది ఎదుటి వారి కళ్ళలోకి నేరుగా చూస్తూ హాగ్ చేస్తుంటారు. అలాంటి వారి వ్యక్తిత్వం ఎదుటి వారితో జీవితం పంచుకోవాలని కోరిక , ఫిజికల్ ఫీలింగ్ ను కలిగి ఉంటుంది. అంటే సోల్ తో వారికి దగ్గరవుతున్నట్లు.

చేతుల భుజాల మీద వేస్తూ హగ్ చేయడం:
ఎదుటి వారి భుజాల మీద చేతులేస్తూ హగ్ చేసుకోవడం, వారి స్నేహాన్ని మరింత స్ట్రాంగ్ గా తెలుపుతుంది. అంటే ఇతరులతో మీరు గట్టిగా నమ్ముతున్నట్లు తెలుపుతుంది . అయితే లవర్ గా కాదు, ఒక మంచి స్నేహితులు అని తెలపడానికి ఇది చిహ్నం.

రబ్ చేస్తూ హగ్ చేయడం :
ఎదుటి వారిని హగ్ చేసుకున్నప్పుడు వారి వెన్ను తట్టడం లేదా రబ్ చేయడం వల్ల వారికోసం మీరున్నారన్న భరోసా కలిగిస్తుంది. బాధలను, కష్టలను, సంతోషాలను పంచుకోవడం కోసం మీరురొక్కరున్నారని అర్థం.

ప్యాకెట్ మీద హ్యాడ్ వేసి హాగ్ చేసుకోవడం :
పార్ట్నర్ ను హగ్ చేసుకున్నప్పుడు వారి చేతులు ఎదుటి వారి ప్యాకెట్ మీద ఉన్నట్లైతే , మీరు చాలా రిలాక్స్డ్ గా మరియు కంఫ్టర్టబుల్ గా ఉన్నట్లు మీ పార్ట్నర్ భావిస్తారు.

హగ్ చేస్తు డ్యాన్స్ చేయడం :
హగ్ చేసి, చిన్నగా మూవ్ అవుతుంట, ఇద్దరూ ట్రూ లవ్ లో ఉన్నట్లు.

వెరీ టైట్ గా హగ్ చేసుకోవడం:
అంటే పెయిన్ ఫుల్ హగ్గింగ్ కాదు, ప్రేమతో ఎదుటి వ్యక్తిని చాలా టైట్ గా హగ్ చేసుకుంటే, వారిని మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారని, ఇష్టపడుతున్నారని, మీ నుండి వారిని దూరం చేసుకోనివ్వరిని తెలుపుతుంది.

దూరంలో ఉండే హాగ్ చేయడం:
దూరంలో ఉండే హగ్ చేసి డిస్టన్స్ మెయింటైన్ చేయడం , ఎదుటి వ్యక్తులు పూర్తిగా టచ్ కాకుండా హగ్ చేస్తుంటారు. అలాంటిప్పుడు మీరు వారి ఇష్టంలేకున్నా హగ్ చేసుకున్నట్లు అర్థం.

ఒకరి మీద కూర్చొని హగ్ ఇవ్వడం :
హగ్ ఇవ్వడంలో వివిధ రకాలున్నాయి. వాటిలో ఇది చాలా డిఫరెంట్, హగ్ ఇచ్చే సమయంలో ఒకరి మీద కూర్చొని హగ్ ఇవ్వడం ప్యాషన్ లేదా ఇష్టం లేదా లవ్ కాదు. ఈ విషయాలను దాటి మరికాస్త ముందుకెళ్లి ఫిజికల్ అట్రాక్షన్ కోరుతున్నట్లు.



Click it and Unblock the Notifications