For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంతుబట్టని రహస్యాలు: మరణం తర్వాత ఏం జరుగుతుంది..?

|

జీవితంలో మరణం ఒక రహస్యం. ఎందుకంటే మరణించిన తర్వాత ఏజరుగుతుందనేది ప్రతి ఒక్కరిలో ఉండే కన్ఫ్యూజన్. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎప్పుడు ఎవరికి ఏవిధంగా మరణం సంభవిస్తుందో తెలియదు. మరణించేది ఎలాగు తప్పదు. అయితే మరణించాక నేనేమవుతాను అనేది మరో ప్రశ్న! మనకు మరణం ఏ రూపంలోనైనా రావచ్చు. ప్రకృతి రీతిగా మన శరీరం నుండి ఆత్మ వేరై నిత్యత్వంలోకి వెళ్ళి పోతుంది. ఇది అందరికి తెలిసిన విషయమే కాని ఎవరికీ అంతుబట్టని ప్రశ్న ఏమిటంటే. ఆ ఆత్మ ఎక్కడికి పోతుంది?

ఈ లోకంలో మన జీవితం తాత్కాలికం, అశాశ్వతం, మరణమనేది మానవ బ్రతుకులో ఒక భాగం, పుట్టుట గిట్టుట కొరకే అయినా మనకెందుకో గిట్టడం అంటే మహాభయం. దానికి దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తాం. మనం ఎంత భయపడ్డా ఎక్కడికి పారిపోయినా మరణం మాత్రం ఏదో ఒక స్థలంలో కలుసుకుంటుంది. అప్పుడు ఈ లోకంలో మన సంబంధం తెగిపోతుంది. ఇది కఠోర సత్యం. ఈ సత్యాన్ని గూర్చి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఏంటో విచారాన్ని, దుఃఖాన్ని కలిగించే ఈ మరణం అంటే ఏంటి?

అసలు మరణమంటే ఏమిటి? మరణం తర్వాత ఏం జరుగుతుంది. మరణం తర్వాత ఆత్మ ఏమవుతుంది. మరణించిన తర్వాత వారు తిరిగి వస్తారా? లేదా వారు మాట్లాడినట్లు అనిపించడం వంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇలాంటి విషయాల్లో ఏది నిజం, ఏది నిజం కాదు...ఏం నమ్మాలి.. ఏం నమ్మకూడదనేది పెద్ద కన్ఫ్యూజన్ . మరణం గురించి మనిషికి ముందే తెలిస్తే వారి పరిస్ధితి ఎలా ఉంటుందనేది తరతరాలుగా అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు. ఎవ్వరికీ అంతుబట్టని రహస్యాలు.?

మరణం తర్వాత ఆత్మ ఈ దేహాన్ని విడిచి మరొక కొత్త దేహాన్ని వెతుక్కుంటుందని ఒక మత విశ్వాసం. మరణం తర్వాత వారు చేసిన పాపపుణ్యాల బట్టి ఆత్మకు స్వర్గం కానీ, నరకం కానీ ప్రాప్తిస్తుందని మరొక మత విశ్వాసం. అసలు ఆత్మ అనేది ఉందా? మరణించిన తర్వాత ఏం జరగుతుంది, మరణించిన వారి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి..ఈ అపోహలన్నీ కొన్ని వేల సంవత్సరాల నుండి అలాగే మిగిలిపోతున్నాయి. అయితే ఇవన్నీ నిజామా లేదా కేవలం నమ్మకం మాత్రమేనా..? తెలుసుకోవాలంటే ఈ క్రింద విషయాలను తెలుసుకోవాల్సిందే...

1. జీవితంలో ఉపశమనం

1. జీవితంలో ఉపశమనం

జీవితంలో ఉపశమనం కలుగుతున్న ఫీలింగ్ ఉంటుంది:జీవితంలో ఎన్నో విషయాల్లో మంచిగా మరియు చెడుగా జీవించి ఉంటారు. అయితే జీవితంలో జరిగిన మంచి చెడులున్నీ కూడా కళ్ల ముందు ఒక వీడియోలాగా కనిపిస్తుంది.

2. బ్రైట్ గా శాంతికి చిహ్ననంగా కాంతి కనిపిస్తుంది:

2. బ్రైట్ గా శాంతికి చిహ్ననంగా కాంతి కనిపిస్తుంది:

చాలా వరకు మనష్యులు జీవితం ఇక చివర స్టేజ్ కు చేరుకునే సమయంలో ..కోమా స్థితిలో ఉన్నప్పుడు, వారికి ఏదో ఒక శక్తివంతమైన వెలుగు కనబడుతుంది. ఇలా కనిపించే ఆ వెలుగు వారిని మనసుకు చాలా దగ్గరగా ప్రేమ, ప్రశాంతతో కనిపిస్తుంది. దాంతో మరణం పొందే వ్యక్తి మరణం తర్వాత జీవితానికి సౌకర్యవంతంగా ఫీలవుతాడు.

3. మరణించిన వారు వారి ఆత్మ మాత్రమే కాదు...బాడీ కూడా చూస్తారు:

3. మరణించిన వారు వారి ఆత్మ మాత్రమే కాదు...బాడీ కూడా చూస్తారు:

మరణం తర్వాత ‘‘ఆత్మ మాత్రమే మాదు బాడీ కూడా '' చూడగలుగుతారు. మరణించిన తర్వాత లైఫ్ లెస్ బాడీ క్రింద పడి ఉండటాన్ని గుర్తిస్తారు. చూడగలుగుతారు. మనం మరణించిన తర్వాత జీవం లేని బాడీని మనం చూడగలుగుతామని సైంటిస్ట్ పరిశోధనల్లో తేలింది.

4. డెడ్ రిలేటివ్స్ ను కలుసుకుంటారు :

4. డెడ్ రిలేటివ్స్ ను కలుసుకుంటారు :

మరణించబోతున్న వారు, వారికి దగ్గర బందువులు మరణించిన వారిని చూడగలుగుతారు. మరిణించిన వారికి అత్యంత సన్నిహితంగా ఉండి మరణించిన వారి మాత్రేమే మరణిచిన తర్వాత వారిని కలుసుకోగలుగుతారు

5. మరణించిన తర్వాత ప్రతి ఒక్కరినీ చూడగలుగుతారు మరియు వారి మాటలు వినగలుగుతారు:

5. మరణించిన తర్వాత ప్రతి ఒక్కరినీ చూడగలుగుతారు మరియు వారి మాటలు వినగలుగుతారు:

మరణించిన తర్వాత వారికోసం ఏడ్చే అరుపులు వినగలుగుతారు. ఇంకా వారి కోసం మరణించిన వారి డెడ్ బాడీ వద్ద ఎవరెవరున్నారని కూడా ఆత్మ చూడగలుగుతుంది. బాడీ ప్రాణం లేకుండా నిర్జీవంగా పడి ఉన్నా, వారి ఆత్మ, కాన్సియస్ నెస్ మాత్రం ప్రాణంతో అక్కడే తిరగడాతుంటుంది.

6. ప్రశాంతత:

6. ప్రశాంతత:

మరణం తర్వాత జీవితంలోనికి తిరిగి వచ్చనినప్పుడు వారి చుట్టూ ప్రశాంతత మరియు అనుకూలతను వారి చుట్టు పాజిటివిటిని పొందిన ఫీలిగ్ ను కలిగి ఉంటారు.

7. ఏంజిల్స్ :

7. ఏంజిల్స్ :

మరణించే సమయంలో ఏజిల్స్ ను చూడగలుగుతారు. వారిని తీసుకుపోవడానికి ఏజింల్ డెత్ బెడ్ చుట్టూ కూర్చొన్నట్టుగా చూస్తారు. మరణం వల్ల పొందిన నొప్పి నుండి బయటపడి పైకి లేపి వారి వారి వెంట తీసుకెళ్ళడాని వారి సహాయకులు వచ్చినట్లు భావిస్తారు . కానీ వారున్నప్పుడు వచ్చే శద్దాలు చాలా భయంకరంగా అనిపిస్తాయట..

English summary

Things That Happen To You After Death

Life after death has always been a mystery. From the confessions of people who are back from the dead, their statements can leave one more confused as to what is true and what is not and what to believe and what not to.
Story first published:Saturday, August 6, 2016, 15:07 [IST]
Desktop Bottom Promotion