For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్స్ పాటిస్తున్న భయంకరమైన ఆచారాలు

By Swathi
|

ప్రాచీన సంప్రదాయాలు, ఆశ్చర్యకర ఆచారాలు, మతాచారాలకు ఇండియా పెట్టింది పేరు. ఏ పండుగ చేసినా, ఏ కార్యం చేసినా.. ఏదో ఒక ఆచారం ఉంటుంది. అయితే.. కొన్ని సంప్రదాయానికి, సైన్స్ కి పోలిక కలిగి ఉన్నా.. మరికొన్ని చాలా భయంకరంగా ఉంటాయి. ఇవి ఇండియన్స్ మూఢ విశ్వాసాలను తెలియజేస్తాయి. రకరకాల మతాలు, కులాల ప్రజలు ఇండియా వేదికగా జీవిస్తున్నారు.

ఇండియా గొప్పతనాన్ని వివరించే ఆసక్తికర విషయాలు

పండుగలు, సంప్రదాయాలు భారతీయులకు చాలా ప్రీతికరం. అయితే కొన్ని భారతీయ ఆచారాలు.. కొంచెం ఫన్నీగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. మరికొన్ని చాలా భయంకరంగా, ఒళ్లు జలదరిచ్చేలా ఉంటాయి. ఒక్కో రాష్ర్టం ఒక్కో సంప్రదాయానికి ప్రత్యేకం. అలాగే రాజస్థాన్ లో మహిళలకు మాత్రమే కొన్ని రకాల దుస్తులు పాటించాల్సి ఉంటుంది. మరొకన్ని ప్రాంతాల్లో పెళ్లి కూతుళ్లను బుట్టలో ఎత్తుకుని వచ్చే ఆచారం ఉంటుంది. భారతీయులు ఫాలో అయ్యే ఇంకా ఎన్నో భయంకరమైన, హానికరమైన ఆచారాలు ఇప్పుడు చూద్దాం..

అరేంజ్ మ్యారేజ్

అరేంజ్ మ్యారేజ్

అరేంజ్ మ్యారేజ్ !! ఇది భారతీయులు ఫాలో అవుతున్న సంప్రదాయాల్లో ఒకటి. ప్రపంచమంతా.. అరేంజ్ మ్యారేజ్ ని 18 వ శతాబ్ధంలోనే వదిలేస్తే.. ఇండియా మాత్రం ఇప్పటికీ ఫాలో అవుతూనే ఉంది. తమ జీవిత భాగస్వామిని వాళ్లే సెలెక్ట్ చేసుకునే అవకాశం చాలా తక్కువ. ఈ అరేంజ్ మ్యారేజ్ లో పార్ట్ నర్ ని పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ వెతికిపెడతారు. ఈ పద్ధతి చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది.

పరువు హత్యలు

పరువు హత్యలు

ఇండియాలో భయంకరమైనది పరువు హత్య. పెద్దవాళ్లకు విరుద్ధంగా పెళ్లి చేసుకుంటే.. వాళ్లను చంపేయడానికైనా వెనకాడరు.. కొంతమంది తల్లిదండ్రులు. కుల, మతానికి అతీతంగా పెద్దలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నా.. తక్కువ జాతి వ్యక్తులను పెళ్లి చేసుకున్నా.. హత్యకు గురవుతున్న వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. పరువు హత్య అనేది ఇండియా ఫాలో అవుతున్న మరో దారుణమైన, భయంకరమైన సంప్రదాయం.

వరకట్నం

వరకట్నం

ఇండియాలో పరవళ్లు తొక్కుతున్న మరో ఆచారం వరకట్నం. అమ్మాయికి పెళ్లి చేసి అత్తగారి ఇంటికి పంపేటప్పుడు గతంలో ఏవో బహుమతుల రూపంలో బంగారు నగలు ఇచ్చే వాళ్లు. కానీ ఇప్పుడు డబ్బు, ఆస్తి, చదువు వంటి రకరకాల ఆస్తిపాస్తులను వరకట్నం రూపంలో ఇచ్చే సంప్రదాయం నడుస్తోంది. చాలా మంది భర్తలు కట్నం కోసం భార్యలు చంపిన సన్నివేశాలున్నాయి.

భ్రూణ హత్యలు

భ్రూణ హత్యలు

వరకట్న వేధింపుల కారణంగా.. చాలా కుటుంబాలు అమ్మాయిలు అంటే బరువుగా భావిస్తారు. వాళ్లను పెంచిపోషించి, పెళ్లి చేయడం చాలా పెద్ద బాధ్యతగా ఫీలవుతారు. అంతేకాదు అమ్మాయిలకు సరైన రక్షణ లేకపోవడం వల్ల వాళ్లను జాగ్రత్తగా పెంచడం కూడా కష్టంగా మారిపోయింది. అందుకే.. చాలా మంది ఆడపిల్లలు పుట్టీ పుట్టగానే హత్యకు గురవుతున్నారు.

బాల్య వివాహాలు

బాల్య వివాహాలు

ఇప్పటికీ ఇండియా పాటిస్తున్న సంప్రదాయాల్లో భయంకరమైనది బాల్య వివాహం. ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో చిన్న వయసులోనే పిల్లలకు పెళ్లిళ్లు చేసేస్తున్నారు. భారత ప్రభుత్వం అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేయకూడదని నిబంధన పెట్టినా.. ఇప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి.

పిల్లలను వదిలేయడం

పిల్లలను వదిలేయడం

ఇండియాలో చాలా భయంకరమైన సంప్రదాయం ఇది. మహారాష్ర్టలోని షోలాపూర్ సమీపంలోని బాబా ఉమర్ దర్గాలో ముస్లింలు పిల్లలను వదిలేసే సంప్రదాయం పాటిస్తారు. అలాగే కర్ణాటకలోని ఇండి దగ్గర ఉన్న శాంతేశ్వర్ ఆలయంలో కూడా ఈ సంప్రదాయం ఉంది. దాదాపు 7 వందల ఏళ్ల నుంచి ఈ ఆచారం పాటిస్తున్నారు. ఆ దేవుడి అనుగ్రహం వల్ల పుట్టిన పిల్లలను దాదాపు 50 అడుగుల ఎత్తుపై నుంచి రెండేళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు ఉన్న చిన్నారులను కిందకు వదిలేస్తారు. కింద ఉన్న మనుషులు ఆ పిల్లాడిని పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ పసిబిడ్డకు మంచి జరుగుతుందని ఒక నమ్మకం ఉంది.

దోషం

దోషం

కుజ దోషం అనేది ఇండియన్స్ ఫాలో అయ్యే మరో నమ్మకం. పెళ్లికాని అమ్మాయిలకు కుజదోషం ఉంటే.. వచ్చే భర్తకు మంచిది కాదని.. పెళ్లికి ముందు ఒక చెట్టుకి, లేదా జంతువుకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ దోషం పోతుందని ఒక నమ్మకం భారతీయుల్లో బలంగా ఉంది.

దేవుడికి జుట్టు ఇవ్వడం

దేవుడికి జుట్టు ఇవ్వడం

ఇండియన్స్ ఎక్కువగా ఫాలో అయ్యే సంప్రదాయాల్లో ఇది ఒకటి. మనుషులు తమ జుట్టుని అంతా తీసి గుండు తీయించుకుని.. దేవుడికి సమర్పించడం ఇండియాలో పాపులర్ అయిన ఆచారం. తమ కోరికలు తీర్చిన భగవంతులు జుట్టు సమర్పించడం ఒక ఆచారంగా ఫాలో అవుతారు.

కొరడా దెబ్బలు

కొరడా దెబ్బలు

మొహరం సమయంలో కొరడా దెబ్బలు కొట్టుకునే సంప్రదాయం కేవలం ఇండియానే కాదు పాకిస్తాన్, బంగ్లాదేష్ దేశాలు కూడా ఫాలో అవుతాయి. కొరడా, చెయిన్స్ తీసుకుని ఎవరికి వాళ్లు కొట్టుకుంటూ విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఇలా కొట్టుకోవడం వల్ల రక్తం కారుతూ ఉంటుంది. కానీ.. ఎలాంటి దెబ్బ తగలదని.. మూఢనమ్మకం ఉంది.

అఘోరా

అఘోరా

ఇండియాలో మరో ఆచారం ఆఘోరాలు. వీళ్లు శివ భక్తులు. శివుడిని ఎక్కువగా ఆరాధించే వీళ్లు ఎలాంటి అలవాట్లు ఉండవు. శరీరమంతా విభూధి ధరిస్తారు.

English summary

Top 10 Shocking Rituals in India

Top 10 Shocking Rituals in India. India is a land of the oldest, most magical cultures, religions and customs. People of different religions live in the vast country.
Story first published: Wednesday, January 27, 2016, 13:00 [IST]