Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకున్న స్టార్స్ వీరే.. !
అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ లాగే కామన్. అలాగే ఇంటర్ క్యాష్ట్ మ్యారేజ్ గురించి కూడా తరచుగా వింటూ ఉంటాం. ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ చాలా అరుదుగా జరుగుతాయి. కానీ.. ఈ ట్రెండ్ బాలీవుడ్ లో చాలా కామన్ గా వినిపిస్తూ ఉంది. కాకపోతే.. ఆడియన్స్ కి దీనిపై పెద్దగా అవేర్ లేకపోవచ్చు.
బాలీవుడ్ లో టాప్ ప్లేస్ ఉన్న హీరో, హీరోయిన్స్, డైరెక్టర్స్, పాపులర్ యాక్టర్స్ మతానికి అతీతంగా పెళ్లి చేసుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు. బాలీవుడ్ లో మతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్న సెలబ్రెటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం..

షారుక్, గౌరి
బాలీవుడ్ మోస్ట్ పాపులర్ యాక్టర్ షారుక్ ఖాన్ ది మతానికి అతీతంగా జరిగిన పెళ్లి. 1984లో న్యూ ఇయర్ పార్టీలో గౌరీ చిబ్బర్, షారుక్ కలిశారు. అప్పుడు షారుక్ కి 18 ఏళ్లే. అయినే అప్పుడే.. లవ్ లో పడ్డారు. గౌరి బ్రాహ్మిణ్ హిందూ ఫ్యామికి చెందినది. షారుక్ ముస్లిం. కానీ ఇంట్లో వాళ్లను ఒప్పించడానికి చాలా కష్టపడి 1991 అక్టోబర్ 25న వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

సైఫ్, కరీనా
బెబో ట్రెడిషినల్ పంజాబీ ఫ్యామిలీకి చెందినది కాగా.. సైఫ్ అలీ ఖాన్ పటౌడీ కుటుంబానికి చెందిన వ్యక్తి. కానీ.. ఇద్దరూ వాళ్ల మతాలకు అతీతంగా ఒక్కటై.. పెళ్లి చేసుకున్నారు. సైఫ్ కి ఇంతకు ముందే పెళ్లి అయి విడిపోవడం, పటౌడీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కావడంతో.. కరీనా తన తల్లిని ఒప్పించడం కాస్త కష్టంగా ఉన్నింది. చివరికి చెల్లెలు కరిష్మా సహకారంతో.. ఇద్దరూ 2014 అక్టోబర్ 16న పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.

అమీర్ ఖాన్, కిరణ్ రావ్
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ గతంలో రీనా దత్తాను వివాహమాడి 2002లో విడిపోయారు. లగాన్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కిరణ్ రావ్ ని కలిసిన అమీర్.. ప్రేమలో పడ్డాడు. 2011లో పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరి మతాలు వేరువేరు.

హృతిక్ రోషన్, సుశాన్నే ఖాన్
పంబాజీ ఫ్యామిలీ నుంచి వచ్చిన హృతిక్ రోషన్, ముస్లిం కుటుంబానికి చెందిన సుశాన్నే ఖాన్ పెళ్లి చేసుకోవడం బాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ అనే చెప్పాలి. వీళ్లిద్దరూ చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటూ వచ్చి.. 2000 డిసెంబర్ 20న పెళ్లితో ఒక్కటయ్యారు.

అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా
అర్భాజ్ ఖాన్ ఖాన్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాగా.. మలైరా అరోరా హిందూ ఫ్యామిలీకి చెందిన బ్యూటీ. వీళిద్దరూ 1998లో పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఇద్దరు కొడుకులున్నారు.

జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్
వీళ్లిద్దరిదీ కూడా మతానికి అతీతంగా జరిగిన పెళ్లే. మరాఠీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి రితేష్ కాగా.. జెనీలియా.. క్రిస్టియన్. వీళ్లద్దరి పెళ్లి రెండు సంప్రదాయ పద్ధతుల్లోనూ జరిగింది. మరాఠీ సంప్రదాయంలోనూ, చర్చిలోనూ వీళ్ల వివాహం గ్రాండ్ గా జరిగింది.

అమ్రితా అరోరా, షకీర్
వీళ్లిద్దరి పెళ్లి కూడా మతాలకు అతీతమైనదే. ట్రెడిషనల్ ముస్లిం నిఖాతో పాటు, చర్చి మ్యారేజ్ చేసుకున్నారు. అమ్రితా పంజాబ్ క్యాథలిక్ బ్యాక్ గ్రౌండ్ కలిగి ఉంటే.. షకీర్ ముస్లిం ట్రెడిషనల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. వీళ్లిద్దరి పెళ్లి 2009లో జరిగింది.

ఫరా ఖాన్, షిరీష్ కుందర్
బాలీవుడ్ ఫిల్మ్ సెట్స్ లో హిందూ, ముస్లింలు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఫరా ఖాన్ ముస్లిం ఫ్యామిలీ కాగా, శిరీష్ కుందర్ హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి. వీళ్లిద్దరూ 2004లో పెళ్లి చేసుకున్నారు. మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే.. ఫరా ఖాన్ శిరీష్ కంటే.. 8 ఏళ్లు పెద్దది కావడం.



Click it and Unblock the Notifications