For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ప్రస్తుతం చేస్తున్న జాబ్ మానేయాలని తెలిపే సంకేతాలు..

By Swathi
|

లైఫ్ లో జాబ్ ఎంత అవసరమో.. అది మనకు నచ్చినట్టు ఉండటం కూడా అంతే అవసరం. జాయిన్ అయినప్పుడు ఎలా ఉంటుందో.. చివరి వరకు అలానే ఉండాలన్న గ్యారెంటీ లేదు. అలాగే ఉండదు అన్న గ్యారెంటీ అంతకన్నా లేదు.

అయితే ప్రతి ఒక్కరూ జాబ్ చేస్తున్నప్పుడు ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కొంతమంది కెరీర్ చాలా వేగంగా గ్రోత్ అయితే.. కొంతమంది కెరీర్ చాలా నెమ్మదిగా ఉంటుంది. దీనివల్ల వాళ్లు వ్యక్తిగతంగా చాలా ఒత్తిడికి లోనవుతారు. ఇలాంటి అన్ హ్యాపీ సందర్భాల్లో అలాంటి ఆలోచనలను పక్కనపెట్టి.. కొత్త జాబ్ వెతుక్కోవడం మంచిది.

అయితే ఎప్పుడు ఒక వ్యక్తికి కెరీర్ చేంజ్ అవసరమవుతుంది ? మానసికంగా చాలా ఒత్తిడికి గురయినప్పుడు మారడం చాలా మంచిది. లేదంటే.. పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. అయితే కొన్ని లక్షణాలను గుర్తించి.. ఇవి మీలో కనిపిస్తూ ఉంటే.. ఖచ్చితంగా మీరు జాబ్ చేంజ్ అవడం మంచిది.

మరి ఎలాంటి వార్నింగ్ సంకేతాలు.. మీరు వెంటనే జాబ్ మారాలని తెలుపుతాయో ఇప్పుడే చూడండి..

ఆదివారం రాత్రి ఆందోళన

ఆదివారం రాత్రి ఆందోళన

ఆదివారం రాత్రి అవుతోందంటే..మీలో ఆందోళన కనిపించడం, ఉదయాన్నే ఎలాంటి మెయిల్స్ వస్తాయో, ఎంత ఒత్తిడి పెంచుతారో అన్న ఆందోళ మీలో కనిపిస్తోంది అంటే.. మీరు చాలా ఒత్తిడిలో ఉన్నారని తెలుస్తోంది. ఇలాంటి ఆందోళన వల్ల మీరు నిద్రను కోల్పోతున్నారంటే.. మీరు ఖచ్చితంగా ప్రస్తుతమున్న జాబ్ ని వదిలేసి.. మరొకటి చూసుకోవడం మంచిది.

ఫ్యూచర్ డల్ గా కనిపించడం

ఫ్యూచర్ డల్ గా కనిపించడం

మీరు ప్రస్తుతం చేస్తున్న జాబ్ లో గ్రోత్ కనిపించకపోవడం. విదేశాలకు వెళ్లడం, ప్రమోషన్ వంటివి ఎంత కాలమైనా రాకపోవడం వంటి సంకేతాలు మీరు ఫేస్ చేస్తున్నారంటే.. మీ కెరీర్ చాలా డల్ గా ఉందని సూచిస్తుంది. కాబట్టి.. ఇలాంటి పరిస్థితిలో మీరు ఉంటే.. వెంటనే జాబ్ మానేయడం చాలా అవసరం.

మీ డ్రీమ్

మీ డ్రీమ్

మీకు ఇష్టమైన వర్క్ ని మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారంటే.. కారణం తెలుసుకోవాలి. ఉన్నట్టుండి కెరీర్ లో కిందకి పడిపొవడానికి కారనాలు అన్వేషించాలి. ప్రస్తుతమున్న ఆఫీస్ ని మీరు ఇష్టపడటం లేదు అంటే.. మీ చుట్టూ నెగటివ్ మనుషులు ఉన్నారని గ్రహించాలి. కాబట్టి.. మీరు జాబ్ మారే సమయం వచ్చిందని గ్రహించాలి.

అండర్ ఎస్టిమేట్

అండర్ ఎస్టిమేట్

మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారని గుర్తిస్తే.. మీరు నిరుత్సాహానికి గురవుతున్నట్టే. ఈ ఒక్క కారణం వల్ల మీరు హార్డ్ వర్క్ చేయలేరు. ప్రతి రోజూ పని చేయడానికి మిమ్మల్ని మీరు బలవంతంగా.. లాగుతున్నారంటే.. వెంటనే వేరే జాబ్ చూసుకోవడం మంచిది.

సాలరీ

సాలరీ

మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ.. మీకు రావాల్సినంత సాలరీ రావడం లేదు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. పనిచేసినప్పుడు గుర్తింపు, అభినందనలు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అది మిస్ అవుతున్నప్పుడు ఆ జాబ్ మానేయడమే మంచిది.

బాస్ తో సమస్యలు

బాస్ తో సమస్యలు

తరచుగా మీ బాస్ తో గొడవలు, సమస్యలు ఎదురవుతున్నాయంటే.. మీరు జాబ్ మారడమే మంచిదని తెలుస్తోంది. అలాగే సహోద్యోగులు కూడా.. తరచుగా మిమ్మల్ని సమస్యల్లోకి లాగడం లేదా సమస్యలు తీసుకురావడం చేస్తున్నాంటే.. అలాంటి వాతావరణం నుంచి బయట పడటం మంచిది.

వర్కింగ్ డే అంటే ఆందోళన

వర్కింగ్ డే అంటే ఆందోళన

రోజూ ఆఫీస్ కి వెళ్తున్నా.. ఇష్టంలేకపోయినా పనిచేయడం, మళ్లీ మరుసటి రోజు ఆఫీసుకి రావాలంటే.. ఇష్టపడకపోవడం, వర్కింగ్ డే ఎప్పుడు పూర్తవుతుందా అన్న కోరిక పెరగడం వంటి సంకేతాలన్నీ.. మీరు జాబ్ మారాలని సూచిస్తాయి.

English summary

Warning Signs You Need A Career Change

Warning Signs You Need A Career Change. Often, there comes a time in one's life when people would not like the phase they are going through.
Story first published:Friday, July 8, 2016, 16:52 [IST]
Desktop Bottom Promotion