Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఇంట్లో డబ్బులు ఎక్కడ దాచిపెడితే.. అత్యంత ధనవంతులవుతారు..!!
డబ్బు, నగలు, ఆస్తి అంటే.. మనందరికీ చాలా ఇష్టం, వ్యామోహం. అది అవసరం కూడా. ఎందుకంటే.. డబ్బు లేనిది.. ఏ చిన్న వస్తువు కొనలేం, ఏ చిన్న పని జరగదు. కాబట్టి.. ఎంతో కొంత డబ్బునైనా.. దాచిపెట్టుకోవాలని, పొదుపు చేసుకోవాలని భావిస్తుంటాం.
కానీ చాలామంది డబ్బును ఇంట్లో ఎక్కడపడితే అక్కడ పెట్టేస్తుంటారు. లాకర్స్ లో కాకుండా.. గాబరాగా.. వంటింట్లో, పోపులడబ్బాలో, అలమరాల్లో, బట్టల కింద, పాత పర్స్ లలో ఇలా ఎక్కడ వీలైతే అక్కడ దాచిపెట్టేస్తుంటారు. కానీ.. ఇది ఏమాత్రం మంచిది కాదట. డబ్బులను దాచిపెట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.
మనందరికి ఎంతో కొంత డబ్బు సేవింగ్స్ లో ఉంటాయి. అవి రాత్రికి రాత్రే రెట్టింపు అవ్వాలని కూడా కోరుకుంటాం. అయితే.. మన డబ్బులను కొన్ని విభిన్నమైన ప్లేస్ లలో, కొన్ని వాస్తు నియమాలు పాటిస్తూ పెట్టుకోవడం వల్ల.. చాలా త్వరగా ధనవంతులవుతారట. డబ్బును దాచిపెట్టేటప్పుడు కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. త్వరలోనే సంపన్నులవుతారట.

తూర్పు దిశలో
మీ ఇంటికి తూర్పు దిశలో డబ్బుని, లాకర్ నిపెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల.. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

పడమట దిశలో
పడమర వైపుగా.. నగలు, పూర్వీకులకు సంబంధించిన వస్తువులు, నగలు పెట్టుకోవాలి.

ఉత్తరం వైపుగా
ఉత్తరం వైపుగా తెరిచేలా ఉండే అలమరాలలో నగలు, డబ్బును ఖచ్చితంగా పెట్టాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల.. మీకు డబ్బు కొరత అనేది ఎప్పటికీ రాదు.

దక్షిణం వైపు
మీ ఇంటికి దక్షిణంవైపుగా నగలు, డబ్బును పెట్టుకోవడం వల్ల.. నెగటివ్ ఎఫెక్ట్ ఉండదు. అలాగని పాజిటివ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. కాబట్టి.. ఈ డైరెక్షన్ లో పెట్టుకోకపోవడం మంచిది.

మెట్లు
మెట్ల కిందగానీ, బాత్ రూం ఎదురుగా కానీ.. లాకర్ ని ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు. అలాగే లాకర్ లో ఎక్కువ దుమ్ము, డస్ట్ ఉందంటే.. నెగటివిటీకి దారితీస్తుంది.

లక్ష్మీ ఫోటో
లాకర్ లో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవాలి. అది కూడా.. రెండు ఏనుగులు తొండం పైకి ఎత్తి చూపుతున్నట్టు ఉండే లక్ష్మీ ఫోటోనే లాకర్ లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఫైనాన్స్ పెరుగుతుంది.

ఆగ్నేయం
ఇంటిలోపల.. సంపద, డబ్బు, శ్రేయస్సు, సమృద్ధిని సూచించే వస్తువులను లివింగ్ రూంలో ఆగ్నేయంలో పెట్టుకోవాలి.

వాటర్ ఫౌంటెయిన్
నీటితో ఉండే ఎలాంటి వస్తువు అయినా లేదా వాటర్ ఫౌంటెయిన్ అయినా.. చాలా శుభకరమైనదిగా భావిస్తాం. కాబట్టి.. దీన్ని ఆగ్నేయ మూలలో పెట్టుకోవాలి.

చిన్న ఫౌంటెయిన్
ఒక వేళ పెద్ద వాటర్ ఫౌంటెయిన్ పెట్టడానికి మీకు పరిస్థితులు సహకరించకపోతే.. చిన్న వాటర్ ఫౌంటెయిన్ అయినా.. హాల్ లో పెట్టుకోవాలి.

శుభ్రంగా
వాటర్ ఫౌంటెయిన్ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. దుమ్ము ఉండకూడదు. అలాగే.. ఎప్పుడూ.. నీళ్లు ఫ్లో అవుతూనే ఉండాలి.

లోపలికి
వాటర్ ఫౌంటెయిన్ లో వాటర్ ఫ్లో ఎప్పుడూ.. ఇంటి లోపలివైపుకి ఉండేలా జాగ్రత్త పడాలి. బయటవైపుకు వెళ్తున్నట్టు ఉండకూడదు. బయటకు వెళ్తున్నట్టు ఉంటే.. డబ్బు కూడా బయటకు పోతుందని సంకేతం.

డ్రాగన్ ఫిగర్
వాటర్ ఫౌంటెయిన్ పక్కన డ్రాగన్ బొమ్మ పెట్టుకోవడం వల్ల.. మీ ఇంట్లోకి సిరిసంపదలు.. చాలా వేగంగా వస్తాయి. మీరు త్వరగా సంపన్నులు అవుతారు.

ఆక్వేరియం
డ్రాగన్ ఫిష్ లేదా అవోవానా ఫిష్ ఉండే ఆక్వేరియంను కూడా.. ఆగ్నేయం మూలలో పెట్టుకోవచ్చు. ఇది.. మీ ఇంట్లో సిరిసంపదలు కురిపిస్తుంది.

ఆక్వేరియంలో
అయితే ఆక్వేరియం ఖచ్చితంగా శుభ్రంగా, ఆక్సిజన్ అందేలా ఉండాలి. అలాగే ప్రతిరోజూ.. అందులోని వాటర్ తొలగించి.. మళ్లీ నింపుతూ ఉండాలి. అలాగే చేపకు కూడా.. ఎప్పుడు ఆహారం పెడుతూ.. అది హ్యాపీగా ఉండేలా చూసుకోవాలి.

డైనింగ్ టేబుల్
డైనింగ్ టేబుల్ ని ఎటు వైపుగా, ఎక్కడ పెట్టుకున్నా ఫర్వాలేదు. కానీ.. డనింగ్ టేబుల్ పై అద్ధం రిఫ్లెక్స్ అయ్యేలా ఉండాలి. ఇలా చేయడం వల్ల.. మీ కుటుంబానికి ఎప్పటికీ ఆహారం కొరత రాదు.

ఫ్రెష్ ఫ్రూట్స్
హెల్తీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉన్న ఫోటోని డైనింగ్ రూంలో అతికించాలి. ఇది.. ఆకలిని పెంచుతుంది. మీకు, మీకు కుటుంబానికి కావాల్సినంత ఆహారం లభిస్తుంది.



Click it and Unblock the Notifications











