Latest Updates
-
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే..
సెంచరీలు కొట్టే సూపర్ స్టార్స్ ఫాలో అయ్యే సెంటిమెంట్స్..!!
ఇండియాలో సినీ స్టార్స్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్నవాళ్లు ఎవరంటే.. క్రికెటర్స్. గ్రౌండ్ లో సిక్స్ లు, ఫోర్లతో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే ఈ సూపర్ స్టార్స్ క్రికెటర్స్ అంటే.. ఫ్యాన్స్ కి ఫుల్ క్రేజ్. క్రికెట్ అంటే.. అంతులేని అభిమానం ఇండియన్స్ లో ఉంది. అయితే ఈ క్రికెటర్స్ కి సంబంధించి మీకు వాళ్ల బ్యాటింగ్, ఫీల్డింగ్ హిస్టరీ గురించి తెలిసి ఉండవచ్చు. కానీ.. మీకు తెలియని ఇంకా ఎన్నో ఫ్యాక్ట్స్ ఉన్నాయి.
మీకు ఇష్టమైన క్రికెట్ స్టార్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాం. చాలా వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక మూఢ నమ్మకం ఫాలో అవుతుంటారు. లేదా సెంటిమెంట్ బాగా నమ్ముతారు. మన జీవితంలో సక్సెస్ అవడానికి మనం మంచి రోజు, మంచి సమయం, లక్కీ థింగ్ గురించి ఆలోచిస్తాం. మరి ఇండియా మొత్తం ఆరాధించే క్రికెటర్స్ నమ్మే సెంటిమెంట్ ఏంటి ? మీ ఫేవరేట్ క్రికెటర్ ఫాలో అయ్యే లక్కీ ఛార్మ్ ఏంటి ? తెలుసుకోవాలంటే.. ఈ ఆర్టికల్ చదవాల్సిందే..

సచిన్ టెండూల్కర్
గాడ్ ఆఫ్ క్రికెట్ గా పిలిచే సచిన్ టెండూల్కర్ ఫాలో అయ్యే సెంటిమెంట్ మిమ్మల్ని ఆశ్చరపరుస్తుంది. ఈ క్రికెటర్ రైట్ ప్యాడ్ ముందుగా కట్టుకోవడాన్ని లక్కీగా ఫీలవుతాడట.

రాహుల్ ద్రావిడ్
తన బ్యాటింగ్ సమయానికి వచ్చే సరికి రాహుల్ ద్రవిడ్ కూడా సెంటిమెంట్ కి ఇంప్రెస్ అయిపోతాడు. అందుకే.. తన కుడి కాలుకే మొదటగా తై ప్యాడ్ కట్టుకుంటాడు.

సౌరవ్ గంగూలి
సౌరవ్ గంగూలి తన పాకెట్ లో ఎప్పటికీ.. తన గురూజీ ఫోటో పెట్టుకుంటాడు. ఏ మ్యాచ్ జరిగినా.. ఆ ఫోటో తనతో పెట్టుకోవడం తన విజయానికి ప్రోత్సాహాన్నిస్తుందని నమ్ముతాడు.

వీరేంద్ర సెహ్వాగ్
మొదట్లో వీరేంద్ర సింగ్ సెహ్వాగ్.. 44 వ నంబర్ జాకెట్ వేసుకోవడం లక్కీగా ఫీలయ్యేవాడు. కానీ తర్వాత తన న్యూమరాలజిస్ట్ సలహాతో.. ఏ నెంబర్ లేని జాకెట్ వేసుకుంటున్నాడు.

యువరాజ్ సింగ్
యువరాజ్ సింగ్ 12 వ తేదీ, 12వ నెల, మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు. అలా అన్నింటిలోనూ 12 ఉండటంతో.. యువరాజ్ కి 12 అదృష్ట సంఖ్యగా మారిపోయింది. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ల అమ్మ యువరాజ్ చేతికి నలుపు రంగు దారం కట్టింది. ఈ సెంటిమెంట్ కూడా ఫాలో అవుతాడు ఈ క్రేజీ క్రికెటర్.

విరాఠ్ కోహ్లీ
విరాఠ్ కోహ్లీ తన చిన్నతనం నుంచే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. రన్స్ ఎక్కువగా చేసినప్పుడు వేసుకున్న గ్లౌజులనే ఉపయోగించడం ఇతని సెంటిమెంట్.

ధోనీ
క్రికెట్ ఫీల్డ్ లో తనకు సక్సెస్ తీసుకొచ్చిన నంబర్ 7. తాను జులై 7న పుట్టాడు. అందుకే.. ఈ స్టార్ క్రికెటర్.. తన కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి.. 7 నెంబర్ ఉన్న జాకెట్ మాత్రమే వేసుకుంటాడు. అదే ధోనీ ఫాలో అయ్యే సెంటిమెంట్ కాబోలు.

ఝహీర్ ఖాన్
ప్రతి ముఖ్యమైన కాంటెస్ట్ కి.. ఝహీర్ ఖాన్ ఎల్లో కలర్ హ్యాండ్ కర్చీఫ్ పట్టుకెళ్లడం తన సెంటిమెంట్.

రవి ఆశ్విన్
2011 వరల్డ్ కప్ ఆడేటప్పుడు రవి అశ్విన్ ఒక బ్యాగ్ తీసుకెళ్లాడు. అంతే అప్పటి నుంచి ఏ మ్యాచ్ కి వెళ్లినా.. ఆ బ్యాగ్ తనతో కంపల్సరీ ఉండాల్సిందే అని భావించాడు. అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు.

సునీల్ గవాస్కర్
సునీల్ గవాస్కర్ ఎంత చలిగా ఉన్నా.. ఎక్కడ మ్యాచ్ జరిగినా.. తాను మాత్రం జాకెట్ లేకుండా మ్యాచ్ ఆడేవాడు. ఢిల్లీ క్లైమెట్ లో కూడా.. స్వెట్టర్ లేకుండానే మ్యాచ్ ఆడటం ఈ క్రికెటర్ అలవాటు. దీనివెనక ఉన్న అసలు రహస్యం సెంటిమెంట్. స్వెటర్ లేకుండా ఆడితే సక్సెస్ వస్తుందనే గవాస్కర్ సెంటిమెంట్.

అనిల్ కుంబ్లే
అనిల్ కుంబ్లే తన క్యాప్, స్వెటర్ పట్టుకోవడానికి సచిన్ కి ఇవ్వడం సెంటిమెంట్ గా నమ్ముతాడు.



Click it and Unblock the Notifications
