Latest Updates
-
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.!
చెవులు గురించి మీకు తెలియని కొన్ని వాస్తవాలు...
జ్ఝానేంద్రియాల్లో ఒకటి చెవులు. మానవ శరీరంలో చెవులు వినడానికి దేవుడు సృష్టించిన ఒక అద్భుత అవయవం. చెవులు వినడం మాత్రమే కాదు, శరీరంను బ్యాలెన్స్ చేస్తాయి. దేవుడుచెవులు వినబడేలా చాలా అద్భుతమైన ఆకారాన్ని సృష్టించాడు. మన శరీరంలో చెవులు చాలా సున్నితమైన అవయవం. చెవులు మనకు శబ్దాలను, మాటలను వినబడేలా చేయడం మాత్రమే కాదు, ఆ శబ్దాలను బట్టే ఇతరులతో మనం కమ్యూనికేట్ చేయగల శక్తి సామర్థ్యాలను పొందాము.
అటువంటి సున్నితమైన, ఉపయోగకరమైన చెవులను చాలా ఆరోగ్యంగా, జాగ్రత్తగా చూసుకోవాలి. బిగ్గర శబ్దాలకు దూరంగా ఉండాలి. అలాగే అతి జాగ్రత్తలకు పోయి ఇయర్ బడ్స్, కాటన్ తో చెవులను శుభ్రం చేస్తుంటారు . ఇవి కర్ణబేరికి తగలడం వల్ల చెవులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అలాగే ఇయర్ ఫోన్స్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇయర్ ఇన్ఫెక్షన్స్ కు కారణమవుతుంది.

చెవుల గురించి మనకు ఆరోగ్య పరంగా, అందం పరంగా మాత్రమే తెలుసు. కానీ చెవుల గురించి మీకు తెలియని కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి . చెవుల్లో వాక్స్ (గుమిలి)ఉండటం కూడా మన చెవులకు ఒక విధంగా రక్షణ వంటిదే. చెవిలో దుమ్ము, ధూళి, క్రిమికీటకాలను శరీరంలోనికి ప్రవేశించకుండా వాక్స్ అడ్డు పడి, చెవులకు , శరీరానికి రక్షణ కల్పిస్తుంది .
చెవుల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.. అవేంటో తెలుసుకుందాం..

చెవులు వాటంతటవే శుభ్రం చేసుకుంటాయి: చెవుల్లో ఉత్పత్తి అయ్యే ఇయర్ వాక్స్ ను చెవులకు రక్షణ కల్పిస్తాయి. ఇయర్ వాక్స్ చెవుల్లో ఎక్కువైనప్పుడు, గాలి ద్వారా అది బయటకు నెట్టివేయబడుతుంది. చెవిలో ఉండే చిన్నకేశాలు(సిలియా) దీన్ని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది.

చెవిలోపల శబ్దం: ఈ శబ్దాన్ని మనం ఆవిలించడం వల్ల గ్రహించవచ్చు. మనం బయటకు ఆవిళించే శబ్దం మనకు చెవిలోపలికి ఎలా వినపడుతుంది? ఆవిలించేటప్పుడు, చెవికి సంబంధించిన ఒక ట్యూబ్ ఓపనై చెవి మద్య భాగంలో ఒత్తిడి పెంచుతుంది. దాంతో గాలి ఫోర్స్ గా బయటకు వస్తుంది. ఇది కూడా ఒక రకంగా చెవులకు రక్షణ కల్పించబడినట్లే.

చెవులు శరీరంను బ్యాలెన్స్ చేస్తాయి: చెవులు వినడుటకు మాత్రమే కాదు, శరీరంను బ్యాలెన్స్ చేయడంలో కూడా సహాయపడుతుంది. దాంతో మనం పడిపోకుండా, సరిగా నిల్చోవచ్చు. అలాగే మన తలను కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఇది చెవిలో విస్టుబులర్ అపరాటస్ అనే చెవి బాగం బ్యాలెన్స్ ఫంక్షనింగ్ ను మెయింటైన్ చేస్తుంది.

మోషన్ సిక్ నెస్: సాధారణంగా ప్రయాణాల్లో వాంతులు వికారానికి గురి అవుతుంటారు. ఈ సమస్య పొట్టకు సంబంధించినది కాదు. వామిటింగ్ రిఫ్లక్స్ చెవిలోపలి నుండి ప్రారంభమవుతుంది . చెవిలోపలి బాగం (వెస్టిబులర్ అపరట్టస్) బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్ల, చెవి డిస్టర్బ్ అవుతుంది. దాంతో మోషన సిక్ నెస్ కు గురి అవుతారు .

చెవులు వినపడకపోవడం అనేది ఎప్పటిక సాధ్యం కాదు: చెవులు ఎప్పుడూ వాటి పనులు అవి నిర్విర్తుంటాయి . నిద్రించే సమయంలో కూడా చెవులు పనిచేస్తుంటాయి . నిద్రించేటప్పుడు చెవులు వినపడకపోవడానికి కారణం బ్రెయిన్ రెస్ట్ లో ఉంటుంది మరియు వినికిడి శక్తిని తగ్గించి ఉంటుంది.

చెవిటితనంకు ఒక సాధారణ కారణం : సహజంగా చెవులు చాలా సున్నితమైనవి. మనం వినగలిగేంత శబ్దం కంటే ఎక్కువ అంటే 86 డిసిబుల్స్ లేదా దానికంటే ఎక్కువ శబ్దాలను విన్నప్పుడు వినికిడిశక్తిని కోల్పోతారు. ఇటువంటి చెవి సమస్య కేవలం శబ్దాల వల్ల మాత్రమే కోల్పోతారు. సాధరణంగా మనకు ఉండే వినికిడి శక్తి 60 డిసిబుల్స్ .

చెవిలో ఉండే అతి చిన్న వెంట్రుకలు వినబడుటకు సహాయపడుతాయి: చెవిలోపలి బాగంలో ఉండే చిన్న హెయిర్ మనకు శబ్దాలను వినబడుటకు అనుమతిస్తుంది . ఈ చిన్నటి హెయిర్ శబ్దాల యొక్క తరంగాలను బ్రెయిన్ కు ట్రాన్సఫర్ చేస్తుంది . దాంతో బ్రెయిన్ శద్దాలను గ్రహించి అర్ధం చేసుకుని తిరిగి మనం రియాక్ట్ అయ్యేలా సూచిస్తుంది. . చెవిలోపలి ఈ చిన్న హెయిర్ కు డ్యామేజ్ జరిగితే చెవులు వినపడవు. ఈ చిన్న హెయిర్ తిరిగి పెరగవు కాబట్టి, శాశ్వతంగా వినికిడి శక్తిని కోల్పోతారు.

వింత అనుభూతి కలిగిస్తుంది:ఎత్తైన ప్రదేశాల్లో లేదా దూరప్రదేశాలకు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, విమానాల్లో ప్రయాణించే వారు సరిగా మాట్లాడలేరు. వారికి సరిగా వినపడదు . చెవులకుండే ఒక వింత అనుభూతి ఇది. అందుకు కారణం చెవిలోపల ఉండే Eustachian tube మన శరీరం యొక్క ప్రెజర్ ను మెయింటైన్ చెయ్యలేదు..



Click it and Unblock the Notifications