యమలోకంలో అనుభవించే భయంకరమైన చిత్రహింసలు..!

By Swathi

స్వర్గం, నరకం అనేవి మనం తరచుగా వినే పదాలు. నిజాయితీగా, మానవత్వంతో బతికినవాళ్లు స్వర్గానికి, పాపాలు, చెడు పనులు చేసిన వాళ్లు నరకానికి వెళ్తారని నమ్ముతాం. అయితే.. నరకంలో విధించే శిక్షలు.. ఎలా ఉంటాయో మనం ఊహించలేం. కానీ.. గరుడ పురాణం నరకంలో విధించే శిక్షలను చాలా క్లియర్ గా వివరించింది.

విష్ణు పురాణంలోని ఒక భాగమే గరుడ పురాణం. విష్ణువు, గరుడ పక్షి మధ్య హిందువులు, హిందూ సంప్రదాయం ప్రకారం చనిపోయిన వాళ్లకు నిర్వహించే అంత్యక్రియలను, మరణం తర్వాత ఎలాంటి శిక్షలకు గురవుతారు అనే విషయాలపై జరిగిన సంభాషణను వివరించారు.

గరుడ పురాణంలోని కొన్ని అధ్యాయాలు.. నరకంలో పాపాత్ములకు విధించే శిక్షల గురించి వివరించాయి. నరకానికి వెళ్లే పాపాత్ములకు విధించే శిక్షలు చాలా భయంకరంగా, క్రూరంగా ఉంటాయని ఈ గరుడ పురాణం హెచ్చరిస్తోంది. నరకంలో యముడు విధించే శిక్షలు ఎలా ఉంటాయో తెలిస్తే.. వణికిపోవాల్సిందే. అసలు పాపాలు చేయకుండా.. ఉండాలన్న ఆలోచన తెప్పించేలా ఉంటాయి.. ఈ శిక్షలు. మరి గరుడ పురాణం ప్రకారం.. నరకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో.. మీరే చూడండి..

అశితపాత్రం

అశితపాత్రం

తమ బాధ్యతను నిర్వర్తించని వాళ్లకు.. ఈ అశితపాత్రం అనే శిక్ష నరకంలో విధించబడుతుంది. పాపం చేసిన వాళ్లు మైకం వచ్చి పడిపోయేంతవరకు.. యమ భటులు కొరడా దెబ్బలు, కత్తిపోట్లతో చిత్రహింసలు పెడతారు.

కుంభీపాకం

కుంభీపాకం

జంతువులను చంపిన వాళ్లకు కుంభీపాకం అనే శిక్ష పడుతుంది. పాపాత్ములను మరుగుతున్న ఆయిల్ లో ఉడికించడం వంటి భయంకరమైన శిక్షకు గురిచేస్తారు.

తమిశ్రాం

తమిశ్రాం

ఇతరుల సంపద దోచుకున్న వాళ్లను తాళ్లతో కట్టేసి.. యమభటులు.. వాళ్లను నరకంలోకి తీసుకొస్తారు. వాళ్లకు రక్తస్రావం అయ్యేంతవరకు కొడతారు, సొమ్మసిల్లి పడిపోయేంతవరకు.. చిత్రహింసలు పెడతారు.

వైతరణి

వైతరణి

తమ పవర్ ని దుర్వినియోగం చేసుకునే పాలకులను.. ఈ నరకంలో పడేస్తారు. మనుషుల మలమూత్రాలు, రక్తం, జుట్టు, ఎముకలు, గోళ్లు, మాంసం.. అన్నింటితో నిండిన నరకంలో.. పాపం చేసిన వాళ్లను పడేస్తారు. ఈ పాపాత్ములు నదిలో ఉన్నవాటిని తింటూ.. అక్కడే గడపాల్సి ఉంటుంది.

విసాసనం

విసాసనం

పేదవాళ్లంటే.. చిన్నచూపు చూసేవాళ్లు, గర్వంతో బతికేవాళ్లను.. ఈ నరకంలోకి లాక్కొనివస్తారు. వాళ్లను పెద్ద పెద్ద కర్రలతో.. యమభటులు చిత్రహింసలు పెడతారు.

కలసూత్రం

కలసూత్రం

తమ పెద్దవాళ్లను గౌరవించని వాళ్లు.. నరకంలో చాలా భయంకరమైన శిక్షలు అనుభవిస్తారు. తట్టుకోలేని వేడి, మంటల చుట్టూ పరుగెత్తాల్సి వస్తుంది.

సల్మలి

సల్మలి

వ్యభిచారం చేసే మగవాళ్లు, ఆడవాళ్లు.. ఇద్దరూ ఈ నరకంలోకి రావాల్సిందే. వాళ్ల జననేంద్రియాలను.. యముడు బాగా వేడిచేసిన ఐరన్ రాడ్ తో.. కట్ చేస్తాడట.

రౌరావం

రౌరావం

ఇతరుల సంపదను ఎంజాయ్ చేసేవాళ్లు, ఇతరుల ఆస్తులను ఉపయోగించుకునేవాళ్లు.. ఈ నరకంలోకి వస్తారు. ఇలాంటి వాళ్లు పాములతో చిత్రహింసలు అనుభవించి.. వాటి ద్వారానే చనిపోతారు.

సరమేయాసనం

సరమేయాసనం

ఆహారాన్ని విషపూరితం చేసేవాళ్లు, వేధించేవాళ్లు, టెర్రరిస్ట్ లు.. ఈ నరకంలో వస్తారు. వేలాది కుక్కలు.. ఈ పాపాత్ములపై ఎటాక్ చేసి.. వాళ్ల శరీరం నుంచి మాంసాన్ని పీక్కు తింటాయి.

 అంధకూపం

అంధకూపం

తమ దగ్గర కావాల్సినన్ని వనరులు ఉన్నప్పటికీ.. ఇతరులకు సహాయం చేయని వాళ్లు.. అంధకూపం అనే నరకంలో శిక్ష అనుభవిస్తారు. పులులు, సింహాలు, గద్ద, విషపూరిత పాములు, ఎండ్రకాయలు.. చాలా చిత్రహింసలకు గురిచేస్తాయి.

సుకరమూఖం

సుకరమూఖం

తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేసేవాళ్లు, పాలనా విధానాన్ని దుర్వినియోగం చేసేవాళ్లు.. ఈ నరకంలో శిక్ష అనుభవిస్తారు. ఇలాంటి పాపాత్ములను తీవ్రంగా కొట్టి.. చంపేస్తారు.

తప్తమూర్తి

తప్తమూర్తి

బంగారం, నగలను దొంగతనం చేసినవాళ్లను.. ఎల్లప్పుడూ మండుతున్న అగ్నిలో పడేస్తారు.

క్రిమీభోజనం

క్రిమీభోజనం

అతిథులను గౌరవించని వాళ్లు, కేవలం తాము లాభం పొందడానికి మాత్రమే మగవాళ్లు, ఆడవాళ్లను ఉపయోగించుకునే వాళ్లను క్రిమిభోజనం నరకంలోకి పడేస్తారు. పురుగులు, క్రిములు, పాములను బతికి ఉండగానే తినాల్సి వస్తుంది.

వజ్రకంతకశాలి

వజ్రకంతకశాలి

సాధారణంగా కాకుండా.. జంతువులతో సెక్స్ చేసేవాళ్లకు.. ఈ నరకంలో శిక్ష పడుతుంది. చాలా పదునుగా ఉండే.. సూదులను.. శరీరం మొత్తం గుచ్చుతారు.

పుయోడకం

పుయోడకం

మహిళలను అనుభవించి మోసం చేసిన మగవాళ్లు, మహిళలతో సంబంధం పెట్టుకుని వాళ్లను పెళ్లిచేసుకోని వాళ్లను.. ఈ పుయోడకం అనే నరకంలో పడేస్తారు. అత్యంత లోతుగా ఉండే.. ఈ బావి మలమూత్రాలు, రక్తం వంటివాటితో చాలా కలుషితమై ఉంటుంది.

ప్రాణరోధం

ప్రాణరోధం

జంతువులను వేటాడి, మాంసం తినేవాళ్లను యమభటులు పట్టుకొచ్చి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి.. తీవ్రంగా హింసిస్తారు.

లాలాభక్షం

లాలాభక్షం

మహిళలపై తీవ్ర దురుసుగా ప్రవర్తించే మగవాళ్లను ఈ నరకంలోకి తీసుకెళ్తారు. తమ వీర్యాన్ని తాగాలని ఆడవాళ్లను హింసించే మగవాళ్లను.. ఈ నరకంలోకి పడేస్తారు. లాలాభక్షం అంటే.. వీర్యంతో కూడిన సముద్రం.

అవిసి

అవిసి

తప్పు సాక్షాలు చెప్పిన వాళ్లు, మాట ఇచ్చి తప్పేవాళ్లు, అపద్ధపు ప్రామిస్ లు చేసేవాళ్లు.. ఈ నరకంలోకి నెట్టబడతారు. చాలా ఎత్తు నుంచి పాపాత్ములను తోసేస్తే.. వాళ్లు గ్రౌండ్ కి చేరేసరికి.. చెత్తగా మారిపోతారు.

అయాహ్పానం

అయాహ్పానం

ఆల్కహాల్ తీసుకునేవాళ్లు, ఇతర మత్తుపానీయాలు సేవించే వాళ్లు.. ఈ నరకంలో వస్తారు. ఇలాంటి పాపం చేసినవాళ్లు.. ఐరన్ ని కరిగించి తీసిన పానీయాన్ని సేవించాల్సి ఉంటుంది.

పర్యావర్తనకం

పర్యావర్తనకం

ఆకలితో ఉన్నవాళ్లకు అన్నం పెట్టని వాళ్లు, ఆకలితో ఉన్నవాళ్లను తిట్టిన వాళ్లు.. ఈ నరకానికి వస్తారు. వీళ్లను.. ప్రాణాంతకమైన పక్షులతో గుచ్చి గుచ్చి చిత్రహింసలకు గురిచేస్తారు.

Desktop Bottom Promotion